S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/30/2018 - 21:40

వీబీ ఎంటర్‌టైనె్మంట్స సంస్థ 2014 నుండి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ఎంటర్‌టైనె్మంట్ విష్ణుబొప్పన ప్రతి ఏడాది లాగే ఈ ఏడాదికి సంబంధించిన సినిమా తారల డైరీ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమం ఆదివారం ప్రసాద్‌ల్యాబ్‌లో నిర్వహించారు. పలువురు సినీ నటీనటుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది.

04/30/2018 - 21:42

కొరటాల శివ.. ప్రస్తుతం టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్న పేరు. రచయితగా కెరీర్ ప్రారంభించి దర్శకుడిగా మిర్చితో మొదలుపెట్టి వరుస సంచలన విజయాలతో దూసుకుపోతున్నాడు. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, ఇప్పుడు భరత్ అనే నేను.. సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా నటించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై సూపర్‌హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ముఖ్యంగా విడుదలైన అన్ని కేంద్రాల్లో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది.

04/30/2018 - 21:41

బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ శ్రద్ధాకపూర్ తాజాగా సాహో సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. హిందీలో తెరకెక్కిన ఆషికి-2 సినిమాతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ అందుకున్న ఈ భామకు పలు క్రేజీ అవకాశాలు క్యూకట్టాయి. ప్రస్తుతం తెలుగులో కూడా పలు అవకాశాలు వస్తున్నాయి. అయితే త్వరలోనే శ్రద్ధ పెళ్లికి సిద్ధమవుతుందంటూ వార్తలొస్తున్నాయి.

04/29/2018 - 22:27

ఇన్నోవేటివ్ థాట్స్‌ను ఇంటెలిజెంట్‌గా ప్రజెంట్ చేయడం నేటి దర్శకుల స్టయల్. ఏం చెప్పినా కొత్తగా చెప్పాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనలున్న కథే ‘వైఫ్ ఆఫ్ రామ్’. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ మూవీ టీజర్‌ను అక్కినేని నాగార్జున ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. టీజర్ చూసిన వెంటనే నాగ్ ఒక్కసారిగా సర్‌ప్రైజ్ అయ్యారు. క్షణం క్షణం ఉత్కంఠను రేకెత్తించేలా ఉందన్నాడు.

04/29/2018 - 22:25

షకలక శంకర్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘డ్రైవర్‌రాముడు’ రాజ్ సత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ని విడుదల చేసి ప్రేక్షకుల అంచనాలు రేట్టింపుచేసారు. రాజ్ సత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సినిమా పీపుల్ పతాకంపై మాస్టర్ ప్రణవ్‌తేజ్ సమర్పణలో వేణుగోపాల్ కొడుమగుళ్ల, ఎమ్‌ఎల్‌రాజు, ఆర్‌ఎస్ కిషన్ నిర్మిస్తున్నారు.

04/29/2018 - 22:22

శంకర్ హీరోగా శ్రీ్ధర్.ఎన్. దర్శకత్వంలో ఆర్.ఆర్.పిక్చర్స్ సంస్థ ఎస్.కె.పిక్చర్స్ సమర్పణలో నిర్మిస్తున్న చిత్రం ‘శంభోశంకర’. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌కు మంచి స్పందన లభించింది. ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో తొలి లిరికల్ వీడియోసాంగ్‌ను మేడే సందర్భంగా దర్శకుడు వి.వి.వినాయక్ విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలలో ఒకరైన రమణారెడ్డి మాట్లాడుతూ..

04/29/2018 - 22:22

విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్‌రెడ్డి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం అన్ని ఏరియాల్లో కలెక్షన్లు విపరీతంగా రాబట్టింది. మొదటి సినిమానే అయినా డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.అర్జున్‌రెడ్డి యూత్‌కు బాగానచ్చే సబ్జెక్టుకావడంతో రీమేక్ రైట్స్‌కోసం మంచి డిమాండ్ వచ్చింది.

04/29/2018 - 22:20

బాలీవుడ్‌లో హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న హాట్ భామ అతిథిరావు హైదరి తాజాగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ తెచ్చుకుంటుంది. ఇప్పటికే సుధీర్‌బాబు సరసన సమ్మోహనం సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడికి ఆఫర్స్ వెల్లువలా వచ్చిపడుతున్నాయి. ఈ సినిమాతోపాటు వరుణ్‌తేజ్-సంకల్ప్‌రెడ్డిల సినిమాలో ఛాన్స్ పట్టేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇటీవలే మొదలైంది. ఈ అమ్మడు నటించిన సినిమా ఇంకా విడుదలకాకముందే..

04/29/2018 - 22:17

ఈ రోజుల్లో జనం ఎంత తొందరగా డిప్రెషన్‌లో పడిపోతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారో సమాజానికి చూపించాలన్న ఉద్దేశ్యంతో అసతోమా సద్గమయ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు సిద్ధార్థ్ గ్రంధి. ఫిలాసఫికల్ మరియు ఆధ్యాత్మికంమీద డాక్యుమెంట్రీస్ తీయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని శ్రీనివాసానంద స్వామి పీఠం అధ్యక్షులు శ్రీనివాసానంద స్వామివారి చేతులమీదుగా ఆవిష్కరించబడింది.

04/29/2018 - 22:15

సౌత్ స్టార్ హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్ చెన్నై, ముంబైల మధ్య చక్కర్లు కొడుతూ బిజీగా ఉన్నారు. వివరాల్లోకి వెళితే ప్రస్తుతం ఈమె తమిళంలో సూర్య, సెల్వరాఘవన్‌ల ‘ఎన్.జి.కె.’ చిత్రంలో కథానాయకిగా నటిస్తోంది. ఇటీవలే నిర్మాతల మండలి నిరసన ముగియడంతో ఆమె ఆ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. నిన్ననే మొదటి షెడ్యూల్ ముగిసింది. దర్శకుడు సెల్వరాఘవన్ రకుల్ పెర్ఫార్మెన్స్ పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తంచేశాడు కూడ.

Pages