S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/09/2018 - 20:59

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రతిష్ఠాత్మక చిత్రం ‘సైరా.. నరసింహారెడ్డి’! ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌చరణ్ నిర్మిస్తున్నాడు. గత 20 రోజులుగా హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం కోసం కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు.

04/09/2018 - 20:57

ప్రభుదేవా ప్రధాన పాత్రలో పెన్ స్టూడియోస్, స్టోన్‌బెంచ్ ఫిలింస్ సమర్పణలో కార్తికేయన్ సంతానం, జయంతిలాల్ నిర్మించిన సైలెంట్ చిత్రం ‘మెర్క్యురీ’. విభిన్నమైన కథ, కథనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈనెల 13న విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా నిర్మాత కార్తికేయ సంతానం మాట్లాడుతూ- యూనిక్ పాయింట్‌తో తెరకెక్కిన చిత్రాన్ని నిర్మించినందుకు ఆనందంగా వుంది.

04/09/2018 - 20:55

గోపీచంద్ కథానాయకుడిగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ నిర్మిస్తోన్న చిత్రం ‘పంతం’. ‘్ఫర్ ఎ కాస్’ ఉపశీర్షిక. ‘బలుపు’, ‘పవర్’, ‘జైలవకుశ’వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు స్క్రీన్‌ప్లే అందించిన కె.చక్రవర్తి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరియమవుతున్నారు. గోపీచంద్ నటిస్తోన్న 25వ చిత్రమిది. ఈ సినిమాను జూలై 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

04/09/2018 - 20:53

సినిమా విషయాలకు విశేషాలకు ప్రాధాన్యత పెరిగిన సమయంలో సోషల్ సినిమా అనే పత్రిక రావడం అభినందనీయమని
దర్శకుడు మారుతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ సినిమా అనే పత్రికను హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్.కె.గౌడ్, రామసత్యనారాయణ, ఆర్.పి.పట్నాయక్, శోభారాణి, డి.వెంకటేష్
పాల్గొన్నారు.

04/09/2018 - 20:51

నాని-అనుపమా పరమేశ్వరన్, నాని-రుక్సార్ మీర్ జంటగా మేర్లపాక గాంధి దర్శకత్వంలో వెంకట్ బోయినపల్లి సమర్పణలో షైన్ స్క్రీన్ పతాకంపై తెరకెక్కిన ‘కృష్ణార్జునయుద్ధం’ చిత్రం ఈనెల 12న విడుదలవుతున్న సందర్భంగా సోమవారం యూనిట్ మీడియా మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నాని మాట్లాడుతూ- నా ప్రతి సినిమా విడుదలకు ముందు టెన్షన్ వుంటుంది.

04/09/2018 - 20:50

నితిన్, మేఘా ఆకాశ్ జంటగా నటించిన చిత్రం ‘్ఛల్ మోహన్‌రంగ’ నితిన్ నటించిన 25వ చిత్రమిది. కృష్ణచైతన్య దర్శకుడు, పవన్‌కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, శ్రేష్ఠ్ మూవీస్ సంస్థలపై ఎన్.సుధాకర్‌రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకి త్రివిక్రమ్ కథను అందించారు. ఏప్రిల్ 5న ఈ చిత్రం ప్రేక్షకులముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటుచేసింది. ఈ సందర్భంగా...

04/09/2018 - 20:48

ఆర్‌ఎక్ స100 బైక్ ఒక జనరేషన్‌కి ఫేవరేట్ బైక్. మాస్‌ని అమితంగా ఆకట్టుకున్న బైక్. మరి.. అంతమందిని ఆకట్టుకున్న ఆ బైక్ పేరును మా సినిమాకు ఎందుకు పెట్టాం? అనేది తెలుసుకోవాలంటే జూన్ వరకు ఆగాల్సిందే... అని అంటున్నారు దర్శకుడు అజయ్‌భూపతి. కెసిడబ్ల్యూ బ్యానర్‌పై అశోక్‌రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్న గతి100 చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు.

04/09/2018 - 20:45

మమ్ముట్టి ముఖ్యపాత్రలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జీవిత కథతో మహి వి.రాఘవ దర్శకత్వంలో 70 ఎం.ఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న చిత్రం ‘యాత్ర’. విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి నిర్మాతలు. ఈ చిత్రం నేటి నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. వై.ఎస్ 2003లో ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి ఈ రోజునే పాదయాత్ర మొదలుపెట్టడం విశేషం.

04/09/2018 - 20:44

కేవలం ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్‌లో సంచలన హీరోయిన్‌గా మారింది షాలినీ పాండే. విజయ్ దేవరకొండతో చేసిన ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బెంగాలీ భామ, మొదటి సినిమాలోనే ఘాటు ముద్దులతో అదరగొట్టింది. ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో పలు అవకాశాలు అందుకుంటున్న ఈమెకు ఓ లక్కీ ఛాన్స్ దక్కింది. అదేమిటంటే, సూపర్‌స్టార్ మహేష్ సరసన హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు.

04/08/2018 - 20:58

తమిళంలో సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ మంచి ఇమేజ్ తెచ్చుకుంది నయనతార. లేడీ సూపర్‌స్టార్‌గా సత్తాచాటుతున్న ఆమె, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన ‘సైరా’లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే డోర, మాయ వంటి చిత్రాల్లో నటించి భయపెట్టింది. తాజాగా మరోసారి హారర్ సినిమాతో భయపెట్టేందుకు సిద్ధమవుతోందట.

Pages