S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/06/2018 - 20:56

ప్రతిభావంతులైన తెలుగు ఆర్టిస్టులు, విదేశీ ఆర్టిస్టులతో మంచి ప్రయోగంగా రూపొందించిన ‘సూపర్ స్కెచ్’ ఘనవిజయం సాధించాలి. నాకు ఆప్తుడైన నర్సింగ్ ఇందులో హీరోగా చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిన్న సినిమాలకు అండగా నిలుస్తుంది అని రాష్ట్ర సినిమాటోగ్రఫి శాఖామాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రవిచావలి దర్శకత్వంలో శ్రీ శుక్ర క్రియేషన్స్ నిర్మిస్తోన్న చిత్రం ‘సూపర్ స్కెచ్’.

04/06/2018 - 20:54

అందరికీ బంధువుగా, పేదల కుటుంబంగా మనం సైతం పనిచేస్తోందన్నారు ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్. ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనం సైతం సేవా కార్యక్రమాలు ఫిలిం ఛాంబర్‌లో జరిగాయి. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఏడుగురు ఆపన్నులకు ఈ సందర్భంగా ఆర్థిక సహాయం చేశారు.

04/06/2018 - 20:52

అద్భుతమైన నటనతో నేచురల్ స్టార్‌గా రాణిస్తూ వరుసగా ఎనిమిది విజయాలను సొంతం చేసుకున్న నాని.. ట్రిపుల్ హ్యాట్రిక్ కోసం ప్రేక్షకుల ముందుకు కృష్ణార్జునయుద్ధంతో వస్తున్నాడు. వెంకట్ బోయనపల్లి సమర్పణలో షైన్‌స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. మేర్లపాక గాంధి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 12న విడుదలకు సిద్ధమైంది.

04/06/2018 - 20:49

టాలీవుడ్‌లో గత కొతంకాలంగా ఎంతోమంది హీరోయిన్స్ వస్తున్నారు పోతున్నారు. ఒక్కసారిగా వెలిగిపోయిన కొందరు ముద్దుగుమ్మలు మళ్లీ కనిపించడం లేదు. అలాగే మరికొంత మంది మొదటి సినిమాతోనే స్టార్ హీరోల దగ్గర ఛాన్స్ కొట్టేసిన ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కనిపించలేదు. ఆ లిస్ట్‌లో పవన్‌కళ్యాణ్ హీరోయిన్ ఉంది. నికిషాపటేల్ అందరికి గుర్తుండే ఉంటుంది.

04/05/2018 - 21:01

మాస్ రాజా రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంథోని’. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. నీకోసం, వెంకీ, దుబాయ్ శీను లాంటి హ్యాట్రిక్ విజయాల తరువాత రవితేజ-శ్రీనువైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

04/05/2018 - 20:59

కెరీర్ ప్రారంభం నుండే భిన్నమైన సినిమాల్లో నటిస్తూ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మెగా హీరో వరుణ్‌తేజ్ తాజాగా మరో ప్రయోగానికి సిద్ధమయ్యాడు. తొలిప్రేమ సక్సెస్ తరువాత వరుణ్‌తేజ్ నటిస్తున్న చిత్రానికి ఘాజి ఫేమ్ సంకల్ప్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలతోపాటు సెట్‌వర్క్ కూడా పూర్తికావచ్చింది.

04/05/2018 - 20:57

శ్రీరామ్, శ్రీప్రియ జంటగా రాజానాయుడు దర్శకత్వంలో లైట్ ఆఫ్ లవ్ క్రియేషన్స్ బ్యానర్‌పై పదిలం లచ్చన్నదొర నిర్మిస్తున్న చిత్రం ‘కొత్త కుర్రోడు’. సాయి యేలేందర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో బుధవారం విడుదలయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నిర్మాత రాజ్ కందుకూరి ఆడియో సీడీని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ- టైటిల్ బాగుంది.

04/05/2018 - 21:03

అర్జున్ తేజ్, సంతోష్, ప్రియ, వర్షిణి హీరో హీరోయిన్లుగా తోట నాగేశ్వర దర్శకత్వంలో హెచ్.ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై తోట నాగేశ్వర్‌రావు నిర్మిస్తున్న చిత్రం ‘తథాస్తు’. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ చిత్రానికి సంబంధించిన పాటల రికార్డింగ్ కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత తోట నాగేశ్వరరావు వివరాలు తెలియజేస్తూ- గత 30 సంవత్సరాలుగా పరిశ్రమలో ఉన్నాను.

04/05/2018 - 20:54

అక్కినేని చిన్నోడు అఖిల్ హీరోగా నటిస్తున్న మూడవ చిత్రం ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రాన్ని భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్నాడు. అఖిల్ హీరోగా పరిచయమైన ‘అఖిల్’ చిత్రం భారీ పరాజయం పాలవడంతో కాస్త గ్యాప్ తీసుకుని చేసిన ‘హలో’ ఫర్వాలేదనిపించుకుంది. కానీ కెరీర్ పరంగా సరైన సక్సెస్ మాత్రం రాలేదు. దాంతో ఓ మంచి లవ్‌స్టోరీని ఎంపిక చేసుకుని వస్తున్నాడు.

04/05/2018 - 20:53

సీనియర్ నటుడు, డబ్బింగ్ కళాకారుడు చంద్రవౌళి గురువారం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. చంద్రవౌళిది చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి దగ్గరలోని మునగాలపాలెం. ప్రముఖ నటుడు మోహన్ బాబు తండ్రి చంద్రవౌళికి గురువు. 1971లో చిత్రరంగంలోకి ప్రవేశించిన ఆయన 45 ఏళ్లకుపైగా పలు పాత్రల్లో నటించి మెప్పించారు.

Pages