S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/05/2017 - 20:02

‘్ఫదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న సాయి పల్లవి, ఓకె బంగారం ఫేమ్ దుల్కర్ సల్మాన్ జంటగా సమీర్ తాహిర్ దర్శకత్వంలో మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘కలి’ చిత్రాన్ని చిత్రాన్ని తెలుగులో ‘హేయ్ పిల్లగాడ’ పేరుతో అనువదిస్తున్నారు నిర్మాత డి.వి.కృష్ణస్వామి.

10/05/2017 - 20:01

నటుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘మనం సైతం..’ సంస్థ సహాయ కార్యక్రమాలు మరింత విస్తృతం కానున్నాయి. సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఇద్దరు ఆపన్నులకు సహాయాన్ని అందించింది.

10/05/2017 - 19:59

టీవీ నటిగా అటుపై వెండితెరపై పలు చిత్రాల్లో సపోర్టింగ్ పాత్రల్లో రాణించిన రాణీ చిత్రలేఖ అందరికీ సుపరిచితమే. ప్రస్తుతం యాంకర్‌గా కూడా రాణిస్తున్న ఈమె, తాజాగా రచయిత్రిగా మారింది. ‘వనె్నపూల విన్నపాలు’ పేరుతో కవితా సంపుటిని ప్రచురించింది. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. సీనియర్ రచయిత శివారెడ్డితోపాటు తనికెళ్ల భరణి, లగడపాటి శ్రీ్ధర్, చంద్రబోస్‌లు ఆవిష్కరించారు.

10/05/2017 - 19:58

తెలుగులో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమాతో హీరోగా పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆదిత్య ఓం, ఆ తరువాత పలు చిత్రాల్లో హీరోగా నటించారు. ఈమధ్యే నటించి దర్శకత్వం వహించిన ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’తో దర్శకుడిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. తాజాగా ఆయన విలన్ పాత్రలు చేయడానికి సిద్ధమయ్యాడు.

10/05/2017 - 19:57

బాలీవుడ్‌లో విద్యాబాలన్ అంటే ప్రత్యేక క్రేజ్. డర్టీ పిక్చర్ సినిమాకు ముందు విద్యాబాలన్ వేరు, ఆ చిత్రం తరువాత విద్యాబాలన్ వేరు. డర్టీపిక్చర్‌తో ఒక్కసారిగా సంచలన నటిగా మారిన ఆమె, ఆ తరువాత పలు సంచలనాత్మక చిత్రాల్లో నటించి క్రేజ్ తెచ్చుకుంది. ఈమధ్యే బేగం జనా పేరుతో తెరకెక్కిన చిత్రంలో ఓ వ్యభిచార నిర్వాహకురాలిగా నటించి సంచలనం రేపింది. ఆ సంచలనం మరవకముం దే మరోసారి దుమ్మురేపడానికి సిద్ధమైంది.

10/05/2017 - 19:56

బాలీవుడ్‌లో బయోపిక్ చిత్రాల హవా ఇంకా తగ్గలేదు సరికదా పెరుగుతూనే వుంది. దాని కి కారణం అటు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని సాధించడంతోపాటు మంచి పేరు ప్రఖ్యాతులు రావడంతో దర్శక నిర్మాతలు ఈ తరహా సినిమాలపై దృష్టిపెట్టారు. ఇప్పటికే పలు బయోపిక్‌లు బాలీవుడ్‌లో సంచలన విజయాలను అందుకున్నాయి. తాజాగా మరో బయోపిక్ సిద్ధమవుతోంది.

10/04/2017 - 19:56

ప్రస్తుతం ‘జై లవకుశ’ చిత్రం విజయంతో జోరుమీదున్నాడు ఎన్టీఆర్. ఏకంగా మూడు పాత్రలు పోషించి ఔరా..! అనిపించాడు. ఎన్టీఆర్ కెరీర్‌లోనే భారీ వసూళ్లు రాబడుతున్న ఈ చిత్రం తరువాత ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తాడంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వీరిద్దరిమధ్య కథా చర్చలు కూడా జరిగాయని తెలిసింది. ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్‌కళ్యాణ్‌తో చేస్తున్న సినిమా కూడా దాదాపు పూర్తి కావచ్చింది.

10/04/2017 - 19:54

ప్రముఖ నటుడు, విద్యావేత్త అయిన డా.మోహన్‌బాబుకు ఎం.జి.ఆర్ యూనివర్శిటీ వారు గౌరవ డాక్టరేట్‌ను అందజేశారు. చెన్నైలో బుధవారం అత్యంత వైభవంగా జరిగిన విశ్వవిద్యాలయం 26వ స్నాతకోత్సవంలో మహారాష్ట్ర గవర్నర్ సి.హెచ్ విద్యాసాగర్‌రావు చేతుల మీదుగా మోహన్‌బాబు ఈ డాక్టరేట్‌ను అందుకున్నారు.

10/04/2017 - 19:53

భరత్ మార్గాని, సృష్ఠి జంటగా సత్య చల్లకోటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓయ్ నినే్న’. ఈ చిత్రంతో తెలుగు తెరకు హీరోగా పరిచయం అవుతున్నాడు భరత్ మార్గాని. ఈ చిత్రం రేపు విడుదలవుతున్న సందర్భంగా భరత్ చెప్పిన విశేషాలు.. మా స్వస్థలం రాజమండ్రి. కానీ నా స్కూల్ విద్య అంతా ఊటీలో సాగింది. తరువాత హైదరాబాద్, యుఎస్‌ఎలో స్టడీ పూర్తిచేశా. మాకు కన్‌స్ట్రక్షన్ బిజినెస్‌తోపాటు చేపల చెరువులున్నాయి.

10/04/2017 - 19:51

విలక్షణ నటుడు నారా రోహిత్ హీరోగా శరశ్చంద్రిక విజనరీ మోషన్ పిక్చర్స్, మాయాబజార్ మూవీస్ పతాకాలపై దర్శకుడు పవన్ మల్లెల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘బాలకృష్ణుడు’. బి.మహేందర్‌బాబు, ముసునూరు వంశీ, శ్రీవినోద్ నందమూరి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ట్రైలర్, పాటలను ఈనెలలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర నిర్మాతలు.

Pages