S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/10/2017 - 00:33

ఎస్తేర్, నోరోన్హా, నోయల్ సేన్, శ్రీమంగం, అర్జున్ ఆనంద్ ప్రధాన తారాగణంగా లావోస్ మోషన్ పిక్చర్స్ పతాకంపై ఓ చిత్రం రూపొందింది. ఇంకా పేరు పెట్టని చిత్రానికి క్రాంతికుమార్ వడ్లమూడి దర్శకత్వం వహించారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు.

09/10/2017 - 00:32

తెలుగునాట మాత్రమేకాక ఇతర పరిశ్రమల ప్రేక్షకుల్నీ విశేషంగా ఆకట్టుకుంటున్న సినిమా అర్జున్‌రెడ్డి. నూతన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ఈ చిత్రం మొదటి రోజు మొదటి షోనుండే సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుని వసూళ్లపరంగా ప్రభంజనం సృష్టిస్తోంది. దీంతో ఇతర పరిశ్రమల నిర్మాతలు అర్జున్‌రెడ్డి రీమేక్ హక్కుల కోసం పోటీపడుతున్నారు.

09/10/2017 - 00:32

బాహుబలి ఘన విజయం తరువాత జాతీయస్థాయి క్రేజ్‌తో ప్రభాస్ క్రేజీ ప్రాజెక్టు సాహో చేస్తున్నాడు. 150 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సాహో ప్రాజెక్టు -అభిమానుల అంచనాలకు మించి ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ ప్రభాస్ సరసన నటిస్తోంది. ఇప్పటికే చిత్రం సెట్స్‌లో ఆమె జాయినైంది. కాగా ఈ చిత్రంలో శ్రద్ధ పాత్ర గురించి ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి.

09/10/2017 - 00:32

విజయ్‌చందర్, సుమన్ ప్రధాన తారాగణంగా జి.ఎల్.బి మూవీ మేకర్స్, శ్రీ మల్లాది వెంకటేశ్వర ఫిలింస్ పతాకాలపై స్వీయ దర్శకత్వంలో శ్రీనివాస్ రూపొందించిన చిత్రం 3సాయే దైవం2. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేశారు. క్లీన్ యు సర్ట్ఫికెట్ లభించింది.

09/10/2017 - 00:31

సచిన్, ఇషాగుప్తా హీరో హీరోయిన్లుగా వైకింగ్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తాతినేని సత్య దర్శకత్వంలో రైనా జోషి నిర్మించిన చిత్రం ‘వీడెవడు’. సెప్టెంబర్ 15న సినిమా విడుదల చేస్తున్నారు. థియేట్రికల్ ట్రైలర్‌ను శనివారం ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు తాతినేని సత్య మాట్లాడుతూ ఎస్‌ఎంఎస్, భీమిలి కబడ్డీ జట్టు, శంకర సినిమాల తర్వాత చేసిన మూవీ ఇది.

09/08/2017 - 21:39

జై లవకుశ చిత్రంతో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం తరువాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రం పూర్తికాగానే ఎన్టీఆర్ మరో క్రేజీ ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

09/08/2017 - 21:37

వైవిధ్యమైన కన్నడ చిత్రాలను ప్రదర్శించే కార్యక్రమం హైదరాబాద్ ఫిలిం క్లబ్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. కర్ణాటక చలనచిత్ర అకాడమీ, హైదరాబాద్ ఫిలిం క్లబ్, శ్రీసారథి స్టూడియోస్ ఆధ్వర్యంలో కన్నడ ఫిలిం ఫెస్టివల్ హైదరాబాద్‌లో సారథి స్టూడియోలో శుక్రవారం సాయంత్రం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కల్చరల్, టూరిజం, ఎండోమెంట్, అడ్వైజర్ కె.వి.రమణాచారి పాల్గొని ప్రారంభించారు.

09/08/2017 - 21:36

ఆర్య, ఆరతి జంటగా రూపొందించిన చిత్రం ‘అంతా మనమంచికే’. ఎలైట్ పిక్చర్స్, స్ప్రింగ్ ఫిలింస్ పతాకాలపై ఎం.కె.షరీఫ్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఆడియో సీడీని రాజ్‌కందుకూరి విడుదల చేసి తొలి కాపీని తుమ్మలపల్లి రామసత్యనారాయణకు అందించారు. ట్రైలర్‌ను దర్శకుడు వి.ఎన్.ఆదిత్య ఆవిష్కరించారు.

09/08/2017 - 21:34

రాహుల్ రవీంద్రన్, పావని గంగిరెడ్డి జంటగా రూపొందిన చిత్రం ‘దృష్టి’. ఎం స్క్వేర్ పతాకంపై రామ్ అబ్బరాజు దర్శకత్వంలో మోహన్ రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను కథానాయిక సమంత విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ- ఈ సినిమాకు సంబంధించిన అంచనాలు అభిమానుల్లో భారీగా వున్నాయని, రాహుల్ ఓ వైవిధ్యమైన పాత్రలో నటించారని చెప్పారు.

09/08/2017 - 21:33

బాహుబలి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎస్.ఎస్.రాజవౌళికి ఏటా అందజేసే ఏన్నాఆర్. జాతీయ అవార్డును ప్రదానం చేయనున్నట్లుగా నాగార్జున ప్రకటించారు. సినీరంగానికి ఆయన చేసిన వైవిధ్యమైన సేవలకుగాను ఈ అవార్డును జక్కన్నకు ప్రదానం చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు.

Pages