S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/26/2017 - 20:37

శ్రీమారుతీ ఆర్ట్ క్రియేషన్స్, సిరి క్రియేషన్స్ పతాకంపై సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘ప్రేమదేశం’. శ్రీకాంత్ సిద్ధం దర్శకత్వంలో స్రవంతి శ్రీ్ధర్ రూపొందిస్తున్నారు. అర్జున్ కళ్యాణ్, మోహన్, శివరామచంద్రన్, అక్షయ, రవళి, వైశాకి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుండి ప్రారంభం కానున్నది. వేసవి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

11/26/2017 - 20:35

హీరో విష్ణు మంచు జన్మదినం సందర్భంగా విడుదలైన ‘ఓటర్’ ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు విశేష స్పందన వస్తోంది. ప్రముఖ కేంద్ర, రాష్ట్ర రాజకీయ నాయకుల ముఖ చిత్రాలతో నిండి, ఓటర్‌గా విష్ణు తన వేలును చూపిస్తున్నట్లున్న ‘ఓటర్’ ఫస్ట్‌లుక్ పోస్టర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉందని ప్రశంసిస్తున్నారు. రామా రీల్స్ పతాకంపై జాన్ సుధీర్ కుమార్ పూదోట నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ జి.ఎస్.కార్తీక్ దర్శకత్వంలో పూర్తికావస్తోంది.

11/26/2017 - 20:34

డైరెక్టర్ శివ హీరో అజిత్ కాంబినేషన్‌లో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి. తాజాగా నాలుగోసారి ఈ కాంబినేషన్‌లో సినిమా మొదలుకానుంది. ఈ సినిమాకు ‘విశ్వాసం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పటివరకు తన తదుపరి చిత్రాన్ని అనౌన్స్ చేయని అజిత్, మరోసారి హిట్ కాంబినేషన్‌లో పనిచేసేందుకు రెడీ అవుతున్నాడు. త్వరలో ఈ సినిమా ప్రారంభం కానుంది. డైరెక్టర్ శివ చెప్పిన పాయింట్ నచ్చడంతో అజిత్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు.

11/26/2017 - 20:32

తెలుగు చలన చిత్ర కళామతల్లి తనను నమ్ముకున్న వారిని ఎప్పుడు తలపై ఎత్తుకుంటుందో? ఎప్పుడు తన పాదాల కింద తొక్కిపట్టి వుంటుందో? ఆ విధాతకుకూడా అర్ధం కాదు! కానీ, ఎందరో చిత్ర పరిశ్రమకు వస్తునే వుంటారు. కొందరు వచ్చిరాగానే, అవకాశాలు చేజిక్కించుకుని పైస్థాయికి చేరుకుని సుఖమయ జీవితాన్ని గడుపుతుంటారు.

11/26/2017 - 20:31

బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చారిత్రాత్మక చిత్రం ‘మణికర్ణిక’. రాణి రుద్రమదేవి జీవిత కథతో ఈ చిత్రాన్ని తెలుగు దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్నారు. బాలీవుడ్‌లో ఫైర్‌బ్రాండ్‌గా ఇమేజ్ తెచ్చుకున్న కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ జోరుగా జరుపుకుంటోంది. తాజాగా జోధ్‌పూర్‌లో షూటింగ్ జరుగుతుండగా కంగనకు గాయాలయ్యాయి.

11/25/2017 - 19:58

యంగ్ టైగర్ ఎన్‌టిఆర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ మూవీగా ఇమేజ్ తెచ్చుకున్న సినిమా ‘జై లవకుశ’. ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు బాబీ తదుపరి సినిమాకు సన్నాహాలు మొదలుపెట్టాడు. జై లవకుశ తరువాత బాబీకి జోరుగా అవకాశాలు వస్తున్నాయి. అయితే ఆయన తాజాగా మెగా హీరోతో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. నిజానికి రవితేజ కోసం కథను సిద్ధం చేశాడట.

11/25/2017 - 19:57

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3గా నాగచైతన్య కథానాయకుడిగా ఓ చిత్రాన్ని ప్రారంభించారు. మారుతి దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం ఉదయం రామానాయుడు స్టూడియోలో జరిగింది. అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జనవరి 5 నుండి ప్రారంభం కానుంది.

11/25/2017 - 19:56

సూర్య శ్రీనివాస్, ఆశే్లష, ప్రియాంక ప్రధాన తారాగణంగా చంద్రకళా ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై వరప్రసాద్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘టార్చిలైట్’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్ ఫిలింనగర్ దైవ సన్నిధానంలో శనివారం ఉదయం జరిగింది. శివాజీరాజా క్లాప్‌నివ్వగా, డి.వి. కెమెరా స్విచ్చాన్ చేశారు.

11/25/2017 - 19:54

శ్రీవేంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై నితిన్ కథానాయకుడిగా వేగేశ్న సతీష్ దర్శకత్వంలో దిల్ రాజు రూపొందిస్తున్న చిత్రానికి ‘శ్రీనివాసకళ్యాణం’ అనే పేరును ఖరారు చేశారు. 2018 మార్చిలో షూటింగ్ ప్రారంభించనున్నారు. శ్రావణమాసంలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయడానికి యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జె మేయర్ అందిస్తుండగా, సమీర్‌రెడ్డి కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.

11/25/2017 - 19:53

గతంలో ఆవారా, ఊపిరి చిత్రాలతో ఎంత గుర్తింపు వచ్చిందో ఖాకి సినిమాతో మరింత గుర్తింపు వచ్చింది. అందరూ అప్రీసియేట్ చేశారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ చూసి ప్రేక్షకులు థ్రిల్‌కు గురి అవుతున్నారని కథానాయకుడు కార్తి తెలిపారు. ఆదిత్య మ్యూజిక్ నిర్మాణ సంస్థ తొలిసారిగా తెలుగులో విడుదల చేసిన ఖాకి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

Pages