S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

02/28/2018 - 21:01

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ కొత్త టైటిల్‌పై ఇద్దరు దర్శకులు ‘మాదంటే మాది’ అంటూ నానా రభస చేస్తున్నారు. ఇంతకీ ఆ టైటిల్ ఏమిటో తెలుసా? ‘అహం బ్రహ్మస్మి?’ ఈ టైటిల్ కోసం ఓ వైపు క్రేజీ దర్శకుడు క్రిష్ ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు ‘ఘాజి’తో సంచలన దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న సంకల్ప్‌రెడ్డి కూడా ప్లాన్ చేస్తున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా? మెగా హీరో వరుణ్ తేజ్. వివరాల్లోకి వెళితే...

02/28/2018 - 21:00

నారా రోహిత్ ప్రస్తుతం ‘ఆటగాళ్ళు’ సినిమా షూటింగ్‌లో ఉన్నారు పరుచూరి మురళీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండనుంది. ఈ చిత్రంలో రోహిత్ సరసన హీరోయిన్‌గా బెంగాలీ నటి దర్శన బానిక్‌ను సెలెక్ట్ చేశారట. ఇప్పటికే ఆమె తన పాత్ర తాలూకు షూటింగ్ కూడా మొదలుపెట్టింది.

02/28/2018 - 20:59

ఇండియన్ సినిమా 2013లో శత వార్షిక సంబరాలు చేసుకున్నప్పుడు- సిఎన్‌ఎన్ ఐబిఎన్ వాళ్లు చేసిన సర్వేలో - వందేళ్ల ఉత్తమ నటిగా - రూప్ కి రాణిగా ఉత్తరాదిన- అతిలోక సుందరిగా దక్షిణాన వాసికెక్కిన-250 చిత్రాల మహానటి శ్రీదేవి ఎంపికైంది.. నటుల పాలిట బాక్సాఫీసు వరం ఆమె - నటీమణుల పాలిట సింహస్వప్నం కూడా అయిన శ్రీదేవి - నిర్వచనానికి సరిపోయే ‘చైల్డ్ ప్రోడిజి’.

02/27/2018 - 20:39

ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ముంబైలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో శివ, గోవింద గోవింద సినిమాల తరువాత దాదాపు 20 ఏళ్ళ గ్యాప్ అనంతరం వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. నాగార్జున కెరీర్‌లోనే బెస్ట్ చిత్రంగా నిలిచిన శివ తర్వాత ఆ స్థాయిలో తెరెకెక్కుతున్న చిత్రమిది.

02/27/2018 - 20:37

నిరూప్ భండారి, అవంతిక షెట్టి జంటగా, ఆర్య ముఖ్యపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాజరథం’. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా పలువురు టాప్ టెక్నీషియన్లు ఈ ట్రైలర్‌ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఈ సందర్భంగా రాజకృష్ణన్ మాట్లాడుతూ- ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించే చిత్రం ఇదని, ఇంత మంచి చిత్రాన్ని అందిస్తున్న టీమ్‌ను అభినందించకుండా ఉండలేమని తెలిపారు.

02/27/2018 - 20:36

షఫీ, లక్కీ ఎకారి, సాయికిరణ్, పూజాశ్రీ, మేఘన, జ్యోతికా యాదవ్ ముఖ్యపాత్రల్లో సత్యనారాయణ దర్శకత్వంలో బీచుపల్లి ఆంజనేయ ప్రొడక్షన్స్ పతాకంపై హెచ్.రఘు నిర్మిస్తున్న చిత్రం ‘నందికొండ వాగుల్లోన’. ఈ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదల చేశారు. పాటల సీడీని ఎర్రళ్ల శ్రీనివాస్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నటుడు శివారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మధుసూదనాచారి, ఆర్.కె.గౌడ్, సత్యానంద్ తదితరులు పాల్గొన్నారు.

02/27/2018 - 20:35

వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని, ఓ వైపు హీరోగా డబుల్ హ్యాట్రిక్ విజయాలను అందుకుంటూ మరోవైపు ‘అ!’తో నిర్మాతగా కూడా సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం కృష్ణార్జున యుద్ధం చిత్రంలో నటిస్తున్న నాని, మరో చిత్రానికి ఓకె చెప్పినట్టు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా మైత్రీ మూవీస్ బ్యానర్‌లో పవన్‌కళ్యాణ్‌తో ఓ సినిమా చేయడానికి ప్రయత్నాలు జరిగాయి.

02/27/2018 - 20:32

సాధారణంగా సినిమాల్లో హీరోయిన్ అంటే ఖచ్చితంగా గ్లామర్‌గా వుండాలి, అందంగా ఆకర్షించాలి. అందుకే ఆమెను అందమైన చందమామలా చూపిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు దర్శక నిర్మాతలు. సినిమాల్లో హీరోదే పైచేయి అయినా కూడా హీరోయిన్ లేకపోతే ఆ సినిమా లెక్కలోకి రాదు. హీరోయిన్ అంటేనే ఆ సినిమాకు అందం చందం.

02/26/2018 - 21:02

‘బాహుబలి’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ అంటే ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఓ రేంజ్ ఫాలోయింగ్ ఏర్పడింది. అతడితో సినిమా చేసేందుకు పలువురు దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ‘సాహూ’ సినిమా చేస్తున్న ప్రభాస్ దీని తరువాత ‘జిల్’ దర్శకుడు రాధాకృష్ణతో మరో సినిమాకు ఓకె చెప్పిన విషయం తెలిసిందే.

02/26/2018 - 21:00

బొమ్మాళి రవిశంకర్, పూజాగాంధీ, మకరంద్ దేశ్‌పాండే, రవికాలే ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం దండుపాళ్యం. ఈ గ్యాంగ్‌కి కన్నడలో మంచి క్రేజ్ వుంది. ఆ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు శ్రీనివాసరాజు సహజంగా తెరకెక్కించారు. అలా చేసిన దండుపాళ్యం 1, దండుపాళ్యం 2 భారీ ఓపెనింగ్స్‌తో సూపర్ సక్సెస్ సాధించాయి.

Pages