S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/08/2018 - 21:14

అర్జున్‌రెడ్డి చిత్రంతో స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ తన కెరీర్ స్టార్టింగ్‌నుండి తన చిత్రాల్ని ప్రమోట్ చేసుకునే విధానం కొత్తగా వుండటమే కాకుండా ఆడియన్స్‌కి స్ట్రయట్‌గా రీచ్ అయ్యేలా తన స్టేట్‌మెంట్ వుంటుంది. ఎక్కడా మిడిల్ డ్రాప్‌లు వుండవనేది అర్జున్‌రెడ్డిని ప్రమోట్ చేసిన విధానంలోనే అందరికీ తెలిసింది.

07/08/2018 - 21:12

పేదలే ఆప్తులుగా వసుధైక కుటుంబంగా సాగుతున్న సేవాసంస్థ మనం సైతంలో నేనూ ఉన్నానంటూ ముందుకొచ్చారు సూపర్ స్టార్ కృష్ణ. ఆయన సతీమణి గిన్నీస్‌బుక్ రికార్డ్స్ హోల్డర్ దర్శకురాలు విజయ నిర్మలతో కలిసి సూపర్ స్టార్ కృష్ణ మనం సైతంకు విరాళం అందజేశారు. కృష్ణ, విజయనిర్మల చెరో 2 లక్షల రూపాయలు మనం సైతంకు అందజేశారు.

07/08/2018 - 21:10

సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ‘గురు’ చిత్రం తరువాత కొంత విరామం తీసుకొని ఇటీవల వరుసగా సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. దాంట్లో భాగంగా ప్రస్తుతం మెగా హీరో వరుణ్‌తేజ్‌తో కలిసి ఎఫ్ 2 అనే మల్టీస్టారర్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఇక ఈ చిత్రం తరువాత బాబి దర్శకత్వంలో నాగ చైతన్యతో కలిసి మరో మల్టీస్టారర్ చిత్రంలో నటించనున్నాడు.

07/08/2018 - 21:08

అందాల భామ శృతిహాసన్ ఈమధ్య ఎక్కడా కనిపించడం లేదు. ఆమధ్య పవన్‌తో చేసిన కాటమరాయుడు సినిమాలో కనిపించిన ఈ అమ్మడు కమల్‌హాసన్‌తో కలిసి శభాష్‌నాయుడు సినిమా చేసింది. అయితే ఈ సినిమా రెండేళ్లు కావొస్తున్నా విడుదలకు నోచుకోలేదు. ఇక కొత్త సినిమాలు కూడా ఒప్పుకోవడం లేదు. చేతిలో సినిమాలు లేవు కాబట్టి.. బొద్దుగా మారింది. ఈమధ్యే ప్రేమాయణం..

07/08/2018 - 21:07

తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తూ వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటున్న కన్నడ భామ సంజన ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు టీవీ సీరియల్‌లో కూడా నటిస్తోంది. తాజాగా ఆమె నటించిన స్వర్ణఖడ్గం త్వరలో టీవీలో ప్రసారం కానుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ అమ్మడు స్పందిస్తూ, తానూ ఓ వ్యక్తితో ప్రేమలో పడ్డానని చెప్పింది. ఓ హీరోయిన్ ఇలా తాను ప్రేమలో ఉన్నానని చెప్పడం నిజంగా సినిమా ప్రేక్షకులకు కాస్త షాకిచ్చే విషయమే.

07/06/2018 - 22:14

సుశాంత్ నటించిన ‘చి ల సౌ’ సినిమాతో హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారారు. రుహాని శర్మ హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. చిలసౌ సినిమా కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్, సిరుని సినీ కార్పొరేషన్‌తో అనుబంధం ఏర్పరచుకుంది. అన్నపూర్ణ సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. ఇటీవల విడుదలైన చిలసౌ చిత్ర టీజర్‌కు మంచి స్పందన లభించింది.

07/06/2018 - 22:10

మహనీయుడు ఎన్టీఆర్ బయోపిక్ చిత్ర షూటింగ్ ఈరోజు ప్రారంభమైన సందర్భంగా ఈరోజును చారిత్రాత్మక రోజుగా పరిగణించవచ్చు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కబోతున్న ఎన్టీఆర్ సినిమాలో నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్‌లో కనిపించబోతున్నారు. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ గురువారం ప్రారంభం అయ్యింది. స్వర్గీయ నందమూరి తారక రామారావు తన మొదటి సినిమా రంగ ప్రవేశం ‘మనదేశం’ సినిమాతో జరిగింది.

07/06/2018 - 22:15

హెబ్బాపటేల్, అరుణ్ అదిత్ జంటగా నటించిన ‘24 కిస్సెస్’ సినిమా ఫస్ట్‌లుక్ ఇంటర్నేషనల్ కిస్సింగ్ డే సందర్భంగా విడుదల చేసారు. ‘మిణుగురులు’ చిత్ర దర్శకుడు అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘మిణుగురులు’ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందడమే కాకుండా పలు అవార్డ్స్ సొంతం చేసుకుంది. ‘నీకో సగం నాకో సగం ఈ ఉత్సవం’ ట్యాగ్‌లైన్‌తో ఉన్న ఈ పోస్టర్ అంచనాలను పెంచింది.

07/06/2018 - 21:56

మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్‌దేవ్ తొలి చిత్రం ఈనెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా, ఆ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించిన కె.కె.సింథిల్‌కుమార్ కాస్సేపు ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే... ‘‘నేను బాహుబలి తరువాత ఏ చిత్రం చేయాలనే గందరగోళంలో ఉన్న సమయంలో ఒక రోజు నేను రాజవౌళి ఫామ్‌హౌస్‌లో నిర్మాత సాయి కొర్రపాటిగారిని కలుసుకున్నాను. అప్పుడు ఆయన విజేత గురించి చెప్పారు.

07/06/2018 - 22:03

రామాయణంలో బాగా గుర్తున్న పేరు. లక్ష్మణుడి చేతిలో అవమానం పాలై.. అన్న రావణుడితో చెప్పి సీత అపహరణకు ప్రధాన కారణంగా నిలుస్తుంది. అసలు రామాయణం జరగడానికి ప్రత్యక్ష కారకురాలిగా మారిన శూర్పణఖ తరహా పాత్రలో నటించేందుకు అందాల చందమామ కాజల్ రెడీ అయింది? ఇప్పటివరకూ గ్లామర్ హీరోయిన్‌గా ఓ రేంజ్ ఇమేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు మొదటిసారి లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తుంది.

Pages