S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/04/2018 - 22:27

కమల్ కామరాజు, భరణి, మనోజ్, ప్రియాంక శర్మ, యషికా వౌల్కర్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘తరువాత ఎవరు?’. దర్శకత్వం జి.కృష్ణప్రసాద్, కె.రాజేష్, లక్ష్మీరెడ్డి కె, రాజేష్ కోడూరి నిర్మించారు. హ్యాపీ ఎండింగ్ క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకులు మాట్లాడుతూ.. ‘మా సినిమాకు తరువాత ఎవరు? అనే పేరుపెట్టాం.

05/03/2018 - 22:04

నాగలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై కిషన్, డానియల్, సుమ హీరో హీరోయిన్లుగా రంజిత్‌కుమార్ దర్శకత్వంలో వి.రమణబాబు, డానియల్ సంయుక్తంగా నిర్మిస్తున్న యూత్ ఎంటర్‌టైనర్ ‘ష్.. సైలెన్స్’. చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి బాబు మోహన్ క్లాప్ కొట్టగా, దర్శకుడు సముద్ర కెమెరా స్విచ్చాన్ చేశారు.

05/03/2018 - 22:05

స్లో అండ్ స్టడీగా సినిమాలు చేస్తూ.. అలాగే వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు యువ హీరో శర్వానంద్. ఇటీవల రాధా చిత్రంలో నటించిన ఆయనకు ఆశించిన స్థాయి విజయం దక్కలేదు. దాంతో మంచి హిట్ కోసం హను రాఘవపూడితో సినిమాకు కమిట్ అయ్యాడు. దాంతోపాటు సుధీర్ వర్మ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న శర్వానంద్ కోసం ఓ సంచలన దర్శకుడు క్యూలో ఉన్నాడు.

05/03/2018 - 21:53

సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు కేవలం మన దేశంలోనే కాదు దేశ విదేశాల్లో వున్న క్రేజ్, పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరితోనూ పోల్చలేనిది అని చెప్పవచ్చు. ఇటీవల విడుదలైన కబాలి చిత్రం అందుకు కొంత సాక్ష్యం. అలానే ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతున్న కాలా చిత్రంపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ చిత్ర సాటిలైట్ హక్కులను విజయ్ టీవీ అత్యధిక ధరకు ఇటీవల కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

05/03/2018 - 22:06

శ్రీనివాసరెడ్డి, సిద్ధి ఇద్నాని జంటగా శివం సెల్యూలాయిడ్స్, మెయిన్‌లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జె.బి.మురళికృష్ణ దర్శకత్వంలో రవి, జోజో జోస్, శ్రీనివాస్‌రెడ్డి.ఎన్ నిర్మిస్తున్న చిత్రం ‘జంబలకిడిపంబ’. ఈ సినిమా టీజర్‌ను హీరో నాని విడుదల చేశారు.

05/03/2018 - 22:08

స్వాతి, శ్రీదివ్య, ఆనంది.. వీరందరు తెలుగు హీరోయిన్‌లు. తమిళంలో సక్సెస్‌ఫుల్ కథానాయికలుగా వెలుగొందిన వారు. ఇప్పుడీ లిస్ట్‌లో మనాలీ రాథోడ్ కూడా చేరనుంది. తెలుగులో ఎం.ఎల్.ఏ, ఫ్యాషన్ డిజైనర్, హౌరాబ్రిడ్జి లాంటి సినిమాల్లో నటించిన మనాలీకి తొలి తమిళ సినిమా ఆఫర్ వచ్చింది. వరలక్ష్మి శరత్‌కుమార్ పూనమ్ బజ్వా, ఆత్మిక ప్రధాన పాత్రల్లో డికె దర్శకత్వంలో జ్ఞానవేల్ రాజా నిర్మిస్తోన్న ‘కాతెరి’.

05/03/2018 - 21:50

మోహన్ మీడియా క్రియేషన్స్ బ్యానర్‌లో మల్లెపువ్వు, మెంటల్ కృష్ణ, నంది అవార్డు పొందిన ‘కలవరమాయే మదిలో’ వంటి మంచి చిత్రాలను నిర్మించిన మోహన్ వడ్లపట్ల కొన్నాళ్లు నిర్మాతల మండలి, ఫిలిం ఛాంబర్‌లో కొన్ని కీలక బాధ్యతలు నిర్వహిస్తూ నిర్మాణ రంగానికి కొన్ని రోజులపాటు దూరంగా ఉన్నారు.

05/03/2018 - 22:09

అక్కినేని నాగార్జున - రామ్‌గోపాల్‌వర్మల క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘ఆఫీసర్’. మొదటినుండి మంచి క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఈ చిత్రంలో నాగార్జున ఒక పవర్‌ఫుల్ పోలీసు అధికారిగా కనిపించనున్నాడు. ఇప్పటికే సినిమా నుండి విడుదలైన యాక్షన్ టీజర్‌కు మంచి స్పందన దక్కగా ఇపుడు రెండో టీజర్‌ను సిద్ధం చేశారు చిత్ర యూనిట్. ఈ టీజర్‌ను రేపు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నారు.

05/03/2018 - 21:48

తమిళంలో స్టార్ హీరో విజయ్-మురుగదాస్‌ల కలయికలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన తుపాకి, కత్తి వంటి సినిమాలు బ్లాక్‌బస్టర్లుగా నిలవడంతో ఈ ప్రాజెక్టుపై తారాస్థాయి అంచనాలు నెలకొన్నాయి. ఇన్నాళ్ళు తమిళనాట జరిగిన నిర్మాతల మండలి నిరసన మూలాన ఆగిపోయిన ఈ చిత్ర రెండవ షెడ్యూల్ కొద్దిరోజుల క్రితమే తిరిగి మొదలైంది. చెన్నైలో జరుగుతున్న ఈ షెడ్యూల్ తాజాగా ముగిసింది.

05/03/2018 - 22:11

నంది క్రియేషన్స్ పతాకంపై రాఘవ్, కరోణ్య కత్రిన్ జంటగా పరిచయం చేస్తూ కె.యం.డి.రఫీ, రెడ్డెం రాఘవేంద్రరెడ్డిలు నిర్మాతలుగా కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘బంగారి బాలరాజు’. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని మే 2వ వారంలో ఆడియోని జూన్ మొదటివారంలో చిత్రాన్ని విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

Pages