S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/27/2017 - 20:00

సుమంత్ హీరోగా అనీల్ శ్రీకంఠం దర్శకత్వంలో విరాట్ ఫిలిం మేకర్స్ అండ్ విఘ్నేష్ కార్తీక్ సంయుక్త నిర్మాణంలో ఆలూరు సాంబశివారెడ్డి, గంగపట్నం శ్రీ్ధర్ నిర్మిస్తున్న చిత్రం శుక్రవారం పూజా కార్యక్రమాలతో హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అంజు కురియన్ హీరోయిన్. ఈ చిత్ర విశేషాలను నిర్మాతలు తెలియజేస్తూ సుమంత్ కెరీర్‌లో వైవిధ్యంగా నిలిచిపోయే చిత్రమిది.

10/27/2017 - 19:58

యువ హీరో నాగశౌర్య హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి, శంకర్ ప్రసాద్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.1గా తెరకెక్కిన ‘చలో’ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకున్న సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో నిర్మాత ఉష మాట్లాడుతూ- ఐరా క్రియేషన్స్ మొదటి చిత్రంగా నాగశౌర్యతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. దర్శకుడు వెంకి కథ చెప్పగానే బాగా నచ్చింది.

10/27/2017 - 19:55

ఆదిత్య, రిచా జంటగా భాస్కర్ బంటుపల్లి దర్శకత్వంలో ఆదిత్య క్రియేషన్స్ పతాకంపై లక్ష్మి రూపొందిస్తున్న చిత్రం ‘జూన్ 143’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందుతోందని, వచ్చే నెల 10న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని దర్శక నిర్మాతలు తెలియజేశారు.

10/27/2017 - 19:53

అర్జున్‌రెడ్డి సినిమాతో సంచలన హీరోగా మారాడు విజయ్ దేవరకొండ. పెళ్లిచూపులు సినిమాతో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న విజయ్, మూడో సినిమాకే సంచలనం రేపడం విశేషం. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో పరశురామ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న విజయ్, ఆ తరువాత ఓ యువ దర్శకుడితో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. రాహుల్ అనే దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడట.

10/27/2017 - 19:51

బుల్లితెర నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జయతి మొదటిసారిగా వెండితెరపై హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘లచ్చి’. జె9 ఫర్ షోస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఈశ్వర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రంలోని సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మొదటి పాటను విడుదల చేశారు.

10/27/2017 - 19:50

గ్లా మరస్ క్వీన్ శ్రీదేవి తన కుమార్తెను పరిశ్రమకు పరిచయం చేయడానికి తొందరపడుతోంది. ఇన్నాళ్లుగా కుమార్తె జాన్వి తాను సొంతంగా తన ప్రయత్నాలు చేసుకునే సమయంలో అడ్డుపుల్ల వేసిన శ్రీదేవి, ఇప్పుడు తన కూతురును ఎప్పుడెప్పుడు పరిచయం చేయాలా అని ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో తనకిష్టమైన దర్శకుడు కరణ్ జోహార్‌పైనే కుమార్తె సినిమాకు సంబంధించిన విషయాలను అప్పగించింది.

10/27/2017 - 19:48

బాలీవుడ్ అందాల భామ దీపికా పదుకొనె కీలక పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘పద్మావతి’. ప్రారంభం నుండే సంచలనాలు నెలకొల్పుతున్న ఈ చిత్రాన్ని సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ట్రైలర్, తాజాగా విడుదలైన ఘూమర్ అనే పాట విడుదలై సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ సినిమా కోసం దీపికా కష్టపడి ఘూమర్ నృత్యాన్ని నేర్చుకుందట.

10/26/2017 - 20:22

సూపర్‌స్టార్ మహేష్‌బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై సూపర్‌హిట్ చిత్రాల నిర్మాత దానయ్య డి.వి.వి ప్రొడక్షన్ నెం.3గా నిర్మిస్తున్న భారీ చిత్రం షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత దానయ్య డి.వి.వి. మాట్లాడుతూ- నవంబర్ 7 వరకు హైదరాబాద్ షెడ్యూల్ జరుగుతుంది.

10/26/2017 - 20:21

పోలీస్ అధికారిగా మరోసారి తనదైన స్టైల్‌లో ప్రేక్షకులను అలరించడానికి హీరో రాజశేఖర్ ‘పిఎస్‌వి గరుడవేగ 126.18ఎం’ చిత్రంతో మరోసారి రానున్నాడు. జ్యో స్టార్ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై రూపొందించిన ఈ చిత్రాన్ని ప్రవీణ సత్తార్ దర్శకత్వం వహించారు. కోటేశ్వరరాజు నిర్మించిన ఈ చిత్రంలో పూజాకుమార్, శ్రద్ధాదాస్ కథానాయికలుగా నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సా ర్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.

10/26/2017 - 20:19

నందమూరి తారకరామారావు నటించిన ‘డ్రైవర్‌రాముడు’ గుర్తొస్తే మంచి మంచి పాటలు గుర్తొస్తాయి. అదే పేరుతో దర్శకుడు రాజ్‌సత్య ‘జబర్దస్త్’ ఫేమ్ షకలక శంకర్‌ను కథానాయకుడిగా చేసి రూపొందించిన చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. పీపుల్స్ పతాకంపై ఎం.ఎల్.రాజు, ఎస్.ఆర్.కిషన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ‘డ్రైవర్‌రాముడు’ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

Pages