S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/04/2018 - 22:34

బగ్గిడి ఆర్ట్స్ మూవీస్ పతాకంపై దర్శకుడు అర్జున్‌కుమార్ రూపొందిస్తున్న చిత్రం ‘బగ్గిడి గోపాల్’. మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్ జీవిత కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. బగ్గిడి గోపాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. జయసూర్య సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్‌లో జరిగింది.

06/04/2018 - 22:33

వౌర్య, చరిష్మా శ్రీకర్, వెంకటరాజ్, అవంతిక ముఖ్యపాత్రల్లో సెవెన్ హిల్స్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై అళహరి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్ యూ మ్యారీడ్’. జయసూర్య సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు సోమవారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. నిర్మాత మల్కాపురం శివకుమార్ సీడీని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ- మంచి కానె్సప్టుతో తెరకెక్కిన చిత్రమిది.

06/03/2018 - 21:14

‘జంబలకిడి పంబ’అనే పేరు వినగానే నరేశ్ హీరోగా ఈవీవీ సత్యనారాయణ చేసిన నవ్వుల సందడి గుర్తుకొస్తుంది. తాజాగా అదే పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో శ్రీనివాసరెడ్డి కథానాయకుడు. ‘గీతాంజలి’, ‘జయమ్ము నిశ్చయమ్మురా’ వంటి వైవిధ్యమైన సినిమాలతో కథానాయకుడిగా అడుగులు వేసిన శ్రీనివాసరెడ్డి నటిస్తోన్న తాజా సినిమా ఇది. శివమ్ సెల్యూలాయిడ్స్, మెయిన్‌లైన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.

06/03/2018 - 21:13

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 151వ చిత్రం సైరా. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ఈనెల 7 నుండి మొదలు కానున్న విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్ పూర్తయితే దాదాపు 80శాతం షూటింగ్ పూర్తిఅయినట్టే. దాంతో మిగతా షూటింగ్ కూడా త్వరలోనే పూర్తిచేయాలని ప్లాన్‌చేసాడు చిరంజీవి. దాంతోపాటు ఆయన క్రేజీ దర్శకుడు కొరటాల శివకు ఓకే చెప్పినట్టు టాక్?

06/03/2018 - 21:09

తన మొదటి సినిమా ఛలో’తో మంచి హిట్ కొట్టాడు వెంకీ కుడుముల. ఇప్పుడు ఈ దర్శకుడితో సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నారు బడా నిర్మాతలు. ఈ క్రమంలోనే తన తర్వాతి సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో చేయనున్నారని తెలిసిందే. తాజాగా హారిక హాసిని బ్యానర్‌లో మరో సినిమా చేయనున్నాడు. ఈ సంస్థ డైరెక్టర్ త్రివిక్రమ్‌తో ఎక్కువగా సినిమాలు నిర్మిస్తూ వస్తుంది.

06/03/2018 - 21:07

మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించగా.. సూపర్ డూపర్ హిట్టయిన ఏబీసీడీ (అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్‌డ్ దేసి) చిత్రాన్ని తెలుగులో అల్లు శిరీష్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అల్లు శిరీష్ సరసన నటించే లక్క్ఛీన్స్ రుక్షార్ థిల్లాన్ సొంతం చేసుకుంది. ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రంలో రుక్షార్ అందరి హృదయాల్ని దోచేసింది. సంజీవ్‌రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

06/03/2018 - 21:04

నాని హోస్ట్‌గా బిగ్‌బాస్ రెండో సీజన్ జూన్ 10నుండి మొదలుకానుంది. ఇప్పటికే ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ షోలో ఎవరెవరు పాల్గొంటారన్న విషయం షాకిస్తుంది. తాజాగా ఈ షోలో నందమూరి హీరో పాల్గొంటున్నాడన్న విషయంపై ఆసక్తి రేకెత్తించింది. ఇంతకీ నందమూరి హీరో అంటే ఎవరు అని షాక్ అవుతున్నారా.. ఆయన ఎవరో కాదు నందమూరి తారకరత్న. ఒకేసారి తొమ్మిది సినిమాలతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తారకరత్నకు ఆ స్థాయిలో సరైన విజయం దక్కలేదు.

06/03/2018 - 21:03

వరుస పరాజయాలతో టెన్షన్‌మీదున్న నితిన్ మళ్ళీ గాడి తప్పినట్టున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న చిన్నదానానీకోసం.. లై, చల్ మోహనరంగా సినిమాలు ఆశించిన స్థాయి విజయం సాధించలేదు. దాంతో మంచి హిట్‌కోసం గట్టిగానే ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం శ్రీనివాస కళ్యాణం సినిమాలో నటిస్తున్న నితిన్ మరో సినిమాకు ఓకే చెప్పాడు. ప్రయోగాల దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నటించనున్నాడు.

06/03/2018 - 21:01

‘పెళ్ళిచూపులు’ విడుదలై చాలా రోజులవుతోంది. ఆ సినిమాకి ఆ స్థాయి విజయం. ప్రశంసలు అనేవి అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మళ్ళీ ఆ స్థాయి సినిమాతో మీముందుకు రావడంకోసం కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ గ్యాప్‌లో సక్సెస్ ఫుల్ సినిమా అనే దానికి కొలమానం లేదనే విషయం తెలుసుకొన్నాను. నేను ప్రేమించే పనిని బాధ్యతతో, నిజాయితీతో నిర్వర్తించానా లేదా అనేదే ఇక్కడ ఇంపార్టెంట్ అని గ్రహించాను.

06/03/2018 - 20:58

ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నారా రోహిత్, జగపతిబాబు నటిస్తోన్న సినిమా ‘ఆటగాళ్ళు’. ‘ఆంధ్రుడు’ చిత్ర దర్శకుడు పరుచూరి మురళి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వాసిరెడ్డి రవీంద్రనాథ్, వాసిరెడ్డి శివాజీప్రసాద్, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర నిర్మాతలు. బ్రహ్మానందం ముఖ్య పాత్రలో కనిపించబోతున్న ఆటగాళ్ళు సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Pages