S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/06/2018 - 22:02

ఒకప్పుడు..
రాజకీయాలు - ప్రజాసేవ
విద్య - విద్యాదానం పుణ్యం
వైద్యం - ప్రజలకు ఆరోగ్య సేవ
సినిమా - కళాత్మక వ్యాపారం
ఇప్పుడు..
విద్య - కోట్లు సంపాదించే వ్యాపారం
వైద్యం - ఆరోగ్యాలతో చెలగాటం
రాజకీయాలు - పక్కా వ్యాపారం
సినిమా - లాభార్జనే ధ్యేయం, కళ మృగ్యం

05/06/2018 - 22:25

సీనియర్ నటి సీత టైటిల్ పాత్రలో ఆర్.పిక్చర్స్ పతాకంపై బేబి తనిష్క, బేబి జ్యోషిక సమర్పణలో యువ నిర్మా చిక్కవరపు రాంబాబు అత్యంత భారీ గ్రాఫిక్స్‌తో రూపొందిస్తున్న చిత్రం ‘్భద్రకాళి’. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి.హెచ్ రాంబాబు మాట్లాడుతూ- ‘మా బ్యానర్‌లో నిర్మిస్తున్న భద్రకాళి చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

05/04/2018 - 22:31

సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని, ప్రపంచ వ్యాప్తంగా మే 9న భారీ విడుదలకు సిద్ధంగా ఉంది మహానటి. సెన్సార్ వారు క్లీన్ ‘యూ’ సర్ట్ఫికెట్ ఇవ్వడమే కాకుండా చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించారు. సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు.

05/04/2018 - 22:16

‘దర్శకరత్న’ దాసరి నారాయణరావు గారి పుట్టిన రోజుని డైరెక్టర్స్ డే అని నిర్ణయించడం చాలా సంతోషకరం. దర్శకుడి పేరుకి ఓ బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చి.. దర్శకుడి స్థాయిని సగర్వంగా పెంచిన వారు దాసరి నారాయణరావుగారు అని హీరో, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు.

05/04/2018 - 22:30

ప్రస్తుతం టాలీవుడ్‌లో అందరినీ ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రం మహానటి. మహానటిగా గుర్తింపు తెచ్చుకున్న సావిత్రి జీవితకథతో తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ టైటిల్ పాత్రని పోషించింది. నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని తెలుగు తెరపై ఎన్నో అద్భుత చిత్రాలను నిర్మించిన ప్రఖ్యాత బ్యానర్ వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్ప సినిమా పతాకంపై స్వప్న, ప్రియాంక దత్‌లు నిర్మించారు.

05/04/2018 - 22:10

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తండ్రి చంద్రశేఖరన్‌కు బెదిరింపులు వస్తున్నాయట? దానికి కారణం.. సమాజంలో జరిగే అన్యాయాలపై పోరాడుతున్న ట్రాఫిక్ రామస్వామి జీవిత కథ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. అందులో రామస్వామి పాత్రలో చంద్రశేఖరన్ నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన బెదిరింపులు వస్తున్నాయని తెలిపాడు.

05/04/2018 - 22:09

సూపర్ స్టార్ మహేష్‌బాబు తాజాగా ‘్భరత్ అనే నేను’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఎక్కడ చూసిన సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక తన సినిమాల విషయంలో బిజీగా షూటింగ్ చేసే మహేష్ షూటింగ్ గ్యాప్‌లో ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లడం మనం చూస్తున్నదే. ‘్భరత్ అనే నేను’ సినిమా పూర్తయ్యాక విదేశాలకు వెళ్లొచ్చి.. మళ్ళీ విడుదలముందు ఆ సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్నాడు.

05/04/2018 - 22:08

సినిమా రంగంలో సెంటిమెంట్స్‌కు కొదవే లేదు. ఒక సినిమా సూపర్ హిట్ అయిందంటే.. దాదాపు నెక్స్ట్ సినిమా విషయంలో అదే పద్ధతి ఫాలో అవడం మనం చూస్తున్నదే. ఇక తాజాగా రామ్‌చరణ్‌తో బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సినిమా రెండో షెడ్యూల్ పూర్తికావొచ్చింది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రకోసం శ్రీకాంత్‌ని తీసుకున్నారట. ఈ పాత్రకోసం ఎవరైనా సీనియర్ హీరోని పెట్టాలని ప్లాన్ చేసారు.

05/04/2018 - 22:33

ఆకాష్ పూరి హీరోగా పూరి జగన్నాథ్ రూపొందించిన చిత్రం ‘మెహబూబా’. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, పాటలు ప్రేక్షకుల నుండి మంచి స్పందన తెచ్చుకున్నాయి. చిత్ర యూనిట్ కూడా మంచి స్థాయిలోనే ప్రమోషన్లు చేస్తోంది. ఇప్పటికే అన్ని పనుల్ని పూర్తిచేసుకున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలని కూడా ముగించుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యు/ఎ సర్ట్ఫికెట్ జారీ చేసింది.

05/04/2018 - 22:29

టాలీవుడ్‌లో మేకర్‌గా మంచి గుర్తింపుతెచ్చుకున్న గుణశేఖర్ సినిమాలంటే జనాలకు మంచి ఆసక్తి. ఆయన సినిమాల్లో కంటెంట్‌తోపాటు భారీ సెట్టింగులు ఉంటాయి. తాజాగా ఆయన హిరణ్య కశ్యప పేరుతో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. రానా హీరోగా ఈ సినిమాను తెరకెక్కిస్తాడట. అయితే ఈ సినిమాకోసం ఏకంగా 120కోట్ల భారీ బడ్జెట్ అవుతుందని అంటున్నాడు.

Pages