S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/02/2018 - 22:05

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రెండో షెడ్యూల్ జోరుగా జరుపుకుంటుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా ఖైరా అద్వానీ నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హైద్రాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు రాజా మార్తాండా, రాజా వంశస్తుడు అనే టైటిల్స్ పెడతారంటూ తెగ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

05/02/2018 - 22:17

భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’ దుబాయ్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ దుబాయ్ షెడ్యూల్లో కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. సినిమా బడ్జెట్ నుండి ఎక్కువ భాగం ఈ షెడ్యూల్ కోసమే కేటాయించారు. ‘ట్రాన్స్‌ఫార్మర్స్’లాంటి హాలీవుడ్ సినిమాలకి స్టంట్స్ డిజైన్ చేసిన కెన్నీ బేట్స్ ఈ సినిమాకి కూడా స్టంట్స్ డిజైన్ చేస్తున్నారు.

05/02/2018 - 22:18

ఎన్టీఆర్ హీరోగా క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్‌ల కలయికలో రూపొందుతున్న చిత్రం ఇటీవలే మొదటి షెడ్యూల్‌ను ఫిలిం సిటీలో పూర్తిచేసుకున్న విషయం తెలిసిందే. రేపటినుండి రెండో షెడ్యూల్ కూడా అక్కడే జరగనుంది. రెండో షెడ్యూల్లోకూడా మరికొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలిసింది. ఐటీ ఈ సినిమా ఫ్యాక్షన్ నేపథ్యంలో ఉంటుందని టాక్. జగపతిబాబు, నాగేంద్రబాబు ఫ్యాక్షనిస్టులుగా కనిపిస్తారని..

05/02/2018 - 22:01

దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల సేవలందిస్తున్న ఫిలిం ఎనాలిటికల్ అండ్ అప్రిషియేషన్ సొసైటీ (్ఫస్) -దాసరి 2018 ఫిలిం అవార్డులను మే 6న హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయ గానసభ వేదికగా ప్రదానం చేయనున్నారు. సంస్థ అధ్యక్షులు, పూర్వ సెన్సార్ బోర్డు సభ్యులు డా.కె.్ధర్మారావు ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను తెలిపారు. ఫాస్- దాసరి కీర్తికిరీట సిల్వర్ క్రౌన్ అవార్డులను దర్శకులు కోడి రామకృష్ణ, టి.వి.

05/02/2018 - 22:16

సుధీర్‌బాబు, అదితిరావు హైదరీలు జంటగా నటించిన చిత్రం ‘సమ్మోహనం’. మోసన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్ర టీజర్ నిన్ననే విడుదలైంది. టీజర్ కొత్తగా ఉంది అంటూ ప్రేక్షకులనుండి ప్రశంసలు అందుతుండగా విడుదలకుముందే టీజర్‌ను వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి కూడ సినిమా విజయంపట్ల నమ్మకాన్ని వ్యక్తపరిచారు.

05/02/2018 - 22:20

స్వప్న సినిమాస్, వైజయంతీ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మహానటి’. అలనాటి మహానటి సావిత్రి బయోపిక్‌గా రూపొందిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ టైటిల్ పాత్రలో నటించారు. దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, సమంత తదితరులు కీలక పాత్రధారులు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు.

05/02/2018 - 21:58

మాస్‌రాజా రవితేజ కాస్త గ్యాప్ తరువాత స్పీడ్ పెంచేసాడు. ఇప్పటికే ఆయన నటిస్తున్న ‘నేల టిక్కెట్టు’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తరువాత సంతోష్ శ్రీనివాస్‌తో మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తికావొచ్చిన ఈ సినిమా ఈనెల చివర్లో సెట్స్‌పైకి రానుంది. మైత్రీ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కనున్నట్టు సమాచారం.

05/02/2018 - 22:22

తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘కావల్’ అనే చిత్రాన్ని తెలుగులో ‘ఇంటిలిజెంట్ పోలీస్’ అనే టైటిల్‌తోగ్రేహాక్ మీడియా పతాకంపై వీరబ్రహ్మచారి అన్న భీమోజు సమర్పణలో రాజశేఖర్ అన్న భీమోజు నిర్మిస్తున్నారు. జె.వి.రామారావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. సముద్రఖని, విమల్, గీత, ఎమ్మెస్ భాస్కర్, సింగమూతు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మన్నారా చోప్రా ప్రత్యేక గీతంలో నటించింది. నాగేంద్రన్ ఆర్.

05/01/2018 - 21:43

ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్న వక్కంతం వంశీ చాలాకాలంగా తెలుసు. దాసరి ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన వంశీ ఆ తరువాత రచయితగా ఎన్నో సూపర్‌హిట్ సినిమాలకు కథ అందించాడు. కొత్త విధానంలో కథలు అందించడంలో అతని శైలి వేరు. ఈ కథను చెప్పినపుడు తానైతేనే న్యాయం చేయగలడనిపించింది. మేకింగ్ పరంగా కూడా వంశీ అద్భుతంగా తెరకెక్కించాడు.

05/01/2018 - 21:58

బన్నీ కెరీర్‌లో నిలిచిపోయే చిత్రమిది అని అంటున్నారు నిర్మాత నాగబాబు. అల్లుఅర్జున్ హీరోగా వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీ్ధర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నటుడు, నిర్మాత నాగబాబు సమర్పిస్తున్నారు.

Pages