S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/11/2018 - 21:51

మొదటిసారి యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ల కలయికలో ఒక చిత్రం రూపొందనుంది. ఈ క్రేజీ కాంబినేషన్ మూలాన సినిమాపై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తినెలకొంది. కొన్నాళ్లక్రితమే పవన్‌కళ్యాణ్ ముఖ్య అతిథిగా ప్రారంభమైన ఈ చిత్రం రెగ్యులర్ షూట్ ఈనెల 13నుండి హైదరాబాద్‌లో ప్రారంభంకానుంది. ఈ షెడ్యూల్లో మొదటగా ఒక యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించనున్నారట.

04/11/2018 - 21:50

చరణ్‌తేజ్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో ‘నేనే లోకల్’ చిత్ర దర్శకుడు త్రినాథ్‌రావు నక్కిన స్టోరీ, దర్శకత్వ పర్యవేక్షణలో, ప్రముఖ దర్శకుడు మారుతి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం ఆయుష్మాన్‌భవ. ఈ చిత్రాన్ని సి.టి.ఎఫ్ నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

04/11/2018 - 22:07

రామ్‌చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా అటు బాక్స్‌ఆఫీస్‌వద్ద దూసుకుపోతుంది. 1980ల నాటి కథతో తెరకెక్కిన ఈ సినిమా విజయంలో కీలకపాత్ర పోషించాడు కెమెరామెన్ రత్నవేలు. నాటి పరిస్థితులను కళ్ళకుకట్టినట్టు అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ సినిమా సక్సెస్ సందర్భంగా రత్నవేలు చెప్పిన విశేషాలు...

04/11/2018 - 21:47

యాక్షన్‌కింగ్ అర్జున్ చాలారోజుల విరామం తర్వాత హీరోగా నటిస్తున్న తెలుగు చిత్రం కాంట్రాక్ట్. ఇందులో హీరో జేడీ చక్రవర్తి చాలా రోజుల తర్వాత విలన్‌గా నటిస్తుండడం విశేషం. ప్రముఖ కన్నడ కథానాయిక రాధికాకుమారస్వామి ఇందులో అర్జున్‌కు జోడీగా నటిస్తున్నారు. సీనియర్ దర్శకులు కె.విశ్వనాథ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రసిద్ధ బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్ సొంత తమ్ముడు.

04/11/2018 - 22:09

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తిచేసుకుంది. ఇందులో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, మరో హీరోయిన్ కోసం అనే్వషణ సాగుతోంది. తాజాగా ఈ పాత్రలో మిల్కీ భామ తమన్నాను నటింపజేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ చిత్రంలో ఈమె పాత్ర కీ రోల్ పోషిస్తుందని తెలిసింది.

04/10/2018 - 20:52

ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు నాని. ఇటీవలే నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. తాజాగా ఆయన ద్విపాత్రాభినయంలో నటిస్తున్న చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’. మెర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 12న విడుదలకు సిద్ధమయింది. ఈ సందర్భంగా నాని చెప్పిన విశేషాలు..

04/10/2018 - 20:50

అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై లగడపాటి శిరీషాశ్రీ్ధర్ నిర్మిస్తున్న చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు అనూహ్యమైన స్పందన రావడంతో ఈనెల 13న మూడో సాంగ్‌ను విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ ఇంపాక్ట్, డైలాగ్, టీజర్‌లో అల్లు అర్జున్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

04/10/2018 - 20:48

సంతానం, ఆంచల్‌సింగ్ జంటగా శ్రీ తేన్నాండాళ్ ఫిలింస్ బ్యానర్‌పై తమిళంలో రూపొందిన ‘దిల్లుడు దుడ్డు’ చిత్రాన్ని తెలుగులో ‘దమ్ముంటే సొమ్మేరా’ పేరుతో విడుదల చేస్తున్నారు. శ్రీ కృష్ణా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నటరాజ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల చివరిలో విడుదలకు సిద్ధమైన సందర్భంగా నిర్మాత నటరాజ్ వివరాలు తెలియజేస్తూ- ఇటీవలే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

04/10/2018 - 20:46

కెరీర్ ప్రారంభంనుండి సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకున్న అందాల రాక్షసి లావణ్య త్రిపాఠికి ఈమధ్య కెరీర్ కాస్త బ్రేక్ పడింది. ఈమధ్య చేసిన సినిమాలన్నీ వరుసగా పరాజయాలపాలవ్వడంతో ఈమెకు అవకాశాలు తగ్గాయి. దాంతో మళ్లీ క్రేజ్ తెచ్చుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు మొదలుపెట్టింది. తాజాగా ఈమెకు మెగా హీరో సరసన అవకాశం దక్కింది.

04/10/2018 - 20:44

‘రంగస్థలం’ చిత్రంలో స్క్రీన్‌పై నన్ను నేను చూసుకుని షాక్ అయ్యానని చెబుతోంది క్రేజీ హీరోయిన్ సమంత. ‘ఏ మాయ చేశావె’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై తొలి చిత్రంతోనే జెస్సీగా ప్రేక్షకుల్ని తన మాయలో పడేసింది. అటుపై కమర్షియల్ హీరోయిన్‌గా వరుస విజయాలతో దూసుకుపోతోంది. తాజాగా ఆమె పూర్తిగా పల్లెటూరు అమ్మాయిగా కనిపించిన చిత్రం రంగస్థలం.

Pages