S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/16/2016 - 22:49

తమిళ సూపర్‌స్టార్లు రజనీకాంత్, కమల్‌హాసన్ చాలా రోజుల తరువాత కలిసి ముచ్చటించుకున్నారు. ఈ ఇద్దరి హీరోల అభిమానులు తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అని కలహించుకుంటుంటే, వీరిద్దరూ మాత్రం నింపాదిగా తమ ఆరోగ్య విషయాల గురించి చర్చించుకొని సంతోషపడ్డారు. చెన్నైలోని ఆళ్వార్‌పేటలో కమల్ ఆఫీసుకు రజనీకాంత్ వెళ్లి ఆయన్ని కలిశారు. కమల్‌హాసన్ కాలికి అయిన గాయం గురించి రజనీకాంత్ అడిగి తెలుసుకున్నారు.

11/16/2016 - 22:46

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రముఖ పంపిణీదారుడు, నిర్మాత సుధాకర్‌రెడ్డి కలిసి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యూత్ స్టార్ నితిన్ హీరోగా పవన్‌కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, శ్రేష్ఠ్‌మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. ప్రముఖ లిరిసిస్ట్ కృష్ణచైతన్య దర్శకుడు.

11/15/2016 - 21:00

పోలీసుల వేధింపులు, మహిళలపై అరాచకాలు, పౌరహక్కులకు భంగం కలిగించే అంశాలపై హృదయాన్ని కలచివేసే దృశ్యాలతో తెరకెక్కిన ‘బ్లాక్ అండ్ వైట్’ సైలంట్ షార్ట్ ఫిల్మ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అత్యున్నత అవార్డుకు ఎంపికైంది. కేరళకు చెందిన అనుజ్ ఎస్.ఆర్ దీనిని రూపొందించారు. జాతీయ మానవహక్కుల సంఘం లఘుచిత్రాల పథకం కింద దీనిని ఎంపిక చేశారు. ఈ అవార్డుకు ఎంపికైన చిత్రాలకు లక్ష రూపాయల నగదు బహుమతిగా అందజేస్తారు.

11/15/2016 - 20:59

సూర్య, అనుష్క, శృతిహాసన్ ప్రధాన తారాగణంగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందించిన చిత్రం సింగం-3. సింగం సిరీస్‌లో భాగంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా అందిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో సురక్ష ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మల్కాపురం శివకుమార్ అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తిచేశారు.

11/15/2016 - 20:58

నాగచైతన్య, మంజిమమోహన్ జంటగా గౌతమ్‌వాసుదేవ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న మరో విభిన్న కథాచిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో’. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బేనర్‌పై గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 11న విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్‌తో ఇంటర్వ్యూ...
రెస్పాన్స్ ఎలా ఉంది?

11/15/2016 - 20:55

ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయంపై విపక్ష పార్టీల నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తుండగా బాలీవుడ్ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

11/15/2016 - 20:53

అంజలి ప్రధాన పాత్రలో కామెడీ థ్రిల్లర్‌గా శ్రీ విఘ్నేష్, కార్తీక్ సినిమా, క్రియేటివ్ డ్రావిడన్స్ పతాకంపై గంగపట్నం శ్రీ్ధర్, రెహమాన్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం చిత్రాంగద. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

11/15/2016 - 20:51

జీవా, కాజల్ అగర్వాల్ ప్రధాన తారాగణంగా డి.వి. సినీ క్రియేషన్స్ పతాకంపై తెలుగులో అందిస్తున్న చిత్రం ఎంతవరకు ఈ ప్రేమ. డి.వెంకటేష్ రూపొందిస్తున్న ఈ చిత్రానికి డి.కె. దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 24న విడుదలకు సిద్ధమైంది.

11/15/2016 - 20:50

భీమవరం టాకీస్ పతాకంపై హాసికాదత్ దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ రూపొందిస్తున్న చిత్రం ‘ఇంటి నెంబర్ 150’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

11/15/2016 - 20:48

శర్వానంద్ కథానాయకుడుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రాజు రూపొందిస్తున్న చిత్రం శతమానం భవతి. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి వేగేశ్న సతీష్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం అమలాపురంలో జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ టాకీపార్టు ఈ 18కి పూర్తిచేస్తామని, ఈనెల 28న పాటలతో సహా మొత్తం షూటింగ్ పూర్తవుతుందని తెలిపారు.

Pages