S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్ర

05/19/2017 - 07:58

బాలీవుడ్ అందాల భామ ప్రియాంక చోప్రా రీసెంట్‌గా ఓ మాట చెప్పింది. నా సినిమా చూడటానికి వచ్చేవారు మీ పిల్లలను తీసుకొని రావద్దు అని. పిల్లలని తీసుకొని వెళ్లడానికి ఆమెకు వున్న ప్రాబ్లం ఏంటి అని అందరూ అనుకోవచ్చు. ప్రియాంక ఆలోచన మాత్రం మరోలా ఉంది. సినిమా ప్రచారంలో హీరోయిన్స్ అందరూ మా సినిమా చూడండి, చాలా బాగుంటుంది అని చెబుతూ వుంటే..

05/17/2017 - 21:35

రాజవౌళి తెరకెక్కించిన ‘బాహుబలి-2’ చిత్రం మూడోవారంలో కూడా పూర్తిస్థాయి హవా ప్రదర్శిస్తోంది. అన్ని చోట్లా దాదాపు హౌస్‌ఫుల్ కలెక్షన్లతో సినిమా నడుస్తోందని చిత్ర బృందం చెప్తోంది. మొదటి రెండు వారాల్లోనే ఇండియాలో రూ.1020 కోట్ల గ్రాస్ అందుకున్న ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా రూ.1250 కోట్ల గ్రాస్ మార్క్ అందుకుని ప్రస్తుతం 19 రోజులు గడిచేసరికి రూ.1500 కోట్ల క్లబ్ చేరువలోకి వెళ్లింది.

05/17/2017 - 21:34

అనీష్‌చంద్ర, పావని, ఆర్యన్, పూర్ణి ప్రధాన తారాగణంగా ప్లాన్ బి ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రేయా ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ధృవశేఖర్ దర్శకత్వంలో భరత్ అవ్వారి రూపొందించిన చిత్రం ‘లవర్స్ క్లబ్’. పక్కా యూత్‌ఫుల్ ఎమోషనల్ లవ్‌స్టోరీగా రూపొందిన సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని నిర్మాత చెప్పుకొచ్చారు. కొత్తవారైనా మెచ్యూరిటీతో నటించారని, దర్శకుడు వైవిధ్యంగా సినిమాను తెరకెక్కించారన్నారు.

05/17/2017 - 21:33

బాహుబలి ఘన విజయంతో ఊపుమీదున్న ప్రభాస్, అదే స్పీడ్‌ని తన తరువాతి సినిమాకీ కొనసాగించే పనిలో ఉన్నాడు. సుజిత్ దర్శకత్వంలో ఈ చిత్రం సుమారు 150 కోట్ల బడ్జెట్‌తో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అయితే సాహో సినిమాలో ప్రభాస్‌కి జోడీగా ఇప్పటివరకు ఒక్క అమ్మాయిని కూడా ఫైనల్ చేయలేదు. మొన్న కత్రినా అన్నారు, ఇప్పుడు శ్రద్ధాకపూర్, దిశా పటాని అంటున్నారు.

05/17/2017 - 21:32

సంపూర్ణేశ్ బాబు, గీత్‌షా జంటగా ఎస్‌ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఏఎన్‌ఎన్ ఫిలింస్ పతాకంపై సలీం ఎండి, శ్రీనివాస్ వంగాల నిర్మిస్తున్న చిత్రం వైరస్. నో వాక్సిన్.. వోన్లీ టాక్సిన్ ఉప శీర్షికతో తెరకెక్కుతున్న చిత్రంలోని పాటలు ఈనెల 20న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

05/17/2017 - 21:31

విజయ్, కీర్తిసురేష్, జగపతిబాబు ప్రధాన తారాగణంగా పుష్యమి ఫిలిం మేకర్స్ పతాకంపై భరతన్ దర్శకత్వంలో బెల్లం రామకృష్ణారెడ్డి అందిస్తున్న చిత్రం ‘విజయభైరవ’. ఈ సినిమాకు సంబంధించిన తొలి కాపీ సిద్ధమైంది. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు.

05/17/2017 - 21:30

దండుపాళ్యం చిత్రంతో దర్శకుడు శ్రీనివాసరాజు పొందిన గుర్తింపు సామాన్యమైనది కాదు. ఆ చిత్రం విజయవంతమైన నేపథ్యంలో ‘దండుపాళ్యం-2’ చిత్రాన్ని సీక్వెల్‌గా రూపొందించారు. వెంకట మూవీస్ పతాకంపై రూపొందించిన ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.

05/17/2017 - 21:29

శ్యామ్, శ్రీకీర్తిక, సుమన్ ప్రధాన తారాగణంగా నవ్య మూవీ మేకర్స్ పతాకంపై తోట కృష్ణ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘నీలంపాటి అమ్మోరు’. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్ట్ఫికెట్ అందుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.

05/17/2017 - 21:28

పిహెచ్ ప్రొడక్షన్స్ నిర్మించిన హారర్, ఫన్, లవ్ కానె్సప్ట్ సినిమా ‘టిక్ టాక్’. సినిమాకు హీరో, దర్శక నిర్మాత అయిన హరినాథ్ పొలిచర్ల మీడియాకు చెప్పిన విశేషాలు.
మానసిక తృప్తికి..

05/17/2017 - 21:27

‘వైశాఖం’ పాటలు సీనియర్ దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రశంసలు అందుకున్నాయి. స్వయంగా వైశాఖం ఆఫీస్‌కు వచ్చిన పూరి, పాటలను తిలకించి యూనిట్‌ను అభినందించాడు. ఆర్‌జె సినిమాస్ పతాకంపై హరీశ్, అవంతిక జంటగా జయ బి దర్శకత్వంలో బిఎ రాజు నిర్మిస్తోన్న లవ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘వైశాఖం’.

Pages