S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/07/2018 - 20:44

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘ఏ మంత్రం వేశావే’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమవుతోంది శివానీ సింగ్. గోలీసోడా ఫిలిం పతాకంపై సుర ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో శ్రీ్ధర్ మర్రి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ శివానీ చెప్పిన విశేషాలు... నేను ఢిల్లీ అమ్మాయిని. అమ్మ టీచర్, నాన్న ఏరోనాటిక్ ఇంజనీర్. సింపుల్ ఫ్యామిలీ.

03/07/2018 - 20:42

అరుణ్ తేజ్, చరిష్మా శ్రీకర్ జంటగా బి.ఎన్.రెడ్డి అభినయ దర్శకత్వంలో కె.ఎస్.పి ప్రొడక్షన్స్ పతాకంపై డా.ఎస్.కీర్తి, జి.పార్థసారథిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘నీతోనే హాయ్ హాయ్’. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం హైదారాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ నటుడు శ్రీకాంత్ హీరో హీరోయిన్లపై క్లాప్ కొట్టారు.

03/06/2018 - 21:08

నెల్లూరి పెద్దారెడ్డి పేరు వినగానే మనకు ప్రఖ్యాత హాస్యనటుడు బ్రహ్మానందం ఇట్టే గుర్తుకు వస్తాడు. జె.డి చక్రవర్తి హీరోగా నటించిన ‘అనగనగా ఒకరోజు’ సినిమాలో బ్రహ్మానందం చెప్పిన ఈ డైలాగ్ ఎంతటి పాపులర్ అయిందో మనకు తెలిసిందే. అయితే తాజాగా అదే పేరుతో ఇప్పుడు ఓ సినిమా కూడా తెరకెక్కింది. సి.హెచ్ రఘునాథరెడ్డి నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి వి. జయరాం రెడ్డి దర్వకత్వం వహించారు.

03/06/2018 - 21:06

నాగశౌర్య, సాయిపల్లవి జంటగా ఎన్.వి.ఆర్. సినిమా సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ పతాకంపై విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కణం’. మార్చిలో సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ- ‘కణం’ సినిమాను తెలుగులో మా ఎన్‌విఆర్ బ్యానర్‌పై విడుదల చేస్తున్నందుకు ఆనందంగా ఉంది.

03/06/2018 - 21:03

ఫస్టు లుక్కు సోమవారం. మాట కలిపి మంగళవారం’ అంటూ మన యువ కథానాయకుడు నితిన్ ‘గ ఘ మేఘ’తో ఉన్న తన అనుబంధాన్ని శ్రోతలతో పంచుకున్నారు. నితిన్ మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘్ఛల్ మోహన రంగ’. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తుండగా, శ్రీమతి నిఖితా రెడ్డి సమర్పణలో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, త్రివిక్రమ్ మరియు శ్రేష్ఠ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

03/06/2018 - 21:00

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ధనుష్ సమర్పణలో లైకాప్రొడక్షన్స్, వండర్‌బాయ్ ఫిలింస్ ప్రై.లిమిటెడ్ పతకాలపై పా రంజిత్ దర్శకత్వంలో ధనుష్ నిర్మిస్తున్న చిత్రం ‘కాలా’. ఏప్రిల్ 27న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల చేశారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ కొత్త లుక్ ఈ సినిమాకి హైలైట్‌గా నిలవనుంది. ‘నలుపు శ్రమ జీవుల వర్ణం..

03/06/2018 - 20:58

టాలీవుడ్‌లో సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ కెరీర్‌ని చక్కగా ప్లాన్ చేసుకుంటున్నాడు అల్లు అర్జున్. కథలతోపాటు పాత్రల విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం నా పేరు సూర్య సినిమాలో నటిస్తున్న అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమా కోసం అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. నాపేరు సూర్య సినిమా దాదాపు పూర్తికావచ్చింది.

03/06/2018 - 20:56

కోలీవుడ్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్ తరువాత ఆ రేంజ్‌లో ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో అజిత్. తలా అజిత్‌గా ఫాన్స్ పిలుచుకొనే అజిత్, మొదటిసారి ఓ హారర్ సినిమా చేయడానికి ఓకె చెప్పాడు!? ప్రస్తుతం ఆయన దర్శకుడు శివతో ఓ సినిమా చేస్తున్నాడు. శివ-అజిత్‌ల కాంబినేషన్‌లో వచ్చిన వీరం, వేదమ్, వివేకం, సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి.

03/06/2018 - 20:54

అలనాటి ప్రఖ్యాత బాలీవుడ్ నటి షమ్మి (89) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సందీప్ ఖోస్లా ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ ఆమెకు నివాళులు అర్పించారు. 18ఏళ్ల వయసులో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన షమ్మిని బాలీవుడ్‌లో అందరూ ముద్దుగా ‘షమ్మి ఆంటీ’ అని పిలుచుకునే వారు.

03/06/2018 - 20:52

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందాలని ఎంతో కాలంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటోంది. అందాల భామ పూజా హెగ్డేను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. సంగీతాన్ని తమన్ అందించగా, ఛాయాగ్రహణం పి.ఎస్.వినోద్ అందిస్తారు.

Pages