S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/27/2018 - 20:08

మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగస్థలం చిత్రం రోజురోజుకీ అంచనాలను పెంచేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫొటోలు, టీజర్ దుమ్మురేపుతున్నాయి. తాజాగా రంగస్థలం టీజర్ విడుదలై కేవలం 25 గంటల్లో కోటి వ్యూస్‌ను దాటడం విశేషం. టాలీవుడ్‌లో బాహుబలి తరువాత ఆ రేంజ్‌లో వ్యూస్ సాధించిన చిత్రమిది.

01/27/2018 - 20:07

జైలవకుశ తరువాత ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం వచ్చే నెలనుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ చిత్రంలో హీరోయిన్ కోసం అనే్వషణ సాగుతోంది. ఇప్పటికే అను ఇమ్మాన్యుయేల్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం అను ప్లేస్‌లో పూజా హెగ్డే నటిస్తుందంటూ వార్తలు వస్తున్నాయి.

01/27/2018 - 20:06

ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ తనయుడిగా సంగీత రంగంలోకి ప్రవేశించి మొదటి చిత్రంతోనే సంగీత దర్శకుడిగా తనదైన ముద్రను కనబరిచాడు సాగర్ మహతి. ప్రస్తుతం ఆయన సంగీతం అందిస్తున్న చిత్రం ‘్ఛలో’. నాగశౌర్య, రష్మిక మండన్న జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా సంగీత దర్శకుడు సాగర్ మహతి చెప్పిన విశేషాలు...

01/27/2018 - 20:03

అల్లరి నరేష్ హీరోగా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సుడిగాడు సంచలన విజయం సాధించడంతో దానికి సీక్వెల్‌గా సుడిగాడు-2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సునీల్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతారట. సుడిగాడు సినిమా నరేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

01/27/2018 - 20:02

శ్రీకాంత్, యజ్ఞశెట్టి జంటగా కరణం బాబ్జి దర్శకత్వంలో అలివేలమ్మ ప్రొడక్షన్స్ పతాకంపై అలివేలు నిర్మిస్తున్న చిత్రం ‘ఆపరేషన్ 2019’. బివేర్ ఆఫ్ పబ్లిక్ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్‌ను హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీనియర్ నటుడు కృష్ణంరాజు టీజర్‌ను లాంఛ్ చేసి అనంతరం మాట్లాడుతూ- శ్రీకాంత్ నాకు తమ్ముడిగా, కొడుకుగా కూడా నటించాడు.

01/27/2018 - 20:00

మలయాళ సూపర్‌స్టార్ అయిన షకీల ముఖ్యపాత్రలో సాయిరామ్ దాసరి దర్శకత్వంలో జీ స్టూడియోస్ పతాకంపై రాఘవ.ఎం, గణేశ్, వీరూ బాసింశెట్టి నిర్మాతలుగా రూపొందిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ శీలవతి. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- సౌత్‌లో క్రేజీ హీరోయిన్‌గా ఓ రేంజ్ గుర్తింపు తెచ్చుకున్న షకీల నటిస్తున్న 250వ చిత్రం ఇది.

01/27/2018 - 19:59

అనుష్క ప్రధాన పాత్రలో అశోక్ దర్శకత్వంలో యు.వి క్రియేషన్స్ పతాకంపై వంశి ప్రమోద్ నిర్మించిన భాగమతి చిత్రం శుక్రవారం విడుదలై భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టుకుని సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు అశోక్ మాట్లాడుతూ- అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన భాగమతి చిత్రం నిన్న విడుదలై సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది.

01/27/2018 - 19:58

సతీష్‌రెడ్డి, వౌర్యాని, ముంతాజ్ హీరో హీరోయిన్లుగా వి.జె.రెడ్డి దర్శకత్వంలో సిద్ధి విఘ్నేశ్వరా క్రియేషన్స్ పతాకంపై సిహెచ్. రఘునాధరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘నెల్లూరి పెద్దారెడ్డి’. గురురాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని పాటలు శనివారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీనియర్ దర్శకుడు సాగర్ సీడీని ఆవిష్కరించారు.

01/27/2018 - 19:55

ఆరాధ్య ప్రొడక్షన్స్ పతాకంపై ప్రదీప్ దర్శకత్వంలో పెనాక దయాకర్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘దెయ్యం చెప్పిన కథ’. ఈ చిత్రంలో 29 మంది కొత్త నటీనటులు నటిస్తున్నారు.

01/26/2018 - 20:23

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భరత్ అను నేను’. కొరటాల శివ దర్శకత్వంలో ‘శ్రీమంతుడు’ వంటి సంచలన విజయం తరువాత వస్తోన్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా రిపబ్లిక్‌డే సందర్భంగా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో సాగే కథగా వుంటుందని, ఇందులో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపిస్తాడని వార్తలు వస్తున్నాయి.

Pages