S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/02/2018 - 20:46

నిఖిల్ హీరోగా యూత్‌ఫుల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన కిర్రాక్ పార్టీ చిత్రాన్ని మార్చి 16న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేయనున్నారు. చిత్రం షూటింగ్ పూర్తికాగా, శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటుంది. ఇటీవలే విడుదలైన ‘కిర్రాక్ పార్టీ’ టీచర్ మరియు పాటలకు విశేష స్పందన వస్తుంది. నిఖిల్ స్టైలిష్ మ్యాచో లుక్స్ చిత్రంపై అంచనాలను మరింత పెంచేసాయి.

03/02/2018 - 20:45

కార్తికేయ, పాయల్ రాజపుట్ జంటగా అజైయ్ భూపితి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఆర్‌ఎక్స్ 100 కెసిడబ్ల్యు బ్యానర్‌పై అశోక్‌రెడ్డి గుమ్మకొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రీ లుక్‌ను ఆదివారం విడుదల చేశారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. రావు రమేష్, సింధూర పువ్వు రాంకీ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

03/03/2018 - 01:59

యువ సంగీత దర్శకుడు అనిరుథ్‌కు సూర్ చాన్స్ దక్కింది. పిజ్జా, జిగిరితండా, ఇరువై వంటి విభిన్నమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన వైవిధ్యమైన దర్శకునిగా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ రజనీకాంత్‌ను డైరెక్ట్ చేయబోతున్నాడు. కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. రజనీకాంత్ అభిమానుల అంచనాలకు తగ్గకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోందీ చిత్రం. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

03/02/2018 - 20:42

బాలీవుడ్ నటి సన్నీ లియోనీకి దక్షిణాదిన కూడా మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే పలు సినిమాల్లో స్పెషల్ పాటలతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆమె ఇప్పుడు ‘వీరమాదేవి’ చిత్రంతో పూర్తి స్థాయి కథానాయకిగా తెలుగు, తమిళ పరిశ్రమల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. దర్శకుడు విసి. వడివుడియన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సన్నీ వారియర్ క్వీన్‌గా కనిపించనుంది.

03/02/2018 - 20:40

ఝుమ్మంది నాదంతో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించిన తాప్సీ కి తెలుగులో పెద్ద చెప్పుకోదగ్గ అవకాశాలు లేనప్పటికీ హిందీలో మాత్రం కెరీర్ బానే సాగుతోంది. కానీ ఈమె దురదృష్టమో ఏమో కాని ఈమె ఏం మాట్లాడినా జనాలు పెడార్థాలు తీసేస్తున్నారు. మళ్లీ ఈమె వచ్చి అది కాదు మొర్రో అని చెప్పుకోవలసి వస్తోంది. సోషల్‌మీడియాలో ఈ మధ్యనే చేసిన ఒక పోస్ట్ వల్ల ఇరకాటంలో పడింది.

03/02/2018 - 20:39

రవితేజ వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. గత ఏడాది రాజాదిగ్రేట్, టచ్ చేసి చూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో ఈ ఏడాది కళ్యాణ్ దర్శకత్వంలో నేల టికెట్, శ్రీను వైట్ల సినిమాలతో రాబోతున్నాడు. నేల టికెట్ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. మాళవిక శర్మ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా శక్తికాంత్ సంగీతం అందిస్తున్నాడు.

03/01/2018 - 21:56

అల్లు అర్జున్, అను ఇమాన్యుయల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష శ్రీ్ధర్, బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతుంది. ఫిలిం సిటీతో పాటు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుతున్నారు. ఈ నెల 14 వరకు ఈ షెడ్యూల్ జరుగుతుందని నిర్మాతలు తెలిపారు.

03/01/2018 - 21:55

సూపర్‌స్టార్ మహేష్‌బాబు, సూపర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న భారీ చిత్రం ‘్భరత్ అనే నేను’. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన ‘ది విజన్ ఆఫ్ భరత్’ను మార్చి 6న విడుదల చేయనున్నారు.

03/01/2018 - 21:53

డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల వైఖరిని నిరసిస్తూ నేటి నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల బంద్ పాటించాలని దక్షిణాది రాష్ట్రాల నిర్మాతల మండలి ఐకాస తీర్మానించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళలో కూడా థియేటర్లను బంద్ చేస్తున్నట్టు ఐకాస చైర్మన్ నిర్మాత డి.సురేష్‌బాబు గురువారం పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు.

03/01/2018 - 21:51

నేనే రాజు నేనే మంత్రి తరువాత తేజ దర్శకత్వం వహిస్తోన్న సినిమాలో వెంకటేష్ హీరోగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆట నాదే వేట నాదే అనే టైటిల్ ఈ సినిమాకు పరిశీలనలో వుంది. మార్చి 12 నుండి ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో మొదలుకానుంది. వెంకటేష్ నటిస్తున్న 72వ సినిమా ఇది. అలాగే శ్రీయకు కూడా ఇది 72వ సినిమా అవ్వడం విశేషం. యాదృచ్ఛికంగా ఇద్దరూ ఒకే సినిమాలో నటించబోతున్నారు.

Pages