S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/10/2018 - 22:17

ఎన్టీఆర్ హోస్ట్‌గా మొదలుపెట్టిన బిగ్‌బాస్ రియాలిటీ షో సూపర్ సక్సెస్ సాధించిన నేపథ్యంలో రెండో సీజన్ చేయడానికి సన్నాహాలు జోరందుకున్నాయి. అయితే ఈ రెండో సీజన్ విషయంలో ఎన్టీఆర్ నో చెప్పడంతో ఆయన ప్లేస్‌లోకి నానిని దింపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంకా హోస్ట్ విషయంలో కన్ఫ్‌ర్మ్ కాలేదు కాబట్టి తెలుగులో మొదలయ్యేందుకు కాస్త టైం పట్టేలా వుంది.

05/10/2018 - 22:36

చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న 9వ చిత్రం ఫిలింనగర్ సాయిబాబా ఆలయంలో ప్రారంభమైంది. నాగు గవర ఈ చిత్రానికి దర్శకుడు. వసంత్ సమీర్, సెహర్ హీరో హీరోయిన్లుగా, శ్రీహర్ష, రవివర్మ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ముహూర్తపు షాట్‌కు జి.నాగేశ్వరరెడ్డి క్లాప్‌నివ్వగా, దేవి ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేశారు.

05/10/2018 - 22:37

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ సరసన ‘పులి’ చిత్రంలో నటించిన నికిషా పటేల్ ఆ చిత్రం ఘోర పరాజయం పాలవ్వడంతో ఆమెకు టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు రాలేదనే చెప్పాలి. అయితే కళ్యాణ్‌రామ్ తన సొంత బ్యానర్‌లో నిర్మించిన ‘ఓం 3డి’ చిత్రంలో కూడా ఈ భామ నటించింది. అయితే ఈ చిత్రం కూడా ఫ్లాప్ కావడంతో నికిషా తరువాత తమిళ చిత్ర పరిశ్రమపై ఫోకస్ పెట్టింది. ఆమె అక్కడ పలు చిత్రాల్లో నటించినప్పటికీ తగినంత గుర్తింపు లభించలేదు.

05/10/2018 - 22:12

యు అండ్ ఐ బ్యానర్ సమర్పణలో ఫిల్మ్ అకాడమీ సహకారంతో శ్రీ శుక్ర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మితమవుతోన్న చిత్రం ‘సూపర్ స్కెచ్’. నర్సింగ్ మక్కల, ఇంద్ర, సమీర్ దత్త, కార్తీక్ రెడ్డి, చక్రి మాగంటి తదితరులు ప్రధాన పాత్రధారులు. బలరామ్ మక్కల, ఎ.పద్మనాభరెడ్డి నిర్మాతలు. రవి చావలి దర్శకుడు. ఈ సినిమా ప్రెస్‌మీట్ కార్యక్రమంలో రవి చావలి మాట్లాడుతూ- సినిమా ఔట్‌పుట్ చాలా బాగా వచ్చింది.

05/10/2018 - 22:40

వివేక్ విశాల్, తరుణికాసింగ్, యామిని నాయకానాయికలుగా వై.వై.వి క్రియేషన్స్ పతాకంపై సుకు పూర్వాజ్ దర్శకత్వంలో మారుతి వనె్నంరెడ్డి నిర్మిస్తోన్న ‘యు’ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి రచయిత కోన వెంకట్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. సీనియర్ దర్శకులు వి.సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు.

05/09/2018 - 22:47

ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టింది. సాయిరోనక్, నిశాంత్ హీరోలుగా... ఇషానియా, రితిక హీరోయిన్లుగా అమ్మాయి నచ్చింది పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి సత్యనారాయణ ద్వారపూడి (పెళ్లికానిప్రసాద్ చిత్రం ఫేమ్) దర్శకత్వం వహిస్తున్నారు.

05/09/2018 - 22:46

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో క్రేజీ ప్రాజెక్టు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం సెకెండ్ షెడ్యూల్ జరుపుకుంటుందని తెలుస్తుంది. తొలి షెడ్యూల్‌లో రామ లక్ష్మణ్ మాస్టర్స్ నేతృత్వంలో యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించారని టాక్. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తన మేకోవర్ పూర్తిగా మార్చుకున్నాడు.

05/09/2018 - 22:27

నంది క్రియేషన్స్ పతాకంపై రాఘవ్, కరోణ్య కత్రిన్‌ను హీరోహీరోయిన్లుగా పరిచయంచేస్తూ కె.యండి.రఫీ, రెడ్డెం రాఘవేంద్రరెడ్డి నిర్మాతలుగా కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘బంగారి బాలరాజు’. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ఈ చిత్రం ఆడియోలోని మొదటి పాటను హీరో కళ్యాణ్‌రామ్ విడుదలచేశారు. ఈ సందర్భంగా హీరో కళ్యాణ్‌రామ్ మాట్లాడుతూ..

05/09/2018 - 22:25

దక్షిణాది నటుడు మాధవన్ కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టిన దగ్గర్నుంచి ఆసక్తికరమైన సినిమాల్ని ఎంచుకుంటూ తన అభిమానులకు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని రుచి చూపిస్తున్నారు. ఈమధ్యే నాగచైతన్య ‘సవ్యసాచి’ చిత్రంలో నటించిన ఆయన ఇప్పుడు టాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్ నటిస్తున్న ‘జీరో’ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్ర దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్, మాధవన్ మంచి సన్నిహితులు.

05/09/2018 - 22:44

రానా హీరోగా నటించిన ఘాజి చిత్రం 1978 యుద్ధ నేపథ్యం కథతో తెరకెక్కింది. ఈ సినిమా జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తరువాత మరో యుద్ధ నేపథ్యంలో రూపొందించే సినిమాకు సన్నాహాలు చేస్తున్నాడు దర్శకుడు తేజ. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా సక్సెస్ అయిన నేపథ్యంలో రానాతో కలిసి మరో సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు తేజ.

Pages