S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/10/2016 - 07:33

తరుణ్, ఓవియా జంటగా రామ్ ఎంటర్‌టైనర్స్ పతాకంపై రమేష్ గోపి దర్శకత్వంలో ఎస్.వి.ప్రకాష్ నిర్మిస్తున్న చితం ‘ఇదే నా లవ్ స్టోరీ’ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ పూర్తిచేసుకుంది. చిత్ర విశేషాలను దర్శకుడు తెల్పుతూ.. ‘లే, లడక్, కులుమనాలిలో చిత్రీకరించిన సాంగ్స్ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తాయని, మూడు పాత్రలలో తరుణ్ నటన అందరిని ఆకట్టుకుంటుందని అన్నారు.

11/10/2016 - 07:32

రామ్‌చరణ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా గీతా ఆర్ట్స్ పతాకంపై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘ధ్రువ’. ఈ చిత్రానికి సంబంధించిన పాటలు నేరుగా మార్కెట్‌లో విడుదలయ్యాయి.

11/10/2016 - 07:31

మహేష్‌బాబు-కొరటాల శివ కాంబినేషన్‌లో మరో ప్రతిష్ఠాత్మక చిత్రం ప్రారంభమైంది. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ సన్నివేశం బుధవారం ఉదయం రామానాయుడు స్టూడియోలో దేవుడి పటాలపై చిత్రీకరించారు. డి.వి.వి.దానయ్య రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ సన్నివేశంపై ఎం.శ్యాంప్రసాద్ రెడ్డి క్లాప్‌నివ్వగా, డి.సురేష్‌బాబు కెమెరా స్విచ్చాన్ చేశారు.

11/10/2016 - 07:29

తమిళ హీరో విజయ్ తన 61వ చిత్రాన్ని అట్లీకుమార్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ప్రముఖ తెలుగు కథకుడు విజయేంద్రప్రసాద్ కథ అందిస్తున్నారు. బాహుబలి, భజరంగీ భాయ్‌జాన్, ఈగ వంటి సినిమాలకు కథలను అందించి జాతీయ స్థాయి గుర్తింపు పొందారాయన. అందుకే విజయ్, నిర్మాతలు ప్రత్యేకంగా ఆయన్ని తమ సినిమాకు కథను అందించాలని కోరారు.

11/10/2016 - 07:29

అల్లరి నరేష్ కథానాయకుడిగా జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో శ్రీవేంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ రూపొందించిన చిత్రం ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేశారు. యు/ఎ సర్ట్ఫికెట్ లభించింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 12న విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు.

11/10/2016 - 07:28

హెబ్బాపటేల్, తేజస్వి మడివాడ, రావు రమేష్ ప్రధాన తారాగణంగా లక్కీ మీడియా పతాకంపై భాస్కర్ బండి దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్ రూపొందించిన చిత్రం ‘నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇటీవల విడుదలైంది.

11/10/2016 - 07:28

‘ముకుంద’ సినిమాలో పద్ధతిగల సంప్రదాయ పాత్రలో కనిపించి ఆకట్టుకున్న పూజా హెగ్డే, ఆ సినిమాతో ఇక్కడ మంచి మార్కులు కొట్టేసి, ఛాన్స్‌లు పట్టేసింది. ఆ తరువాత ‘ఒక లైలాకోసం’, మొహంజదారో సినిమాల్లో నటించిన పూజ, ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన డి.జె ‘దువ్వాడ జగన్నాధం’ చిత్రంలో నటిస్తోంది. ఈ అమ్మడు సంప్రదాయబద్ధంగా కనిపిస్తుందేమో అని అనుకున్నారు అందరూ.

11/10/2016 - 07:27

సందీప్ కిషన్, మెహరీన్ కౌర్ పీర్జాదా జంటగా సుశీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ చిత్రం హైదరాబాద్ ఫిలింనగర్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఎ.ఎం.రత్నం క్లాప్‌నిచ్చారు.

11/10/2016 - 07:26

ప్రేమన్నది యూనివర్సల్. కానీ ప్రేమలో వున్న ప్రతి మనిషి తనదైన శైలిలో నిర్వచనం చెబుతుంటారు. అంటే ప్రేమ అన్నది వ్యక్తిగతం కూడా. చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోకుండా నేటి యువత కోసం, ఈర్ష్య, ద్వేషం పెంచుకుపోతున్నారు. దీనివల్ల మనుషులు, మనసులు విడిపోతున్నాయి. అలాంటి అయోమయంలో ఇరుక్కున్న ఓ యువకుడు ప్రేమకు సరైన నిర్వచనం తెలుసుకుని తన వల్ల జరిగిన పొరపాటుని ఎలా సరిదిద్దుకున్నాడు?

11/10/2016 - 07:26

‘సరైనోడు’ ఘనవిజయంతో తెలుగు పరిశ్రమలోని స్టార్ డైరెక్టర్‌లలో ఒకడిగా మారిపోయారు బోయపాటి శ్రీను. హైఓల్టేజ్ యాక్షన్ సబ్జెక్ట్‌తో సినిమాలు చేస్తూ తనతో పనిచేసే హీరోలను మాస్ హీరోలుగా నిలబెట్టే బోయపాటి, తన తరువాతి సినిమాను హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో చేస్తున్నారు. ‘అల్లుడు శీను’ చిత్రంతో కెరీర్ మొదలుపెట్టిన శ్రీనివాస్, ఇప్పటివరకూ సరైన కమర్షియల్ హిట్ అందుకోలేదు.

Pages