S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/07/2017 - 22:37

చంద్రకాంత్, రాధిక మెహరోత్రా, పల్లవిడోరా ప్రధాన తారాగణంగా థర్డ్ ఐ క్రియేషన్స్ పతాకంపై రఘురామ్ రొయ్యూరు దర్శకత్వంలో గోవర్థన్ రూపొందించిన చిత్రం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం (పెంపక్). ఈచిత్రానికి సంబంధించిన ఆడియోను జితిన్ రోషన్ అందించారు. ఒక్కొక్కరు ఒక్కో పాటను విడుదల చేయగా సి.కల్యాణ్, జెమిని కిరణ్ ఆడి యో సీడీని విడుదల చేశారు.

09/07/2017 - 22:35

ముద్దుగుమ్మ రాశిఖన్నాకు ఈమధ్య సరైన సినిమాలు పడటంలేదు. ఆమధ్య రవితేజతో చేసిన ‘బెంగాల్ టైగర్’ తరువాత ఎక్కడా కనిపించలేదు. అటు తమిళంలో ఒకటి రెండు సినిమాలకు కమిటైన ఈ భామకు అవకాశాలు పెద్దగా రాకపోవడానికి కారణం కెరీర్ పరంగా సరైన సక్సెస్‌లు లేకపోవడం. దాంతోపాటు.. కాస్త బొద్దుగా ఉండటం కూడా ఓ కారణమైంది. అందుకే కాస్త వొళ్లు తగ్గించి మరింత గ్లామర్‌గా మారిన రాశికి ఇప్పుడు బంపర్ ఆఫర్ దక్కింది.

09/07/2017 - 22:34

తెలుగు ప్రేక్షకులకు కామెడీ సినిమాలంటే తెగ ఆసక్తి. అందుకే ప్రతి సినిమాలో కామెడీ కోసం ఎదురుచూస్తుంటాం. అందుకే మన దగ్గర కామెడీ కోసం ప్రత్యేకంగా హీరోలు ఉన్నారు. రాజేంద్రప్రసాద్ తరువాత ఆ స్థాయిలో కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లరి నరేష్. అల్లరితో కెరీర్ మొదలుపెట్టిన నరేష్, 53 సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘మేడమీద అబ్బాయి’.

09/07/2017 - 00:36

ప్రపంచవ్యాప్తంగా జరిగిన అహింసాయుత పోరాటాల్లో తెలంగాణ ఉద్యమం అగ్రభాగాన ఉంటుం ది. అరవై ఏళ్ళ ఒక జాతి కలను తన పధ్నాలుగేళ్ల పోరాటం ద్వారా కెసిఆర్ విజయతీరాలకు చేర్చారు. ఆయన స్ఫూర్తిదాయ క జీవిత ప్రస్థానానికి వెండి తెర దృశ్యరూపమే ‘గులా ల్’ చిత్రం అన్నాడు బం దూక్ లక్ష్మణ్. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం గులాల్. ది సింబల్ ఆఫ్ విక్టరీ ఉపశీర్షిక.

09/07/2017 - 00:35

కుమారి హెబ్బాపటేల్ కెరీర్ ఒక్కసారిగా స్లో అయింది. టాలీవుడ్‌కు మెరుపువేగంతో దూసుకొచ్చిన ఈ అమ్మడి స్పీడ్ ఒక్కసారిగా తగ్గింది. అలా ఎలా? కుమారి 21 ఎఫ్, నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్, అంధగాడు- ఈ నాలుగూ మంచి సినిమాలే. కానీ ఇప్పటివరకూ టాలీవుడ్‌లో మాత్రం స్టార్ హీరో సరసన హెబ్బాకు చాన్స్ దక్కలేదు. మిస్టర్‌లో సెకెండ్ లీడ్ పోషించినా, ఆ సినిమా ఫెయిల్యూర్ కావడం ఆమె కెరీర్ కూడా పూర్తిగా మడతపడిపోయింది.

09/07/2017 - 00:35

రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం 3రాజా ది గ్రేట్2. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి అక్టోబర్ రెండో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చిత్రంతో రవితేజ తనయుడు మహాధన్ తెరంగేట్రం చేస్తుండటం మరో విశేషం.

09/07/2017 - 00:35

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ అరంగేట్రం ఖరారైంది. ఆయన పుట్టినరోజు వేడుకలను అనంతపురం జిల్లా హిందూపురంలో అభిమానుల మధ్య జరుపుకున్నారు. తనను ఆదరించినట్టే కుమారుడినీ ఆదరించాలని, అభిమానుల రక్షే తమకు శ్రీరామరక్ష అని బాలకృష్ణ తెలిపారు. వచ్చే ఏడాది జూన్ మొదటివారం నుంచే మోక్షజ్ఞ తొలి సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని బాలకృష్ణ ప్రకటించారు. సో.. మోక్షజ్ఞ ఎంట్రీ ఖరారైనట్టే.

09/07/2017 - 00:34

పి.డి. రాజు ఏసుక్రీస్తుగా నటించిన చిత్రం 3తొలికిరణం2. జాన్ బాబు దర్శకత్వంలో సువర్ణా క్రియేషన్స్ పతాకంపై టి సుధాకర్ నిర్మించారు. చిత్రానికి సంబంధించిన సెన్సార్ పూరె్తైంది. ఆర్‌పి పట్నాయక్ అందించిన ఆడియో ఇటీవల విడుదలై మంచి స్పందన పొందింది. సినిమాను డిసెంబర్ 8న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు జాన్‌బాబు పుట్టినరోజు సందర్భంగా చిత్ర విశేషాలు తెలిపారు.

09/07/2017 - 00:34

చిరంజీవి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని చేస్తున్న 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. 1840ల కాలంలో జీవించిన స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందనున్న సినిమా కోసం భారీ బడ్జెట్‌ను కేటాయించారు నిర్మాత రామ్‌చరణ్. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తవ్వగా సెట్టింగ్స్ తీర్చిదిద్దే పనిలో ఉన్నారు ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్.

09/07/2017 - 00:33

స్పై డర్ చిత్రీకరణను ముగించేసి కొరటాల ప్రాజెక్టుతో బిజీ అయిపోయాడు హీరో మహేష్. గ్యాప్ అన్నదే లేకుండా గత నెలలో 25వ సినిమా ప్రారంభించిన సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలోవున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇలియానాను తీసకోడానికి దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదించారని వార్తలొచ్చాయి.

Pages