S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/25/2017 - 19:51

శరత్, కారుణ్య జంటగా తస్మై చిన్మయ ప్రొడక్షన్స్ పతాకంపై అనీల్ గోపిరెడ్డి దర్శకత్వంలో శిల్పా శ్రీరంగం, సరితా గోపిరెడ్డి సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘సీత.. రాముడికోసం’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేశారు. సినిమాకు సంబంధించిన టీజర్‌ను హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో స్వామి చిదాత్మానంద ఆవిష్కరించారు. ఫస్ట్‌లుక్‌ను జ్యోతి విడుదల చేశారు.

11/25/2017 - 19:50

సూరజ్, సానియా, స్నిగ్ధ ప్రధాన తారాగణంగా అనంత లక్ష్మి క్రియేషన్స్ పతాకంపై జి.ఎల్.బి.శ్రీనివాస్ దర్శకత్వంలో ముళ్ళగూరు అనంతరాముడు, రమేష్‌నాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘2 ఫ్రెండ్స్’. ఈ చిత్రానికి సంబంధించిన రీ రికార్డింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

11/25/2017 - 19:49

థౌజండ్ లైట్స్ మీడియా ప్రై. లి. పతాకంపై విరాజ్ జె.అశ్విన్, రిద్దికుమార్, రాధా బంగారు ప్రధాన తారాగణంగా టి.ప్రతాప్ దర్శకత్వంలో కె.ఎల్.ఎన్.రాజు రూపొందిస్తున్న ‘అనగనగా ఓ ప్రేమకథ’ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో శనివారం ఉదయం జరిగింది. నిర్మాత కె.ఎల్.ఎన్.రాజు క్లాప్‌నివ్వగా, సత్య రంగయ్య కెమెరా స్విచ్చాన్ చేశారు.

11/25/2017 - 19:47

‘‘చలన చిత్ర చరిత్రలో నాదంటూ ఓ పేజీ, నాకంటూ ఓ సినిమా ఉండాలన్నది ప్రతి నటీ, నటుడూ కోరుకోవడం సహజం. నేనూ అంతే! నటనకు ప్రాధాన్యం వున్న పాత్రలు దొరకడం చాలా అరుదు. నా తొలి ప్రయత్నంలోనే నాకు ఆ అవకాశం దక్కింది. అందుకు నేను చాలా ఆనందపడ్డాను. సినిమాల్లోకి వస్తాను అని అనుకోలేదు. కానీ వచ్చాను. ఇప్పుడు నాకు సినిమాయే లోకం అనిపిస్తోంది. నటిస్తున్న కొద్దీ విడదీయరాని బంధం ఏర్పడుతోంది.

11/24/2017 - 20:14

నిజంగా ఇది మెగా ఫ్యాన్స్‌కు షాకిచ్చే విషయమే. అంతేకాదు మెగా ఫ్యాన్స్‌కు పెద్దగా పండగ లాంటి న్యూస్.. అదేమిటంటారా.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 151వ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో పవర్‌స్టార్ కళ్యాణ్ గెస్ట్ పాత్ర చేయడానికి ఓకె చెప్పాడట. మీరు వింటున్నది నిజమే..

11/24/2017 - 20:13

తెలుగు, తమిళ భాషల్లో బొద్దుగుమ్మగా ఓ రేంజ్ పాపులారిటీ సంపాదించుకున్న నమిత పెళ్లి నేడు తిరుపతిలో జరిగింది. ఇటీవలే ఈ వివాహ సందర్భంగా ఓ హోటల్‌లో సంగీత్ కార్యక్రమం కూడా అట్టహాసంగా జరిగింది. తమిళ నటుడు వీరేంద్ర చౌదరితో నమిత వివాహం శుక్రవారం తిరుపతిలో ఉదయం 5.30లకు ఇస్కాన్ టెంపుల్‌లో జరిగింది. ఎందరో రసిక హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న నమిత పెళ్లి తరువాత సినిమాలు చేస్తుందా? లేదా?

11/24/2017 - 20:11

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్, మెహరీన్ ఫిర్జాదా జంటగా బివిఎస్ రవి దర్శకత్వం వహించిన చిత్రం ‘జవా న్’, ఇంటికొకడు సినిమా క్యాప్షన్. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ధియోట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. రొమాంటిక్ కామెడీగా స్టార్ట్ అయిన ఈ ట్రైలర్ హైటెక్నాలజీతో దేశభక్తిని మేళవించి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అందరి ప్రశంసలు పొందుతుంది.

11/24/2017 - 20:09

టాలీవుడ్‌లో ఓ ఫుల్ మాస్ మల్టీస్టారర్ సినిమా వచ్చి చాలాకాలం అవుతోంది. ముఖ్యంగా స్టార్ హీరోలు అలాంటి సినిమాలు చేయడంలేదు. అనేకసార్లు కొందరు దర్శకులు కథ సిద్ధమని చెప్పినా, మళ్లీ వాటి ప్రస్తావన తీసుకురావడంలేదు. తాజాగా మరొక మల్టీస్టారర్ చిత్రం తప్పకుండా వస్తోం ది అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

11/24/2017 - 20:07

గోపీచంద్, రాశీఖన్నా, అను ఇమ్మాన్యుయేల్ హీరో హీరోయిన్లుగా ఎ.ఎం జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆక్సిజన్’. శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తోన్న ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

11/24/2017 - 20:06

టాలీవుడ్ కమర్షియల్ టాలెంటెడ్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రము ఖ దర్శకుడు రాఘవేంద్రరావు 100 సినిమాలు పూర్తిచేసి సత్తాచాటుకున్న విష యం తెలిసిందే. ఈమధ్యే ఆయన కమర్షియల్ చిత్రాలను కాకుండా భక్తిరస చిత్రాలవైపు మొగ్గుచూపి ఆ తరహా సినిమాలు తెరకెక్కిస్తున్నారు. అన్నమయ్య తరువాత ఆయన శ్రీరామదాసు, మంజునాథ, షిరిడీ సాయి చిత్రాలను తెరకెక్కించారు.

Pages