S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/16/2017 - 02:14

‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని ఎలుగెత్తి చాటారు సుప్రసిద్ధ కవి దాశరధి రామకృష్ణమాచార్య. ఆ వీణలో ఒక తీగెగా తెలంగాణ సినీ ప్రముఖుల ప్రస్థానం వుండి తీరుతుంది. సామాన్య జనానికి అందుబాటులో వుండి ప్రభావితం చేసే ముఖ్య అంశం చలనచిత్రం. తెలంగాణ గడ్డపై జన్మించి వివిధ శాఖలలో సినీ పరిశ్రమకు విశిష్ట సేవలందించిన ప్రముఖులను రేఖామాత్రంగా పరిచయం చేసే ప్రయత్నమే ఈ వ్యాసం.

12/13/2017 - 20:21

ఈ ఏడాది వరుస విజయాలతో జోరుమీదున్న రకుల్ ప్రీత్‌సింగ్ తమిళంలో కూడా వరుస హిట్లు ఇస్తోంది. గబ్బర్‌సింగ్ దర్శకుడు హరీశ్ శంకర్ నేతృత్వంలో తెరకెక్కనున్న ఓ భారీ మల్టీస్టారర్ చిత్రంలో కూడా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కథను ఆమెకు చెప్పిన దర్శకుడు ఓకె చేయించుకున్నాడట. శర్వానంద్, నితిన్ కథానాయకులుగా ఆయన రూపొందిస్తున్న సినిమా గురించి గతంలో వార్త వచ్చిన విషయం తెలిసిందే.

12/13/2017 - 20:20

నాని, సాయిపల్లవి జంటగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్, లక్ష్మణ్ రూపొందిస్తున్న చిత్రం ‘ఎంసిఏ’. ఈ చిత్రాన్ని ఈనెల 21న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.

12/13/2017 - 20:18

కథలు ఎంపిక చేసుకోవడమే కథానాయికలకు ప్రధానమైన బలం. ఒక్కొక్కసారి కథ విన్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. అయితే సినిమా రూపంలోకి వచ్చాక తేలిపోయినట్లు అనిపిస్తుంది. అంటే.. కథకుడు బాగా చెప్పినా దర్శకుడు ఆ చిత్రాన్ని సరైన రీతిలో రూపొందించలేదనే కదా అర్థం! అలా నా కెరీర్‌లో కూడా జరిగాయి. కథ విన్నప్పుడు బాగా నచ్చి సినిమా ఒప్పుకుంటా. కొన్ని విడుదలయ్యాక చూస్తే అసలు ఈ కథను ఎందుకు ఒప్పుకున్నానా?

12/13/2017 - 20:17

జగపతిబాబు, నారారోహిత్ కథానాయకులుగా ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ పతాకంపై పరుచూరి మురళి దర్శకత్వంలో వాసిరెడ్డి రవీంద్ర, వాసిరెడ్డి శివాజీ, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘ఆటగాళ్లు’. ఈ చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

12/13/2017 - 20:16

ప్రస్తుత పరిస్థితులలో తల్లిదండ్రులు పిల్లల్ని వదిలి డబ్బుకోసం పరిగెడుతున్నారు. పిల్లలను పట్టించుకొనే తీరిక వాళ్లకు లేదు. అలాంటి ఓ పాయింట్ తీసుకుని మనసుకు హత్తుకునేలా ‘కుటుంబకథా చిత్రమ్’ సినిమాను రూపొందించారు అని హీరో కమల్ కామరాజు తెలిపారు. తాజాగా ఆయన నటించిన కుటుంబ కథా చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం గూర్చి పలు విశేషాలు వివరించారు.

12/15/2017 - 11:06

సుజయ్, శ్వేతానీల్ జంటగా శ్రీ వినాయకా క్రియేషన్స్ పతాకంపై వరుణ్ దొరా దర్శకత్వంలో ఆర్.వి.నారాయణరావు రూపొందించిన చిత్రం ‘ప్రేమాంజలి’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను ఇటీవల విడుదల చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ టీజర్ విడుదల చేయగా, మల్కాపురం శివకుమార్ బిగ్ సీడీ, ఆడియో సీడీని సాగర్ విడుదల చేశారు.

12/13/2017 - 20:14

పవన్‌కళ్యాణ్ నిర్మాతగా మారి నితిన్‌తో రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన కార్యక్రమాలు ముగింపు దశకు వచ్చాయి. పవన్‌కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై కృష్ణచైతన్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ కథ అందించడం ఓ విశేషంగా మారింది. నితిన్ కూడా సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నందున ఈ సినిమాకు ఓ మంచి టైటిల్‌ను ఎంపిక చేశారు. గుర్తుందా.. శీతాకాలం.. అనే పేరును ఎంపిక చేశారు.

12/13/2017 - 20:13

ఆశీష్‌రాజ్, సిమ్రాన్ జంటగా వి.కె.ఎ. ఫిలింస్ పతాకంపై రూపొందించిన చిత్రం ‘ఇగో’ (ఇందు, గోపి). సుబ్రహ్మణ్యం.ఆర్.వి దర్శకత్వంలో విజయ్ కరణ్, కౌశల్‌కరణ్, అనీల్ కరణ్ సంయుక్తంగా రూపొందించారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ హైదరాబాద్‌లో మారుతి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- సినిమా ఎలా ఉండబోతోందో ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుందని, ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందని తెలిపారు.

12/13/2017 - 20:12

సిరివెనె్నల క్రియేషన్స్ పతాకంపై జితేందర్, రాకేష్, గీతాషా ప్రధాన తారాగణంగా నాగరాజు తలారి స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ఐటెమ్’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్ ఫిలింనగర్ దేవాలయంలో జరిగింది. ప్రతాని రామకృష్ణగౌడ్ క్లాప్‌నివ్వగా, రాఘవేంద్ర కెమెరా స్విచ్చాన్ చేశారు. కవిత తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.

Pages