S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/05/2018 - 22:52

హీరో కార్తీ నటించిన చినబాబు టీజర్‌ను కార్తీ అన్న హీరో సూర్య విడుదల చెయ్యడం జరిగింది. టీజర్‌కు అన్ని వర్గాల ప్రేక్షకులనుండి అద్భుతమైన స్పందన లభిస్తోంది. రైతు పాత్రలో కార్తీ కనిపించబోతున్నాడు. గ్రామీణ నేపథ్యంలో జరిగే ఒక రైతు గురించి సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. చినబాబు టీజర్‌లో కార్తీ డైలాగు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ‘పుట్టించినవాడు దేవుడైతే..

06/05/2018 - 22:54

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కాలా’. వండర్ బార్ ఫిలింస్ ప్రై. లి., లైకా ప్రొడక్షన్స్ పతాకాలపై ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్ 7న సినిమా విడుదలవుతుంది.

06/05/2018 - 22:53

శ్రీకరణ్, అమృత, నిషా, దివ్య, ప్రీతి నాయకా నాయికలుగా శ్రీ కిరణ్ ప్రొడక్షన్స్ పతాకంపై నంది వెంకటరెడ్డి దర్శకత్వంలో శ్రీకాంత్ గొంటి నిర్మిస్తున్న చిత్రం ‘బెస్ట్ లవర్స్’. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకు సోమవారం ఉదయం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర హీరో శ్రీకరణ్ మాట్లాడుతూ- సోషల్ మీడియా నేపథ్యంలో సాగే అందమైన లవ్‌స్టోరీ ఇది. ఒకర్ని ఒకరు చూసుకోకుండానే ప్రేమించుకుంటారు.

06/04/2018 - 22:46

ఆర్‌ఎక్స్ 100 టీజర్‌కి యూట్యూబ్‌లో ఆరు లక్షల వ్యూస్ వచ్చాయి. ఓ చిన్న చిత్రం టీజర్‌కి ఇన్ని వ్యూస్ రావడం అరుదైన విషయం. టీజర్ విడుదలైనప్పటినుంచి బిజినెస్ వర్గాల్లో సినిమాకు క్రేజ్ విపరీతంగా పెరిగింది అని అంటున్నారు అశోక్‌రెడ్డి గుమ్మకొండ. కెసిడబ్ల్యూ బ్యానర్‌పై అశోక్ రెడ్డి గుమ్మనకొండ నిర్మిస్తున్న చిత్రం ఆర్‌ఎక్స్ 100. రాంగోపాల్‌వర్మ శిష్యుడు అజయ్ భూపతి ఈ సినిమాకు దర్శకుడు.

06/04/2018 - 22:45

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం సోమవారం నుంచి మరో షెడ్యూల్ మొదలైంది. ఈ భారీ షెడ్యూల్ ఏకధాటిగా ఈనెలాఖరువరకూ జరుగుతుందట. ఎన్టీఆర్‌తోపాటు పలువురు ముఖ్య తారాగణం పాల్గొనే సన్నివేశాలను చిత్రీకరిస్తారట. దాంతో దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తికానుంది.

06/04/2018 - 22:43

బాహుబలి లాంటి సంచలన విజయం తరువాత దర్శకుడు రాజవౌళి తదుపరి చిత్రం ఏదనే ఆసక్తి అందరిలో నెలకొన్న విషయం తెలిసిందే. దాంతో కొద్ది గ్యాప్ తరువాత ఇద్దరు స్టార్ హీరోలతో మల్టీస్టారర్ చేస్తానని చెప్పడంతో ఆసక్తి మరింత ఎక్కువైంది. దానికి కారణం, ఒకరు నందమూరి హీరో అయితే, మరొకరు మెగాహీరో. ఈ ఇద్దరి కలయికలో సినిమా అంటే సాధారణ ప్రేక్షకుడికి కూడా విపరీతమైన ఆసక్తే.

06/04/2018 - 22:40

టాలీవుడ్‌లో సంచలనం క్రియేట్ చేసిన అర్జున్‌రెడ్డి సినిమా ఓ రేంజ్ క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమాతో ఒక్కసారిగా హీరో విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక ఆ సినిమా సంచలన విజయంతో పరభాషల్లో రీమేక్ చేయడానికి క్రేజీ ఆఫర్స్ వచ్చాయి. ఇప్పటికే తమిళంలో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా రీమేక్ అవుతుండగా... హిందీలో షాహిద్ కపూర్ రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాకు సందీప్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.

06/04/2018 - 22:38

నేచురల్ స్టార్‌గా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాని తనదైన నటనతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆయన, మొదటిసారి బిగ్‌బాస్ టీవీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇదివరకే ప్రసారమైన బిగ్‌బాస్ మొదటి సీజన్ సంచలన విజయం సాధించడంతో దానికి రెండో సీజన్‌ను మొదలుపెట్టారు. జూన్ 10 నుంచి మా టీవీలో ఇది ప్రసారం కానుంది.

06/04/2018 - 22:37

విశాల్, సమంత జంటగా పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ, హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై గుజ్జలపూడి హరి నిర్మించిన ‘అభిమన్యుడు’ చిత్రం ఇటీవలే విడుదలై సంచలన విజయం అందుకుంది. ప్రస్తుతం భారీ వసూళ్ళతో దూసుకుపోతున్న సందర్భంగా నిర్మాత హరి గుజ్జలపూడి వివరాలు తెలియజేస్తూ- జూన్ 1న విడుదలైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యమైన విజయాన్ని అందుకుంది.

06/04/2018 - 22:36

కొత్తబంగారులోకం ఫేం శే్వతాబసు ప్రసాద్ ఆ తరువాత కొన్ని సంఘటనలతో బాగా అన్‌పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలవల్ల ఆమె కెరీర్ పూర్తిగా పాడైపోయింది. దాంతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి అక్కడే ప్రముఖ దర్శకుడి దగ్గర అసోసియేట్‌గా పనిచేసిన ఈమె, తాజాగా పెళ్లిచేసుకుంటుందంటూ బాలీవుడ్‌లో వార్తలు జోరందుకున్నాయి.

Pages