S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/22/2017 - 20:55

‘బాహుబలి’తో అంతర్జాతీయంగా స్టార్ ఇమేజ్‌ని తెచ్చుకున్న ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సాహో’. అత్యంత భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేసింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోను నేడు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేస్తున్నారు.

10/22/2017 - 20:53

సంబీత్, నేహా రత్నాకరన్ జంటగా శ్రీవత్స దర్శకత్వంలో జై శ్రీ సంతోషిమాత ప్రొడక్షన్స్ పతాకంపై శంఖు, కిరణ్ నిర్మిస్తున్న చిత్రం ‘లాలిజో లాలిజో’. ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. పాటల రచయిత కాసర్ల శ్యాం లోగోను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టైటిల్ ఆకట్టుకునేలా ఉంది, మంచి ప్రేమ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు అన్నారు.

10/22/2017 - 20:52

తెలుగులో హీరోయిన్‌గా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది లావణ్య త్రిపాఠి. ‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే అందరి మనసులు దోచేసింది. ఆ తరువాత వరస అవకాశాలతో దూసుకుపోతూ నటిగా, గ్లామర్ హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా ఈమె రామ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.

10/22/2017 - 20:49

ప్రఖ్యాత బాలీవుడ్ కథానాయిక రాణీ ముఖర్జీ తండ్రి రామ్ ముఖర్జీ (84) కన్నుమూశారు. గత ఆరేడేళ్లుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో రామ్ తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా రాణీ ముఖర్జీ తండ్రి కోసం చిత్రాల షూటింగ్‌లకు దూరంగా వుంటున్నారు. తండ్రి కోసమే 2012లో నిర్మాత ఆదిత్య చోప్రాను వివాహం చేసుకున్నారు.

10/22/2017 - 20:48

ఇప్పటికే బాలీవుడ్‌తోపాటు హాలీవుడ్‌లో సత్తా చాటుకుంటున్న అందాల భామ ప్రియాంక చోప్రా క్రేజ్ ఓ రేంజ్‌లో ఉంది. ఇప్పటికే ఆమెతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. తాజాగా ఓ విషయంపై స్పందించిన ప్రియాంక ఘాటు వ్యాఖ్యలు చేసింది. తాజాగా హాలీవుడ్ నిర్మాత హార్వే వైన్‌స్టింగ్ లైంగిక వేధింపుల సంఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే.

10/21/2017 - 19:30

ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతోంది అందాల భామ మెహరీన్ ఫీర్జాదా. తాజాగా రవితేజతో చేసిన ‘రాజా ది గ్రేట్’ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈమె ఇప్పుడు టాలీవుడ్‌లో లక్కీ హీరోయిన్‌గా మారింది. వరుసగా మహానుభావుడు, రాజా ది గ్రేట్ సినిమాల విజయంతో జోరుమీదున్న మెహరీన్ అటు నటిగా, ఇటు గ్లామర్ పరంగా కూడా తనదైన ప్రత్యేకత చాటుకుంటోంది. తాజాగా ఈమెకు మరో క్రేజీ అవకాశం దక్కింది.

10/21/2017 - 19:29

రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘రంగస్థలం’ 1985 చిత్రం హైదరాబాద్‌లో వేసిన విలేజ్ సెట్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. క్రేజీ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 1985 నేపథ్యంలో రంగస్థలం అనే ఊరిలో జరిగిన కథగా ఉంటోందట. ఇప్పటికే భారీ అంచనాల్ని రేకెత్తించిన ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫొటో ల్ని చరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

10/21/2017 - 19:27

అల్లరి నరేష్‌కి ఈమధ్య వరుస పరాజయాలు టెన్షన్ పెడుతున్నాయి. కామెడీ హీరోగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న నరేష్‌కు ఈమధ్య వరుస పరాజయాలు పలుకరిస్తుండడంతో సక్సెస్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘మేడమీద అబ్బాయి’ నిరాశపర్చడంతో ఈసారి సరైన హిట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఆయన తదుపరి చిత్రాన్ని ఇ.సత్తిబాబు దర్శకత్వంలో తెరకెక్కించేందుకు సన్నాహాలు సిద్ధమయ్యాయి.

10/21/2017 - 19:26

తమిళ హీరో కార్తి, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘చతురంగవెట్టై’ చిత్రాన్ని తెలుగులో ‘ఖాకీ’ పేరుతో విడుదల చేస్తున్నారు. నిర్మాతలు ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా. ‘ద పవర్ ఆఫ్ పోలీస్’ అనే ఉపశీర్షికతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జీబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా విడుదలైన ట్రైలర్స్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.

10/21/2017 - 19:25

నాగఅనే్వష్, హెబ్బాపటేల్ జంటగా శ్రీ సరస్వతి ఫిలింస్ పతాకంపై బాహుబలి పళని దర్శకత్వంలో సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కిన చిత్రం ‘ఏంజెల్’.

Pages