S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/23/2016 - 21:06

ధనుష్, రిచా గంగోపాధ్యాయ జంటగా ఓం శివగంగ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై శ్రీరాఘవ (సెల్వరాఘవన్) దర్శకత్వంలో రూపొందించిన ‘మయక్కం ఎన్నా’ చిత్రాన్ని తెలుగులో కె.బాబురావు, కె.మల్లికార్జున్ ‘మిస్టర్ కార్తీక్’గా అనువదించారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమాలోని పాటలను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో మంగళవారం విడుదల చేశారు.

08/23/2016 - 21:05

జనతా గ్యారేజ్ చిత్రంలో నటించడం ఓ మంచి అనుభవాన్ని ఇచ్చిందని, తన సోషల్ మీడియాలో కొరటాల శివకు ధన్యవాదాలు తెలిపారు ఎన్‌టిఆర్.

08/23/2016 - 21:03

హాట్‌భామ హన్సిక ఈమధ్య కోలీవుడ్‌లోనే ఎక్కువగా సినిమాలు చేస్తోంది. తాజాగా మరో తెలుగు సినిమాలో నటించేందుకు ఓకే చెప్పింది. ఈసారి ఆమె జతకట్టేది మంచు విష్ణుతో. వరుస ప్లాపుల్లో ఉన్న తనకు ‘దేనికైనా రెడీ’ చిత్రంతో మంచి బ్రేక్ ఇచ్చిన హీరోయిన్ హన్సికతో విష్ణు రెడీ అవుతున్నాడు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని ‘గీతాంజలి’ఫేమ్ ‘రాజ్‌కిరణ్’ తెరకెక్కించనున్నాడు.

08/23/2016 - 21:01

సంచలన దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న వర్మ, అలాంటి సంచలనాత్మక చిత్రాలు తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు. ముఖ్యంగా వాస్తవ కథలను సెల్యులాయిడ్ రూపం ఇవ్వడంలో ఆయనకు ఆయనే సాటి. రక్తచరిత్ర, వీరప్పన్, 26/11 వంటి సంచలన చిత్రాలను తెరకెక్కించిన వర్మ, ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపనున్నారు. గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్న గ్యాంగ్‌స్టర్ నరుూం జీవిత కథతో సినిమా చేస్తాడని తెలిసింది.

08/23/2016 - 20:59

ధీరు మహేష్, సురేష్, సుదర్శన్ కళాధర్, ప్రియ, ఇషికాసింగ్ ముఖ్యపాత్రల్లో మాదాల కోటేశ్వరరావు దర్శకత్వంలో శ్రీ హరిహరా ఫిలింస్ పతాకంపై మధు, అనీష్, అభిరాం నిర్మించిన చిత్రం ‘కారులో షికారుకెళితే’. ఈ సినిమా టీజర్ లాంఛ్ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. టీజర్‌ను నిర్మాత బెక్కం వేణుగోపాల్ విడుదల చేశారు. మోషన్ పోస్టర్‌ను మాదాల రవి ఆవిష్కరించారు.

08/23/2016 - 20:56

సాగర్, రాగిణి నంద్వాని, సాక్షీ చౌదరి హీరో హీరోయిన్లుగా కె.వి.ద యానందరెడ్డి దర్శకత్వంలో రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్ నిర్మిస్తున్న ‘సిద్ధార్థ’ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో సాగర్ మాట్లాడుతూ, అన్ని రకాల హంగులతో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని అన్నారు.

08/23/2016 - 20:54

సునీల్ హీరోగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మిస్తున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈనెల 29నుండి రెండవ షెడ్యూల్ ప్రారంభం కానుంది.

08/23/2016 - 20:53

అందాల భామ రకుల్‌ప్రీత్‌సింగ్ ఈమధ్య టాలీవుడ్‌లో చాలా జోరు పెంచింది. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. అటు యువ హీరోలను, ఇటు సీనియర్ హీరోలను బాగానే లైన్లో పెట్టింది. ముఖ్యంగా మహేష్‌తో నటించాలనే కోరిక వుందంటూ చెప్పిన భామకు త్వరలోనే ఆ ఛాన్స్ దక్కింది. మహేష్-మురగదాస్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రంలో రకుల్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.

08/23/2016 - 20:51

‘అట్టకత్తి’, ‘మద్రాస్’ వంటి సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పా రంజిత్ ఇటీవల సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా ‘కబాలి’ చిత్రాన్ని తీసి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాడు. కలెక్షన్లపరంగా సునామీ సృష్టించినప్పటికీ ప్రేక్షకులను కబాలి పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం ఈ సంచలన దర్శకుడు తన తరువాతి సినిమాకోసం స్క్రిప్ట్ సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాడు.

08/21/2016 - 21:09

చిరంజీవి కథానాయకుడుగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిస్తున్న భారీ చిత్రానికి ‘ఖైదీ నెంబర్ 150’ అనే పేరును ఖరారు చేశారు. మొదట ఈ చిత్రానికి ‘కత్తి’, ‘కత్తిలాంటోడు’ అన్న పేర్లను పరిశీలించారు. చివరికి సెంటిమెంట్ పరంగా ‘ఖైదీ నెంబర్ 150’గా నిర్ణయించారు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో కాజల్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Pages