S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

02/21/2018 - 21:39

1971 భారత్ సరిహద్దుల్లో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా మలయాళంలో తెరకెక్కిన 1971 బియాండ్ బార్డర్స్ చిత్రాన్ని తెలుగులో ‘యుద్ధ్భూమి’ పేరుతో విడుదల చేస్తున్నారు. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, అల్లు శిరీష్ హీరోలుగా నటించిన ఈ చిత్రానికి మేజర్ రవి దర్శకత్వం వహించాడు. జస్‌రాజ్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీజ్యోతి క్రియేషన్స్ బ్యానర్లపై ఎ.ఎన్.బాలాజీ నిర్మిస్తున్నారు.

02/21/2018 - 21:38

రంజిత్ హీరోగా పరిచయం అవుతూ దిక్కులు చూడకు రామయ్య ఫేం త్రికోటి పేట దర్శకత్వంలో సొమ్మి ఫిలింస్ పతాకంపై భరత్ సోమి నిర్మించిన చిత్రం ‘జువ్వ’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా హీరో రంజిత్ చెప్పిన విశేషాలు...మాది వైజాగ్. చిన్నప్పటినుంచీ సినిమాలంటే ఇష్టం. ఆ ఆసక్తితోనే ఇండస్ట్రీలోకి వచ్చాను. హైదరాబాద్‌లో ఎంబిఏ చేశాను.

02/21/2018 - 21:38

దండుపాళ్యం బ్యాచ్ అంటే సినిమా జనాల్లో క్రేజ్ వుంది. దండుపాళ్యం-1, దండుపాళ్యం-2 భారీ ఫెనింగ్స్‌తో సూపర్ సక్సెస్ సాధించాయి. ఇప్పుడు చివరి పార్టుగా దండుపాళ్యం-3 మార్చి 2న రానుంది. భిన్నమైన కథాంశంతో, సహజమైన సన్నివేశాలతో, భావోద్వేగమైన నటనతో దండుపాళ్యం చిత్రాలు క్రేజ్ సంపాదించుకున్నాయి. ఇదే ఊపులో దండుపాళ్యం-3 కూడా తెరకెక్కింది.

02/20/2018 - 21:25

సీనియర్ నటీమణి, దర్శకురాలు, నిర్మాత, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ హోల్డర్ విజయనిర్మల నేడు తన 73వ జన్మదిన వేడుకలను ఘట్టమనేని వంశాభిమానుల సమక్షంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా సూపర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ.. ‘‘అక్కినేని నాగేశ్వరరావు, రజనీకాంత్, శివాజీగణేషన్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు తీసిన ఏకైక లేడీ డెరెక్టర్ విజయనిర్మల.

02/20/2018 - 21:22

జైలవకుశ తరువాత కొంత గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్, తన తదుపరి చిత్రం కోసం మేకోవర్ విషయంలో చాలా సీరియస్‌గా వున్నాడు. ఆయన తదుపరి చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్‌లోనే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

02/20/2018 - 21:21

రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో జె.బి క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి భాగ్యలక్ష్మి నిర్మించిన సినిమా ‘ఊ.పె.కు.హ’. ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడి అనేది క్యాప్షన్. సాక్షి చౌదరి కథానాయిక. ‘నిధి’ ప్రసాద్ దర్వకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్ విడుదల చేశారు. ‘జెబి క్రియేషన్స్’ అధినేత విక్రమ్ మాట్లాడుతూ ‘‘సినిమా అనేది ఒక బిజినెస్. అందులో టార్గెట్ ఆడియన్స్.

02/20/2018 - 21:18

రుద్రమదేవి చిత్రం తరువాత దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించే చిత్రం ‘హిరణ్యకశప’. రానా హీరోగా నటించే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ఇదివరకే కథా చర్చలు జరుపుకున్న ఈ చిత్రం ఆగస్టు నుండి సెట్స్‌పైకి రానున్నదట. దాదాపు రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కే ఈ చిత్రంలో హిరణ్యకశ్యపుడిగా రానా కనిపిస్తాడట. టైటిల్ కూడా హిరణ్యకశప అని పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

02/20/2018 - 20:52

అబ్బాయితో అమ్మాయి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన పలక్ లల్వాని మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోయినా హీరోయిన్‌కు మాత్రం అవకాశాలు తెచ్చిపెట్టింది. తాజాగా ఆమె నటిస్తున్న చిత్రం జువ్వ. త్రికోటి పేట దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 23న విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ పలక్ లల్వాని చెప్పిన విశేషాలు...

02/20/2018 - 20:51

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కాలా’. పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తికావచ్చింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఏప్రిల్ 27న విడుదలకానున్న ఈ సినిమా ముంబై నేపథ్యంలో జరిగే మాఫియా కథతో తెరకెక్కుతోంది.

02/20/2018 - 20:49

అలా మొదలైంది సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నిత్యామీనన్ తొలి చిత్రంతోనే తనదైన గుర్తింపు సంపాదించుకుంది. రెగ్యులర్ పాత్రలకు భిన్నంగా ప్రయోగాత్మక పాత్రల్లో నటిస్తూ క్రేజ్ తెచ్చుకుంది. రొటీన్ పాత్రలు చేయడం ఇష్టం వుండదని, అలాంటివి చేసుకుంటూ వెళితే బోర్ కొట్టేస్తుందని అంటోంది నిత్య. తాజాగా ఈమె నటించిన చిత్రం ‘అ!’.

Pages