S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/14/2018 - 20:44

నాకు లైఫ్‌టైమ్ పురస్కారాన్ని అందించి న్యూజెర్సీ రాష్ట్ర జనరల్ అసెంబ్లీ సెనేటర్‌లు సెల్యూట్ చేస్తే నన్ను భరించిన దర్శకులందరికీ ఈ సందర్భంగా నేను సెల్యూట్ చేస్తున్నాను. ఎన్.టి.రామారావు తరం నుంచి ఈతరం వరకు నాకంటూ పాత్రల్ని దర్శకులు సృష్టించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను అన్నారు నటుడు రాజేంద్రప్రసాద్.

05/13/2018 - 22:50

మాస్ దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను ప్రస్తుతం మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌తో ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా టీమ్ బ్యాంకాక్ వెళ్ళింది. అక్కడే కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారు.

05/13/2018 - 22:46

మెగాస్టార్ చిరంజీవి-వైజయంతి మూవీస్ కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ‘మహానటి’ ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించనున్నారు. టైటిల్‌కి తగ్గట్టే ఈ సినిమా కథాంశం ‘పాతాళ భైరవి’ తరహాలో ఉంటుందని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వెల్లడించారు. ‘మహానటి’ సినిమాపై తన రివ్యూ చెప్పిన మెగాస్టార్ ఈ విజయంపై హర్షం వ్యక్తం చేశారు.

05/13/2018 - 22:45

బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్ జీవితానే్న మార్చేసిన సినిమా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’. ఆమె నటించిన తొలి చిత్రం కూడా ఇదే కావడం విశేషం. ఆమె తొలి విజయం కూడా ఈ చిత్రంతోనే దక్కింది. ఈ సినిమాతో ఆలియా స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. అలాగే షారుఖ్‌ఖాన్‌తో కలిసి నటించిన చిత్రం ‘డియర్ జిందగీ’. జీవితం గురించి చెప్పే చిత్రమిది. అయితే ఈ రెండింటిలో ఏ సినిమా కూడా ఆలియాభట్ మనసుదోచుకోలేకపోయింది.

05/13/2018 - 22:29

కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ హీరోగా తెరకెక్కిన భరత్ అనే నేను చిత్రం ఇటీవలే విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలు.. ఓవర్‌సీస్‌లో కలిపి ఏకంగా 200కోట్ల వసూళ్లు అందుకుని దుమ్ము రేపింది. ఇక తమిళనాడులో కూడా తెలుగు వెర్షన్‌కు మంచి వసూళ్లుదక్కాయి. చెన్నైలోనే భారీగా వసూళ్లు అందుకున్న తెలుగు సినిమాగా సంచలనం రేపింది.

05/13/2018 - 22:44

బాహుబలి సినిమాతో సంచలనం రేపిన రాజవౌళి తన తదుపరి సినిమా ఎవరితో అన్న విషయంపై ఆసక్తి ఎక్కువైంది. అయితే ఆయన తన తదుపరి చిత్రాన్ని మెగా, నందమూరి హీరోలతో మల్టీస్టారర్ చేస్తానని చెప్పడం టాలీవుడ్‌లో పెద్ద సంచలనం రేపింది. ఎన్టీఆర్-రామ్‌చరణ్ కలిసి నటించే మల్టీస్టారర్ త్వరలోనే సెట్స్‌పైకి వచ్చేందుకు కసరత్తులు మొదలయ్యాయి. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌వర్క్ జరుగుతుందట.

05/13/2018 - 22:43

ఈడోరకం, ఆడోరకం, అందగాడు, కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి విజయవంతమైన చిత్రాల యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం ‘రాజుగాడు’. పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా జరుపుకుని ఈనెలలోనే విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రంతో సంజనారెడ్డి దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. రాజ్ తరుణ్ సరసన అమైరా దస్తూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో డా.

05/13/2018 - 22:25

సినిమా విషయంలో థియేట్రికల్ రైట్స్ కంటే కూడా శాటిలైట్ హక్కులపైనే ఎక్కువ దృష్టి పెడతారు నిర్మాతలు. ఈ విషయంలో ఒక్కో హీరో స్టామినాను బట్టి ఆ రేంజ్‌కి ఈ హక్కులు అమ్ముడవుతూ వుంటాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లో కూడా పలువురు స్టార్ హీరోల శాటిలైట్ హక్కులు సంచలనం కలిగిస్తున్న విషయం తెలిసిందే. ఇక బాలీవుడ్‌లో అయితే ఈ విషయంలో సంచలనాలకే సంచలనం రేపుతున్నాయి.

05/13/2018 - 22:17

అక్కినేని నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న చిత్రం ‘సవ్యసాచి’. మాధవన్, భూమిక కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ న్యూయార్క్‌లో జరుగుతోంది. ఓ పాటతోపాటు కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారు.

05/13/2018 - 22:16

సంతోషమే సగం బలం అంటారు! కానీ ఆ సంతోషం ఈరోజుల్లో ఎక్కడుంది? గజిబిజి బిజీ లైఫ్‌లో అన్నిటినీ కోల్పోయే పరిస్థితి. కుటుంబ బంధాలు, అనుబంధాలు లేని ఈరోజుల్లో అసలు హ్యాపీ ఏం ఉంటుంది? అందుకేనేమో డీజే బ్యూటీ పూజాహెగ్డే ఇలా హ్యాపీ గురించి చాలా ఆనందంగా చెప్పింది. హ్యాపీగా ఉంటే చాలు అందంగా కనబడతారు.. అని చెప్పింది ఈ అమ్మడు. కెరీర్ పరంగా ఎలాంటి కష్టంలేదు. హాయిగా అంతా సాగిపోతోంది.

Pages