S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/24/2017 - 21:20

భానుచందర్ ప్రధాన పాత్రలో మెట్రో క్రియేషన్స్ పతాకంపై జంగాల నాగబాబు దర్శకత్వంలో ధమిశెల్లి రవికుమార్, మహ్మద్ ఖలీల్ సంయుక్తంగా రూపొందిస్తున్న హారర్ కామెడీ చిత్రం ‘వస్తా’. ఈ చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్‌ను పూర్తిచేశారు.

09/24/2017 - 21:18

గోపీ వర్మ, మాళవిక మీనన్ జంటగా గాయత్రి రీల్స్ పతాకంపై కృష్ణమ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం అమ్మాయిలంతే అదో టైపు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసారు. శనివారం ఉదయం సినిమా యూనిట్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది.

09/24/2017 - 21:16

తెలుగు హీరోలు నటించిన చిత్రాలు తమిళ, హిందీ భాషల్లోకి డబ్బింగ్ రూపంలో వెళ్లి నిర్మాతకు భారీ వసూళ్లను అందిస్తున్నాయి. అలాగే తమిళ హీరోలు నటించిన సినిమాలను చిన్న నిర్మాతలు హక్కులు తీసుకుని తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేస్తే, అత్యధిక లాభాలను పొందుతున్నారు. హిందీ చిత్రాలు కూడా అప్పుడప్పుడు తెలుగులో డబ్బింగ్ రూపంలో పలకరిస్తూనే వున్నాయి.

09/24/2017 - 21:12

అందాల భామ ఇలియానా ప్రస్తుతం జోరు ప్రేమాయణంలో విహరిస్తోంది. తన బాయ్‌ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్‌తో డేటింగ్ చేస్తున్న ఈమె, అతనితో పీకల్లోతు ప్రేమలో పడిపోయానని చెబుతోంది. సమయం దొరికినపుడల్లా ఇద్దరూ కలిసి వీకెండ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఎదిగిన ఇలియాన బాలీవుడ్‌పై వున్న ఆశతో ఇక్కడికి వచ్చింది. కానీ ఈమెకు కెరీర్ పరంగా పెద్ద అవకాశాలు కానీ విజయాలు కానీ దక్కలేదు.

09/23/2017 - 19:36

రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న రంగస్థలం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్‌లో జరుపుతున్నారు. ఇప్పటికే ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను దసరా రోజున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. 1985 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా మరోవైపు ట్రేడ్ వర్గాల్లోనూ సంచలనం రేపుతోంది.

09/23/2017 - 19:34

అల్లు అర్జున్, అను ఇమాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై శిరీషా శ్రీ్ధర్ రూపొందిస్తున్న చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. ఈ చిత్రానికి సంబంధించిన హైదరాబాద్ షూటింగ్ పూర్తిచేసి ఊటీలో జరుపుతున్నారు.

09/23/2017 - 19:32

సూపర్‌స్టార్ ర జనీకాంత్ సంచలన దర్శకుడు శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ‘రోబో 2.0’. గతంలో వచ్చిన రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోం ది. జనవరి 25న విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా భారీ స్థాయిలో సిద్ధం చేస్తున్నారు.

09/23/2017 - 19:30

సదా, కవితా అగర్వాల్, బాబు, ప్రియాంక శర్మ ప్రధాన తారాగణంగా ఆది అక్షర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సదా దర్శకత్వంలో బాబురావు పెదపూడి రూపొందించిన చిత్రం ‘దళపతి’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఇటీవల విడుదలై మంచి స్పందన పొందుతోందని దర్శక నిర్మాతలు తెలియజేశారు.

09/23/2017 - 19:28

‘జై లవకుశ’ సినిమాకొస్తున్న రెస్పాన్స్ చూసి చాలా షాక్ అయ్యాను అని అంటున్నాడు దర్శకుడు బాబి. పవర్, సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాల తరువాత బాబి దర్శకత్వం వహించిన చిత్రం ‘జైలవకుశ’. ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై ఘనవిజయం వైపు పయనిస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు బాబితో ఇంటర్వ్యూ..
* సక్సెస్‌ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు?

09/23/2017 - 19:26

తెలుగు హీరోయిన్ అంజలి చెల్లెలు ఆరాధ్య పరిశ్రమలోకి అడుగుపెడుతోంది. ఇప్పటికే ఈ ప్రయత్నాల్లో వున్న ఈమె, వెండితెరపై హీరోయిన్‌గా సత్తా చాటుకోవాలని ఉందని చెబుతోంది ఆరాధ్య. శనివారం ఆమె హైదరాబాద్‌లో పాత్రికేయులతో మాట్లాడుతూ- చిన్నప్పటినుంచి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. చాలామంది నన్ను సినిమాల్లోకి వెళ్లచ్చు గదా అని ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే అక్క అంజలి హీరోయిన్‌గా రాణించింది.

Pages