S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/30/2016 - 23:20

జి.వి.ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటిస్తూ, సంగీతం అందిస్తున్న చిత్రం ‘నాకు ఇంకో పేరుంది’. శ్యామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ దీన్ని నిర్మిస్తోంది. ‘త్రిష లేదా నయనతార’ చిత్రంలో జి.వి. ప్రకాష్ సరసన నటించిన ఆనంది ఇందులో కథానాయిక. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా జివి ప్రకాష్ మాట్లాడుతూ, ‘యాక్ష న్, కామె డీ ఎంటర్‌టైనర్ ఇది.

07/30/2016 - 23:17

పూజా గాంధీ, రఘు ముఖర్జీ ప్రధాన తారాగణంగా వెంకట్ మూవీస్ బ్యానర్‌పై శ్రీనివాసరాజు దర్శకత్వంలో గతంలో వచ్చిన ‘దండుపాళ్యం’ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి సీక్వెల్‌గా అదే టీమ్‌తో రూపొందుతున్న ‘దండుపాళ్యం 2’ చిత్రం 70 శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది.

07/29/2016 - 21:23

మహేష్‌బాబు, దర్శకుడు మురుగదాస్‌ల కాంబినేషన్‌లో రూపొందే సినిమాకు సంబంధించి షూటింగ్ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘బ్రహ్మోత్సవం’ ఘోర పరాజయం తర్వాత మహేష్ నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై ఆయన అభిమానులు అంచనాలు పెంచుకుంటున్నారు.

07/29/2016 - 21:22

శైలేష్ బొలిశెట్టి, దీక్షాపంత్, అంగనారాయ్ ప్రధాన తారాగణంగా ఎం.ఆర్.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మోహనప్రసాద్ దర్శకత్వంలో ఎం.రాఘవయ్య రూపొందించిన చిత్రం ‘చల్ చల్ గుఱ్ఱం’. ఈ చిత్రానికి సంబంధించిన అన్నా కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దర్శక,నిర్మాతలు మాట్లాడుతూ, కథపై వున్న నమ్మకంతో తాము ఈ చిత్రాన్ని రూపొందించామని, ఎమోషనల్ కామెడీ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించామన్నారు.

07/29/2016 - 21:20

సునీల్ కథానాయకుడిగా రూపొందించిన ఏ చిత్రానికీ రానంత భారీ వసూళ్లు తొలిరోజే జక్కన్న చిత్రం సాధించిందని నిర్మాత సుదర్శన్‌రెడ్డి తెలియజేస్తున్నారు. ఆర్‌పిఎ క్రియేషన్స్ పతాకంపై సునీల్, మన్నార్ చోప్రా జంటగా వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో జక్కన్న విడుదలైన సంగతి తెలిసిందే. జక్కన్న చిత్రాన్ని అత్యధిక థియేటర్లలో విడుదల చేశామని, సునీల్ కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచిందన్నారు.

07/29/2016 - 21:18

చిత్రంశ్రీను, శ్రీవల్లి ప్రధాన పాత్రధారులుగా ఖమ్మం క్రియేషన్స్ పతాకంపై నెప్పలి కృష్ణ దర్శకత్వంలో సరోజిని, దేవ, కోటయ్య, రమణారెడ్డి సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘మయసభ’. ఈ చిత్రానికి సంబంధించిన కార్యక్రమాలు పూర్తికావస్తున్నాయి.

07/29/2016 - 21:17

ఎ.రవితేజ, అశ్వినీ చంద్రశేఖర్, భానుశ్రీ ప్రధాన తారాగణంగా ఎస్.జె.చైతన్య దర్శకత్వంలో రవి పచ్చిపాల రూపొందిస్తున్న చిత్రం ‘ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, తొలిసారిగా ప్రభాస్ అభిమానుల కోసం రూపొందిస్తున్న చిత్రం ఇదని, చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను విడుదల చేశామన్నారు.

07/29/2016 - 21:16

విడుదలకు ముందు భారీ హైప్ క్రియేట్ చేసిన సినిమా ‘కబాలి’ సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్‌లోనే భారీ వసూళ్లు అందుకున్న సినిమా. ఇక విడుదల తరువాత ఫలితం ఎలా ఉన్నాసినిమా మాత్రం బాక్స్ ఆఫీసువద్ద దుమ్ము లేపింది. ఆ సినిమాతో క్రేజీ దర్శకుడిగా మారిపోయాడు పా రంజిత్. ఈ సినిమా తరువాత ఆయనకు అవకాశాలు జోరుగా వస్తున్నాయి. సూర్య హీరోగా ఓ సినిమా చేయడానికి కమిట్ అయినట్టు తెలిసింది.

07/29/2016 - 21:13

ప్రశాంత్, ప్రియాంక హీరో, హీరోయిన్లుగా చేజర్ల ఇంద్రకుమార్ రాజు సమర్పణలో అపురూప్ మిరాకిల్ మీడియా ఆర్ట్స్ బ్యానర్‌పై శివ (అపురూప్) స్వీయ దర్శకత్వంలో 4న4 చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శివ మాట్లాడుతూ, నలుగురు స్నేహితుల జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనను ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాను. ఇది నా మొదటి సినిమా.

07/29/2016 - 21:12

ఇంటర్నేషనల్ క్లాసికల్ డ్యాన్సర్ హనీష్ హీరోగా, కన్నడ భామ చిరాశ్రీ హీరోయిన్‌గా శ్రీ కనకదుర్గా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై యంగ్ టాలెంటెడ్ దర్శకుడు కె.సూర్యనారాయణ దర్శకత్వంలో ఎం.మారుతిప్రసాద్, ఎన్.రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఆమె.. అతడైతే’. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను దర్శక నిర్మాతలు తెలియజేశారు.

Pages