S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

02/05/2018 - 20:23

తమిళ స్టార్ హీరో అజిత్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా ఆయన ఈమధ్య వి అక్షరంతో సినిమాలు చేస్తూ బాక్సాఫీస్‌వద్ద కొత్త రికార్డుల్ని సృష్టిస్తున్నాడు. అజిత్‌కు ‘వి’ అక్షరం బాగా కలిసివచ్చినట్లుంది. అందుకే ఆయన తదుపరి చిత్రానికి కూడా ‘విశ్వాసం’ టైటిల్‌గా ఎంచుకున్నారు.

02/05/2018 - 20:16

గుడ్ అంటే మంచి, బ్యాడ్ అంటే చెడు, అగ్లీ అంటే తింగరితనం. ఈ పదాలు మనకు తెలిసినవే. కాకపోతే సందర్భానుసారం అవి బయటపడుతుంటాయి. మనం వాటిని అలాగే తగిన సందర్భంలో ఉపయోగిస్తుంటాం. ఇప్పుడు వీటనే టైటిల్‌గా పెట్టి రచయిత హర్షవర్ధన్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘గుడ్ అండ్ బ్యాడ్ అగ్లీ’. ఈ చిత్రానికి హర్షవర్ధన్ సంగీత సారథ్యం వహించడం కూడా విశేషం. ప్రొడక్షన్ అంజిరెడ్డి, ఎస్.కె.

02/04/2018 - 21:19

అనుష్క గొప్ప నటి. ఎంత గొప్పనటి అంటే మహానటి సావిత్రి మాదిరి నటనా కౌశలం వున్న నటి. అందరు కథానాయికల్లాగా కేవలం ప్రేమకథా సినిమాలు, కుటుంబ కథా చిత్రాలు, హారర్ చిత్రాల్లో మాత్రమే కాకుండా పౌరాణిక చిత్రాలు, రాజసం వున్న చిత్రాలు, ‘వేదం’ లాంటి చిత్రాల్లో వేశ్య పాత్ర పోషించడం గొప్ప సాహసం. అనుష్క ఎలాంటి సినిమాల్లో నటించినా కూడా సమాజం ఆ సినిమా నుండి ఒకగొప్ప మెసేజ్ స్వీకరిస్తుంది.

02/04/2018 - 21:07

వరుస సినిమాలతో యువ హీరో శర్వానంద్ యమ బిజీగా ఉన్నాడు. సుధీర్‌వర్మ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్న ఈ హీరో త్వరలో హను రాఘవపూడి దర్శకత్వంలో కూడా ఒక చిత్రం చేయబోతున్నట్లు తెలుస్తోంది. సుధీర్‌వర్మ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. ముందుగా ఈ సినిమాలో కాజల్, నిత్యమీనన్ నటిస్తున్నారని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

02/04/2018 - 21:02

ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ ‘మనం సైతం’ దిగ్విజయంగా తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తోంది. సంస్థ కార్యక్రమాల గురించి తెలుసుకున్న ఎంతో మంది నిస్సహాయులు ‘మనం సైతం’ చెంతకు చేరుతున్నారు. అలా వచ్చిన వారికి సహాయం చేస్తూ మనం సైతం సంస్థ తన సేవా దృక్పథాన్ని చాటుకుంటోంది. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సహజనటి జయసుధ, హాస్య నటుడు డా.

02/04/2018 - 20:59

గోపీచంద్ కథానాయకుడిగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పైన ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఆయన 25వ చిత్రం కావడం విశేషం. దీనికి ‘పంతం’ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ‘్ఫర్ ఎ కాస్’ ఉపశీర్షిక. ‘బలుపు’, ‘పవర్’, ‘జై లవకుశ’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు స్క్రీన్‌ప్లే అందించిన కె.చక్రవర్తి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు.

02/04/2018 - 20:57

నాగశౌర్య, రష్మిక మండన్న జంటగా వెంకీ కుడుములను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై ఉష మూల్పూరి నిర్మించిన ‘్ఛలో’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ - మా ‘్ఛలో’ చిత్రానికి ఇంత మంచి విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు.

02/04/2018 - 20:52

విద్యాసాగర్ రాజు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తూ నటించిన చిత్రం ‘రచయిత’. దుహర మూవీస్ పతాకంపై కళ్యాణ్ ధూలిపల్ల ఈ థ్రిల్లింగ్ లవ్ స్టోరీని నిర్మిస్తున్నారు. సెన్సార్ సహా పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకొన్న ‘రచయిత’ చిత్రాన్ని ఈ నెల 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తుండగా, ఈ చిత్రానికి సంబంధించి 10న ఒంగోలులో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు.

02/04/2018 - 20:49

తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్ట మొదటి సారిగా సినిమా మొత్తం ఒకే ఒక్క పాత్రతో వినూత్న కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఇందులో ‘లాహిరి లాహిరి లాహిరిలో..’ ఫేం ఆదిత్య ఓం హీరోగా నటించనున్నారు. ఎమినెంట్ 5 ఎంటర్‌టైన్‌మెంట్స్ అనే నూతన నిర్మాణ సంస్థ ఎస్.ఆర్ ప్రొడక్షన్ సమర్పణలో ఈ చిత్రం రూపొందనుంది.

02/04/2018 - 20:43

ఇటీవలే క్వీన్ ఆఫ్ టాలీవుడ్ అనుష్కతో ‘్భగమతి’ లాంటి సూపర్ బ్లాక్‌బాస్టర్‌ని సాధించిన యువి క్రియేషన్స్, పాకెట్ సినిమా సంయుక్తంగా లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో యంగ్ హీరో సుమంత్ అశ్విన్, మెజా ప్రినె్సస్ నిహారిక కొణిదెల జంటగా నిర్మిస్తున్న సినిమా ‘హ్యాపీవెడ్డింగ్’ షూటింగ్ పూర్తిచేసుకుంది. యువి క్రియేషన్స్ బ్యానర్‌లో తొలిసారిగా సుమంత్ అశ్విన్ నటిస్తున్నారు.

Pages