S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/29/2018 - 22:12

జాతీయ నటుడు కమల్‌హాసన్ కూతురిగా వెండితెరకు పరిచయమైన అందాల భామ శృతిహాసన్ తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకుంది. సౌత్‌లో టాప్ హీరోయిన్ రేంజ్‌లోకి దూసుకెళ్లిన ఈ అమ్మడి బాలీవుడ్ కలలు మాత్రం నెరవేరలేదు. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలగాలని కోరికతో ఎన్నో సినిమాల్లో నటించినా పెద్దగా లాభం లేకపోయింది. బాలీవుడ్ సినిమాలకోసం సూచిలో క్రేజీ ఆఫర్స్‌ని కాదన్నది.

04/27/2018 - 21:47

సూపర్‌స్టార్ మహేష్‌బాబు లేటెస్టుగా ఓ అరుదైన ఘనత అందుకున్నారు. మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని పెట్టనున్నారు. ఈ అరుదైన ఘనత సాధించిన రెండో హీరో మహేష్ కావడం విశేషం. ఇప్పటికే బాహుబలితో క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ విగ్రహాన్ని పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా టుస్సాడ్ నుండి టెక్నీషియన్స్ వచ్చి మహేష్ కొలతలు తీసుకున్నారట. ఈ విషయాన్ని మహేష్ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

04/27/2018 - 21:49

భాను ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ సాయి అమృతలక్ష్మి క్రియేషన్స్ బ్యానర్‌పై గోదారి భానుచందర్ నిర్మిస్తున్న చితం ‘సడి’. పాలిక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సుమన్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవం శుక్రవారం ఫిలింనగర్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగింది.

04/27/2018 - 21:29

యంగ్ హీరో తనీష్ దేశదిమ్మరిగా ముస్తాబవుతున్నాడు. సవీన క్రియేషన్స్ పతాకంపై నగేష్ నారదాసి దర్శకత్వంలో స్వతంత్ర గోయల్ (శావి యుఎస్‌ఎ) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తనీష్‌కు జోడీగా షరీన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సమ్మర్ కానుకగా విడుదలకు ముస్తాబవుతున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాల్ని జరుపుకుంటోంది. ఈ చిత్రంతో తనీష్ తనలోని గాయకుడిని మనకు పరిచయం చేస్తున్నాడు.

04/27/2018 - 21:46

అరుణ్‌తేజ్, ఛరిష్మా శ్రీకర్ జంటగా కెఎస్‌పి ప్రొడక్షన్స్ పతాకంపై యలమంచిలి ప్రవీణ్ సమర్పణలో డా.ఎస్.కీర్తి, డా.జి.పార్థ సారథిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘నీతోనే హాయ్ హాయ్’. బి.ఎన్.రెడ్డి అభినయ దర్శకుడు. ఈ చిత్రం తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లో విజయవంతంగా పూర్తిచేసుకుంది.

04/27/2018 - 21:26

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సాక్ష్యం’. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్న చిత్రం టీజర్ ఇటీవల విడుదలై ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ యాక్షన్ చిత్రాన్ని జూన్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

04/27/2018 - 21:49

సిద్ధు..సిద్ధార్థరాయ్... అంటూ వెండితెరపై పవన్‌కళ్యాణ్ చేసిన ‘ఖుషి’కి నేటితో పదిహేడేళ్లు నిండాయి. 2001 ఏప్రిల్ 27న విడుదలైన ‘ఖుషి’ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అమితంగా అలరించి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. యువతరం ప్రేమకథలకు, స్టయిల్స్‌కు ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో పవన్ హుషారైన నటన, ఫైట్స్ నాటి యువతనే కాదు.. పెద్దవాళ్లనీ మెప్పించాయి.

04/27/2018 - 21:25

క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఫిలింసిటీలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా నేటితో మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. రెండో షెడ్యూల్‌ని మే 3 నుండి ప్లాన్ చేశారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం రమ్యకృష్ణను తీసుకున్నారట.

04/27/2018 - 21:51

బాలీవుడ్ స్టార్ అమీర్‌ఖాన్ కీలక పాత్రలో ‘మహాభారత’ మూవీకి సన్నాహాలు జరుతున్న విషయం తెలిసిందే. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నది.

04/27/2018 - 21:52

ప్రస్తుతం సినిమా పరిశ్రమను ఓ రేంజ్‌లో ఊపేస్తున్న అంశం కాస్టింగ్ కౌచ్. హీరోయిన్స్‌పై లైంగిక వేధింపుల విషయంపై ఈమధ్య చాలామంది హీరోయిన్స్ బాహాటంగా బయటికి చెప్పడంతో పెద్ద రాద్ధాంతమే జరుగుతోంది. ఇక శ్రీరెడ్డి వ్యవహారంతో ఇంకాస్త ఫైర్ ఎక్కువైనా ఈ కాస్టింగ్ కౌచ్ వ్యవహారం అటు బాలీవుడ్‌లో కూడా పెద్ద దుమారమే రేగుతోంది. తాజాగా ఓ హీరోయిన్ ఈ విషయంపై స్పందించింది. ఆమె చెప్పిన విషయాలు సంచలనం రేపుతున్నాయి.

Pages