S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/17/2017 - 20:05

బాలకృష్ణ హీరోగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మాతగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి సంబంధించి క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తయింది. అరివుమణి, అంబుమణిల సారథ్యంలో ఓ భారీ ఫైట్ సీక్వెన్స్‌లు బాలయ్యపై చిత్రీకరించారు.

10/17/2017 - 20:03

‘పటాస్’ సినిమాతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి తొలి సినిమాతోనే మంచి కమర్షియల్ విజయాన్ని అందుకున్నాడు అనీల్ రావిపూడి. ఆ తరువాత తెరకెక్కించిన ‘సుప్రీం’ కూడా ఆయనకు మరింత ఉత్సాహాన్ని అందించింది. తాజాగా రవితేజతో ప్రయోగం చేస్తున్నాడు. అదే ‘రాజా ది గ్రేట్’ చిత్రం. దిల్‌రాజు సమర్పణలో మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం నేడు విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడితో ఇంటర్వ్యూ..

10/17/2017 - 20:01

మహేందర్, ఇషితా, ప్రశాంత్, లలిత ప్రధాన పాత్రల్లో లక్ష్మీ ప్రొడక్షన్‌లో శివసాయి సమర్పణలో నిర్మాత ప్రశ్నాద్ తాతా నిర్మిస్తున్న చిత్రం ‘ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబు’. ఈ చిత్రానికి వెంకటేష్ కె. దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉండటంతో సారథి స్టూడియోలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

10/17/2017 - 20:00

బ్రహ్మాజీ.. నటుడిగా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా పలు భిన్నమైన పాత్రల్లో నటిస్తూ తనదైన సత్తా చాటుకుంటున్నాడు. బ్రహ్మాజీ ఏ పాత్రలో అయినా నటించగలడనే న మ్మకాన్ని దర్శక నిర్మాతలకు కలిగించాడు. అందుకే ఆయన ఒక్కో ఒక్కో తరహా పాత్రలో మెప్పిస్తూ వుంటాడు. తాజాగా ఆయన హర్రర్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘నెక్స్ట్ నువ్వే’ చిత్రంలో కీలకపాత్ర పోషించాడు.

10/17/2017 - 19:58

గ్లామర్ హీరోయిన్‌గా తెలుగులో పలు చిత్రాల్లో నటిస్తున్న రెజీనా తాజాగా బాలకృష్ణ సరసన ఆయన 102వ చిత్రంలో నటిస్తుందంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై స్పందించిన రెజీనా, తాను బాలకృష్ణ సినిమాలో నటించడంలేదని క్లారిటీ ఇచ్చింది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన నయనతార, నటాషా దోషి, హరిప్రియలను ఎంపిక చేశారు.

10/17/2017 - 19:56

ప్రముఖ హాస్య నటుడు గౌతంరాజు తనయు డు కృష్ణ హీరోగా బిజెఆర్ సమర్పణలో బిజిఆర్ ఫిలిం అండ్ టీవీ స్టూడియోస్ నిర్మిస్తోన్న చిత్రం ‘కృష్ణారావ్ సూపర్ మార్కెట్’. శ్రీనాథ్ పులకురం దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఎల్సా ఘోష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ప్రా రంభోత్సం అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగింది.

10/15/2017 - 21:07

అర్జున్‌రెడ్డి...టాలీవుడ్‌లో సంచలనం రేపిన చిత్రం. ఈ మధ్యకాలంలో ఈ రేంజ్‌లో సంచలన విజయం సాధించిన సినిమా మరొకటి లేదు. విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో టాలీవుడ్‌లో క్రేజీ దర్శకుడిగా మారాడు సందీప్. ఆయనకు ఇప్పుడు భారీ అవకాశాలు వస్తున్నాయి. నిర్మాతలు క్యూ కడుతూ ఎంతంటే అంత అడ్వాన్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అయితే సందీప్ నెక్స్ట్ ఫోకస్ పవన్ కల్యాణ్‌పై పడింది.

10/15/2017 - 21:05

చిన్న సినిమాలకోసం ప్రత్యేకంగా ఐదో ఆటను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫిలిం చాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణాగౌడ్, నిర్మాత సాయి వెంకట్ తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలియజేసారు.

10/15/2017 - 21:03

రవితేజ, మెహరీన్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వరక్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న చిత్రం రాజా దిగ్రేట్. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాటల్ని విడుదల చేసారు.

10/15/2017 - 21:00

గోపీచంద్, రాశీఖన్న, అనుఇమాన్యుయెల్ హీరో హీరోయిన్లుగా ఎఎమ్ జ్యోతికృష్ణ దర్శకత్వంలో శ్రీ సాయిరాం క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్న చిత్రం ఆక్సిజన్.

Pages