S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/26/2017 - 23:43

బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 102వ చిత్రాన్ని సి.కె ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా కుంభకోణంలో ఓ భారీ షెడ్యూల్ జరుపుకుంటోంది. సోమవారంతో ఈ షెడ్యూల్ పూర్తయింది. చివరి రోజున ఈ చిత్రానికి సంబంధించి భారీ పోరాట ఘట్టాన్ని తెరకెక్కించారు.

09/26/2017 - 23:41

సందీప్‌కిషన్, మెహరీన్ జంటగా లక్ష్మీనరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుశీంద్రన్ దర్శకత్వంలో చక్రి చిగురుపాటి రూపొందిస్తున్న చిత్రం ‘కేరాఫ్ సూర్య’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను హీరో నాని విడుదల చేశారు. ఈ టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని నిర్మాత తెలియజేస్తున్నారు.

09/26/2017 - 23:40

కరుణామయుడిగా, వేమనగా, ఆంధ్రకేసరిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన నటుడు విజయ్‌చందర్. తాజాగా ఆయన శ్రీ షిరిడీ సాయినాథుని కథను ‘సాయి నీ లీలలు’ టైటిల్‌తో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. విజయ్‌చందర్ దర్శకత్వంలో సజ్జల శ్రీనివాస్ నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం రూపుదద్దుకుంటోంది. కాగా ఈ సినిమా పాటల రికార్డింగ్ పనులు అక్టోబర్ 1న మొదలు కానున్నాయి.

09/26/2017 - 23:39

సినీయోగ్ పతాకంపై నెల్సన్ వెంకటేష్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘పెళ్లిరోజు’. ఈ చిత్రానికి సంబంధించిన సినిమా లోగో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన నటి జమున లోగోను విడుదల చేశారు.

09/26/2017 - 23:37

సాధారణంగా సినిమాల్లో హీరోయిన్ లైఫ్‌టైమ్ చాలా తక్కువ. మహా అయితే పదేళ్లపాటు హీరోయిన్‌గా వెలగొచ్చు. ఆ తర్వాత పెళ్లి, కాపురం, పిల్లలు అంటూ వాళ్ల కెరీర్ మరోదారిలో పయనిస్తుంది. కొందరైతే మళ్లీ రీఎంట్రీతో అక్క, అత్త, వదినలాంటి పాత్రలతో అలరించడానికి వస్తుంటారు. ఈమధ్య కొందరు హీరోయిన్లు మాత్రం స్టార్ హీరోయిన్లుగా చెలామణి అవుతూనే అటు బిజినెస్ రంగంలో కూడా తమ సత్తా చాటుకుంటున్నారు.

09/26/2017 - 23:36

మురుగదాస్ సినిమాలంటే దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ వుంది. దర్శకుడిగా కమర్షియాలిటీని వాడుకుంటూనే సమాజానికి కావాల్సిన మెసేజ్‌ని అందిస్తూ సినిమాలు తీస్తాడు. అందుకే ఆయన సినిమాలకు అంత క్రేజ్. పోలీస్ వ్యవస్థలో ఉన్న అవినీతిని బయటపెట్టాలన్నా, సమాజంలోవున్న విద్రోహశక్తులను ఏరివేయాలన్నా, రైతుల సమస్యలను మన కళ్లకు కట్టినట్లు చూపించడంలో ఆయన శైలే వేరు.

09/24/2017 - 21:28

అందాల భామ నయనతారపై రోజురోజుకు రకరకాల వార్తలు షికారు చేస్తున్నాయి. ఇప్పటికే జోరు ప్రేమాయాణం సాగిస్తున్న ఈమె త్వరలోనే రహస్య వివాహం చేసుకుంటుందని కోలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది. దాంతోపాటు పెళ్లి గురించి రకరకాల పుకార్లు రావడంతో ఈ విషయంపై మండిపడుతోంది నయనతార. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈమె స్పందిస్తూ నాకు అవకాశాలు పెద్దగా రావడం లేదని ప్రచారం చేస్తున్నవారే అందాలు ఆరబోస్తూ రెచ్చిపోతోందని మరోవైపు అంటున్నారు.

09/24/2017 - 21:26

ప్రస్తుతం ఎవరూ ఊహించని సంఘటన జరగనుంది. ఇప్పటివరకు సినిమాల్లో హీరోయిన్లంటే ఇలా వుండాలి, అలా వుండాలి అని కొన్ని రకాల పరిధులు వుం డేవి. కానీ ఇప్పుడవి చెరిగిపోతున్నాయి. హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది ట్రాన్స్ జండర్ అయిన అంజలి అమీర్. మళయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి అమీర్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసారట. సినీ వర్గాల్లో ఇదో పెద్ద సంచలనం.

09/24/2017 - 21:24

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న స్పైడర్ 27న విడుదలకు సిద్ధమైంది. భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమా తరువాత మహేష్ కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే రెండు షెడ్యూళ్లు జరుపుకున్న సినిమా తరువాత మహేశ్ మరో క్రేజీ ప్రాజెక్టు చేయడానికి సిద్ధమయ్యాడు.

09/24/2017 - 21:22

బాహుబలి స్ఫూర్తితో తమిళ దర్శకుడు సుందర్ సి భారీ బడ్జెట్‌తో సంఘమిత్ర చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా పదిరోజుల తరువాత ఆగిపోయింది. ఇందులోనుంచి శృతి హాసన్ తప్పుకోవడంతో సినిమాకు అసలు కష్టాలు మొదలయ్యాయి. సంఘమిత్ర పాత్రలో ఎవరు నటిస్తారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికోసం పలువురు హీరోయిన్లను పరిశీలించారు.

Pages