S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/19/2018 - 20:14

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై దానయ్య.డి.వి.వి నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్‌లో మొదలైంది. ఈ సందర్భంగా నిర్మాత వివరాలు తెలియజేస్తూ- రామ్‌చరణ్ - బోయపాటిల కాంబినేషన్‌లో సినిమా అనగానే ప్రేక్షకుల్లో ముఖ్యంగా మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం.

01/19/2018 - 20:13

రెబల్‌స్టార్‌గా తెలుగు పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న నటుడు. ఆయన హావభావాలు
ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తాయి. భిన్నమైన పాత్రల్లో నటిస్తూ కొత్త అర్థాన్ని చెప్పిన నటుడు కృష్ణంరాజు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, రాజకీయ నాయకుడిగా బహుముఖ

01/19/2018 - 20:12

అక్కినేని నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ప్రొడక్షన్ నెం.3 చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని, మారుతి-నాగచైతన్యల కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతుందని నిర్మాత తెలిపారు.

01/19/2018 - 20:10

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ, నయనతార జంటగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ నిర్మించిన ‘జై సింహా’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతున్న సందర్భంగా, ముఖ్యంగా ఈ చిత్రంలో బ్రాహ్మణుల గురించి బాలయ్య చెప్పిన డైలాగులకు మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల బ్రాహ్మణుల ఆధ్వర్యంలో బాలకృష్ణతోపాటు చిత్ర యూనిట్ సభ్యులను అభినందించారు.

01/19/2018 - 20:08

ఒక సామాన్య ఆర్టీసీ కండక్టర్ ఎంఎల్‌ఏగా ఎలా ఎదిగాడు? అనే కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘బగ్గిడి గోపాల్’. అర్జున్ కుమార్ దర్శకత్వంలో మహేష్, భవ్యశ్రీ, శే్వతారెడ్డి హీరో హీరోయిన్లుగా బగ్గిడి ఆర్ట్ మూవీస్ పతాకంపై బగ్గిడి గోపాల్ నిర్మిస్తున్న చిత్రం ఇది. బగ్గిడి గోపాల్ జీవితకథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

01/19/2018 - 20:07

నాగశౌర్య, రష్మిక మండన్న జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఉషా ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై శంకర్ ప్రసాద్ ముల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘్ఛలో’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 2న విడుదలకు సిద్ధమైంది. ఈనెల 25న మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరపనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు వివరాలు తెలియజేస్తూ- మా ఛలో చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ అద్భుతంగా వుంది.

01/19/2018 - 20:06

బాహుబలి-2 ఘనవిజయం తర్వాత అనేక బడా ప్రాజెక్టులకు సంబంధిచి పలు భాషల్లో ప్రకటనలు వచ్చాయి. తమిళ ఫిలింమేకర్ సి.సుందర్ కూడా ఓ భారీ చిత్రానికి సంబంధించి ప్రకటన చేశారు. సంఘమిత్ర అంటూ ఓ మహిళా ప్రాధాన్యం వున్న జానపద చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు చెప్పారు. కానీ ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారం జరుగుతోంది. మొదటా సంఘమిత్ర పాత్ర కోసం శృతిహాసన్‌ను తీసుకోవడం..

01/18/2018 - 20:56

తెరవెనుక దాసరి
రచన: పసుపులేటి రామారావు
ప్రతులకు: నవోదయ బుక్‌హౌస్
ఆర్యసమాజ్ మందిర్ ఎదురుగా
కాచిగూడ, హైదరాబాద్
ఫోన్: 040- 24652387
సెల్: 9247471361
పేజీలు: 246, వెల: రూ.300/-
*

01/18/2018 - 20:50

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా అత్యంత భారీ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా.. నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే హైదరాబాద్‌లో తొలి షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది. ప్రస్తుతం రెండో షెడ్యూల్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి రెండవ వారం నుండి కేరళలో ఈ షెడ్యూల్ మొదలుకానున్నదట.

01/18/2018 - 20:49

నటిగా నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మంచు లక్ష్మి మరోసారి సరికొత్త కానె్సప్టుతో తెరకెక్కుతున్న చిత్రంతో రాబోతోంది. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను ‘వైఫ్ ఆఫ్ రామ్’గా ప్రకటించారు.

Pages