S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్రభూమి

01/24/2016 - 21:34

గ్లామర్ భామ రెజినాకు ఈమధ్య జోరు బాగా పెరిగింది. వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ విజయాలు అందుకుంటోంది. ఇప్పటికే తెలుగు తమిళ భాషలలో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడికి ఇప్పుడు ఓ క్రేజీ అవకాశం దక్కింది. తమిళంలో ముగ్గురు దర్శకుల కలయికలో ఈ సినిమా రూపొందనుంది.

01/24/2016 - 21:34

హెచ్‌డి విజన్ ఇండియా లిమిటెడ్ పతాకంపై బాల తారలతో రూపొందించిన చిత్రం ‘లిటిల్ స్టార్స్’. అహ్మద్ అఫ్ఫాన్ సమర్పణలో అనంతపురం ఫిలిమ్ సొసైటీ సహకారంతో రషీద్ బాషా దర్శకత్వంలో ఎన్.ఇబ్రహీం రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు ముగిశాయి. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

01/24/2016 - 21:32

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తాజాగా రూపొందుతున్న చిత్రం ‘రోగ్’. ఈ సినిమా ద్వారా కన్నడలో ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఇషాన్‌ని హీరోగా పరిచయం చేయనున్నారు. ఒకేసారి తెలుగు- కన్నడ భాషల్లో నిర్మించాలని మొదలుపెట్టిన ఈ సినిమా షూటింగ్ ప్రారంబించి వెంటనే ఆపేశారు. స్క్రిప్ట్‌కోసం మరికొంత టైం తీసుకున్నారట దర్శకుడు పూరి.

01/24/2016 - 21:31

నూతన నటీనటులతో రీడింగ్ లాంప్ క్రియేషన్స్ పతాకంపై అశోక్‌రెడ్డి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఓ స్ర్తి రేపురా’ (కల్పితమా.. ఖచ్చితమా). ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఫిబ్రవరి 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా అశోక్‌రెడ్డి మాట్లాడుతూ, ఒకప్పుడు ఊళ్లో దెయ్యం తిరుగుతుందని, ఇంటి గోడలపై ‘ఓ స్ర్తి రేపురా’ అని రాసేవారు.

01/23/2016 - 21:40

బెల్లంకొండ శ్రీనివాస్, సోనారిక జంటగా భీమనేని శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో తమిళంలో సూపర్‌హిట్ అయిన ‘సుందరపాండ్యన్’ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న ‘స్పీడున్నోడు’ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు వి.వి.వినాయక్ సీడీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్లు తమన్నా, రెజీనా, రకుల్‌ప్రీత్‌సింగ్, కేథరీన్ తదితరులు పాల్గొన్నారు.

01/23/2016 - 21:39

కార్తిక్‌రాజు, నిత్యాశెట్టి జంటగా చునియా దర్శకత్వంలో అయాన్ క్రియేషన్స్ పతాకంపై అక్కినేని నాగార్జున ప్రోత్సాహంతో రూపొందిన చిత్రం ‘పడేసావే’. ఈ సినిమా టీజర్ లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు, నటుడు నాగార్జునలు టీజర్‌ను ఆవిష్కరించారు.

01/23/2016 - 21:38

‘బ్రూస్‌లీ’ తరువాత రామ్‌చరణ్ హీరోగా నటించే చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తికావచ్చాయి. తమిళంలో సూపర్‌హిట్ అయిన ‘తనిఒరువన్’ చిత్రానికి రీమేక్‌గా రూపొందే ఈ చిత్రం ఫిబ్రవరి మొదటివారంలో ప్రారంభం కానుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తాడు. ఇదిలా వుండగా ఇప్పుడు రామ్‌చరణ్ మరో రీమేక్‌పై కనే్నశాడు.

01/23/2016 - 21:38

శే్వతామీనన్, మహత్ రాఘవేంద్ర, చైతన్య ఉత్తేజ్, సోనియా అగర్వాల్ ప్రధాన తారాగణంగా పర్సా రమేష్ మహేంద్ర దర్శకత్వంలో కల్వకుంట్ల తేజేశ్వరరావు రూపొందిస్తున్న చిత్రం ‘షీ’ (ఈజ్ వెయిటింగ్). మహేశ్వర ఆర్ట్స్ పతాకంపై రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ దగ్గరలోని మొయినాబాద్‌లో జరుగుతోంది.

01/23/2016 - 21:37

సినిమా రంగంలోకి హీరోయిన్లుగా వెలుగొందాలనే కోరిక ఎవరికుండదు చెప్పండి. ఇక హీరోయిన్‌గా ప్రూవ్ అయినవాళ్లయితే వారి వారి సోదరీమణులను కూడా ఈ రంగంలోకి దింపుతుంటారు. ఇప్పటికే ఇలా చాలామంది వచ్చారు. ఈ కోవలో తాజాగా మరో క్రేజీ భామ ఎంట్రీ ఇస్తోంది. మహేష్‌బాబు సరసన వన్ (నేనొక్కడినే) చిత్రంలో హీరోయిన్‌గా నటించిన కృతిసనన్ తెలుగుతోపాటు హిందీలో కూడా మంచి పేరే తెచ్చుకుంది.

01/23/2016 - 21:36

లార్డ్ శివ క్రియేషన్స్ పతాకంపై పర్వీన్‌రాజ్ (ప్లేయర్ ఫేం) కథానాయకుడిగా ఓ చిత్రాన్ని ప్రారంభించనున్నారు. ఆది మరుప్రోలు దర్శకత్వంలో ఎం.వి.ఎస్.సాయికృష్ణారెడ్డి రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది.

Pages