S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/28/2017 - 19:49

వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని, తాజాగా ‘నిన్నుకోరి’ చిత్రంతో మరో ఘనవిజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఎంసిఎ’ (మిడిల్ క్లాస్ అబ్బా యి) చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత మేర్లపాక గాంధి దర్శకత్వంలో ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది. తాజాగా నానితో ఓ చిత్రాన్ని చేయడానికి దర్శకుడు విక్రం కుమార్ ఆసక్తి చూపిస్తున్నాడు.

09/28/2017 - 19:46

బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ చిత్రం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త ఫీల్‌ను కలిగిస్తుందని, ముఖ్యంగా హాలీవుడ్ స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కిస్తున్నారు.

09/28/2017 - 19:44

సాయిధరమ్‌తేజ్ కథానాయకుడిగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి. పతాకంపై వి.వి.వినాయక్ దర్శకత్వంలో సి.కల్యాణ్ రూపొందిస్తున్న భారీ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ 22నుండి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభించి కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నామని, అలాగే యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా షూటింగ్ చేశామని తెలిపారు.

09/28/2017 - 19:43

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ ఇటీవలే బాలకృష్ణతో చేసిన ‘పైసా వసూల్’ చిత్రం అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. దాంతో వరుస పరాజయాలతో సతమతమవుతున్న పూరి, ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. తాజాగా ఆయన తనయుడు ఆకాష్ హీరోగా ఓ సినిమాని మొదలుపెట్టనున్నాడు. 1971 ఇండో పాక్ యుద్ధం నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఇది వుం టుందట. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను గురువారం విడుదల చేశారు.

09/28/2017 - 19:41

మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘స్పైడర్’లో కథనం అద్భుతంగా తీర్చిదిద్దారు. మహేష్‌బాబు వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు అని తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ అన్నారు. ఎన్.వి.ఆర్ సినిమా, ఎల్‌ఎల్‌పి రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మురుగదాస్ దర్శకత్వంలో మహేష్‌బాబు కథానాయకుడిగా రూపొందించిన ‘స్పైడర్’ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాష ల్లో విడుదలైన సంగతి తెలిసిందే.

09/28/2017 - 19:39

భరత్ మార్గాని, సృష్టి జంటగా సత్యా చల్లకోటి దర్శకత్వంలో ఎస్.వి .కె. సినిమా పతాకంపై వంశీకృష్ణ శ్రీనివాస్ రూపొందించిన చిత్రం ‘ఓయ్.. నినే్న’. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసి అక్టోబర్ 6న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- మన సంతోషానికి దగ్గరగా ఉన్నపుడే మనం సుఖంగా ఉంటామని నమ్మే ఓ కుర్రాడు, కాలేజీలో ఓ అమ్మాయి ప్రేమలో పడితే..

09/28/2017 - 19:37

కార్తీక్‌రాజు, మిస్తీ చక్రవర్తి జంటగా, వింగ్స్ మూవీస్ మేకర్స్ పతాకంపై ఎం.పూర్ణానంద్ దర్శకత్వంలో జి.ప్రతిమ రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన షూటింగ్ తొలి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఈ చిత్రానికి ఇంకా పేరు ఖరారు చేయలేదు.

09/28/2017 - 19:37

శర్వానంద్, మెహరీన్ జంటగా మారుతి దర్శకత్వంలో యు.వి క్రియేషన్స్ నిర్మిస్తున్న ‘మహానుభావుడు’ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. హీరో పాత్రలను భిన్నంగా మలచడంలో మారుతి శైలే వేరు. మతిమరుపు కథతో ‘్భలే భలే మగాడివోయ్’ సినిమా చేసి విజయాన్ని అందుకున్న మారుతి, ‘మహానుభావుడు’ చిత్రంలో మరో కొత్త అలవాటును చూపిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సందర్భంగా మారుతితో ఇంటర్వ్యూ...

09/28/2017 - 19:34

ప్రస్తుతం బాలీవుడ్‌లో జోరుమీద వున్న హీరోయిన్ ఎవరంటే, అందరూ చెప్పే సమాధానం ఒక్కటే.. అదే ప్రియాంకా చోప్రా. హిందీలో స్టార్ హీరోయిన్‌గా ఇమేజ్ తెచ్చుకున్న ప్రియాంక, ప్రస్తుతం హాలీవుడ్‌లో కూడా తన సత్తా చాటి అక్కడ కూడా క్రేజీ హీరోయిన్‌గా మారింది. ఇప్పటికే మూడు హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్న ఈమెకు ఇటు బాలీవుడ్‌లో కూడా చాలా అవకాశాలు వస్తున్నాయి.

09/27/2017 - 16:10

నాని సరసన మజ్ను సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మలయాళీ ముద్దుగుమ్మ అను ఇమ్మాన్యుయేల్ మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మదిని దోచింది. అందానికి అందం, మంచి టాలెంట్ వున్న ఈ భామ రెండో సినిమాకే పవర్‌స్టార్ సరసన అవకాశాన్ని పట్టేసింది. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో ‘నా పేరు సూర్య’ చిత్రంలో నటిస్తున్న అను, తాజాగా ఎన్టీఆర్ తదుపరి చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైందట.

Pages