S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/12/2018 - 20:56

ప్రియమణి టైటిల్ పాత్రలో శ్రీ శంఖు చక్ర ఫిలింస్ పతాకంపై కోటి తూముల, ఎ.హితేష్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘అంగుళీక’. ప్రేమ్ ఆర్యన్ దర్శకుడుగా పరిచయమవుతున్నారు. దీపక్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్ర టీజర్ లాంచ్ ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ చేతుల మీదుగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా కోడి రామకృష్ణ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా గురించి, కథ గురించి నాకు మొదటినుంచి తెలుసు.

03/12/2018 - 20:54

మంగళ, క్రిమినల్స్ వంటి భిన్నమైన చిత్రాలను నిర్మించిన మంత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న మరో విభిన్నమైన చిత్రం ‘వెపన్’. అవినాష్, ప్రదీప్ రావత్, రాజు రాయ్, రాజు, మధుబాబు ప్రధాన పాత్రల్లో ఆర్.ఎస్.సురేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శర్మ చుక్క నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్ ఈనెల 20 నుంచి జరగనుంది.

03/11/2018 - 22:35

మాస్ రాజా రవితేజ హీరోగా నటిస్తున్న అమర్ అక్బర్ అంటోని చిత్రం లేటెస్ట్‌గా మొదలైన విషయం తెలిసిందే. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ అమెరికాలో జరగనుంది. అయితే ఇందులో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని తెలిసింది. అందులో ఇప్పటికే ఓ హీరోయిన్‌గా అను ఇమ్మానుయేల్‌ని ఎంపిక చేసారు. ఇక మరో హీరోయిన్‌గా కాజల్‌ని అడిగారని తెలిసింది.

03/11/2018 - 22:34

హారర్ కామెడీ జోనర్‌లో వచ్చిన చాలా సినిమాలు మంచి విజయం సాధించాయి. అలాంటి వాటిలో గీతాంజలి ఒకటి. ఇప్పుడు ఈ సినిమాకు స్వీక్వెల్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. సుబ్బు అనే నూతన దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌లో బిజీగా ఉంది. త్వరలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించబోతున్నారు చిత్ర యూనిట్. కోన వెంకట్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు.

03/11/2018 - 22:31

అఖిల్ హీరోగా నటించే మూడో సినిమాకు రంగం సిద్ధమవుతుంది. అఖిల్, హలో సినిమాలతో పెద్దగా సంతృప్తి చెందని అఖిల్ మూడో సినిమాతో అయినా మంచి హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. అందుకే తాజాగాతొలిప్రేమ లాంటి సక్సెస్‌ఫుల్ చిత్రాన్ని అందించిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేయడానికి ఓకే చెప్పాడట. ఇటీవలే వీరి మధ్య కథా చర్చలు జరిగాయని, కథను అటు నాగార్జున కూడా విని ఓకే చేయడంతో అఖిల్ ప్రొసీడ్ అవ్వమని చెప్పాడట.

03/11/2018 - 22:29

మనోజ్ నందన్, ప్రియాసింగ్ హీరోహీరోయిన్లుగా హెచ్.పిక్చర్స్ పతాకంపై హసీబుద్దీన్ నిర్మాతగా, సత్యవరపువెంకటేశ్వరరావుని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం ‘మనసైనోడు’ ఇటీవల ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 17న విడుదల చేస్తున్నారు.

03/11/2018 - 22:27

అనూహ్యమైన కథాంశంతో ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కుతోన్న కొత్తతరం ప్రేమ కథా చిత్రం ‘సమ్మోహనం’ జూన్ 15న విడుదల కానుంది. సుధీర్‌బాబు హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ భామ అదితీరావు హైదరీ ఇందులో నాయికగా నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 10గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

03/11/2018 - 22:25

ప్రతి క్షణాన్ని ఆనందంగా గడపాలని ప్రతి ఒక్కరి మనసులోను ఉంటుంది. జీవితంలో మిగిలిన రోజుల సంగతి ఎలా ఉన్నా.. కాలేజీలో, క్యాంపస్‌లో సరదాగా గడిపే క్షణాలు మాత్రం ఆనందానికి కేరాఫ్ అడ్రస్‌లు. ఓవైపు చదువు అనే బాధ్యత ఉన్నా.. భవిష్యత్తు గురించి ఆలోచనలు వెంటాడుతున్నా.. చుట్టూ స్నేహితులు, అందమైన ఆనందాల లోకంలో విహరింపచేస్తాయి.

03/11/2018 - 22:23

‘రాజరథం’ నుండి ముచ్చటగా మూడో పాట ‘చల్ చల్ గుర్రం’ విడుదలైంది. చిత్రానికి పనిచేసే వారిని ఆకట్టుకునే నైపుణ్యంతో, ఉన్నత ప్రమాణాలతో ఆకర్షిస్తున్న ‘రాజరథం’ ఈ పాటతో మరోసారి ఆశ్చర్యపరచనుంది. ఎన్నో సినిమాలకి, ఎంతో మందికి డబ్బింగ్ చెప్పిన ప్రముఖ నటుడు రవిశంకర్ మొట్టమొదటిసారి ‘రాజరథం’లో తాను పోషిస్తున్న ‘అంకుల్’ పాత్ర కోసం ‘చల్ చల్ గుర్రం’ పాట పాడారు.

03/10/2018 - 02:33

అజయ్ దేవగన్ సపోర్ట్‌తోనే నాకు అవకాశాలు వస్తున్నాయంటూ బాలీవుడ్‌లో ప్రచారం జరగడంపై హాట్ భామ ఇలియానా ఘాటుగా రెస్పాండ్ అయింది. ప్రస్తుతం ఆయనతో రైడ్ సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడు ఈ ప్రచారం గురించి చెబుతూ తన కోసం ముబారకన్ స్క్రిప్ట్ పరిశీలించమని కోస్టార్ అర్జున్ కపూర్ తన వద్దకు స్క్రిప్ట్ పంపించాడని వ్యంగ్యంగా చెప్పింది.

Pages