S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/03/2017 - 00:00

బాలీవుడ్‌లో ఫైర్‌బ్రాండ్‌గా ఇమేజ్ తెచ్చుకున్న కంగనా రనౌత్ అంటే బి టౌన్ జనాలకి కంగారే. ఎప్పుడు ఏం మాట్లాడి సంచలనం రేపుతుందో అని టెన్షన్. ఈమధ్యే పలువురు స్టార్ హీరోలతో తనకు సంబంధాలున్నాయంటూ సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇప్పటికే హృతిక్ రోషన్‌తో ఘాటు ఎఫైర్ సాగించిన ఈమె, ప్రస్తుతం ఆయనతో గొడవలు పెట్టుకుంది.

09/02/2017 - 23:59

పవన్‌కళ్యాణ్ హీరోగా నటించిన కాటమరాయుడు చిత్రం ప్రస్తుతం బాలీవుడ్‌కు వెళ్లనుంది. సరికొత్త గెటప్‌లో పవన్ తన ఫ్యాన్స్‌ని ఖుషీ చేసిన ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు ప్రముఖ నటుడు అక్షయ్‌కుమార్. తమిళంలో వీరమ్ సినిమాకు రీమేక్‌గా ఇది తెరకెక్కింది. అయితే కొన్ని మార్పులు చేసి కాటమరాయుడుని తెరకెక్కించారు.

09/02/2017 - 23:58

గోపీచంద్, రాశీఖన్నా, అను ఇమాన్యుయేల్ హీరో హీరోయిన్లుగా ఎ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్న ఆక్సిజన్ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. త్వరలోనే పాటలు విడుదలకానున్న నేపథ్యంలో చిత్ర వివరాల గురించి నిర్మాత ఐశ్వర్య తెలియజేస్తూ- షూటింగ్ ముగించుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తికానున్నాయి.

09/02/2017 - 23:58

నందమూరి బాలకృష్ణ జోరు మామూలుగా లేదు. ఇప్పటికే ఆయన పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటించిన పైసా వసూల్ విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. మరోవైపు తన 102వ చిత్రంగా ప్రముఖ తమళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఆర్‌ఎఫ్‌సిలో ఓ షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది. దాంతోపాటు తన 103, 104 సినిమాలపై దృష్టిపెట్టాడు బాలయ్య. ఇప్పటికే పూరి జగన్నాధ్‌తో మరో సినిమా చేస్తాడని వార్తలొస్తున్నాయి.

09/02/2017 - 23:58

సునీల్ హీరోగా ఎన్.శంకర్ దర్శకత్వంలో మహాలక్ష్మి ఫిలింస్ పతాకంపై రూపొందుతున్న ప్రొడక్షన్ నెం.1 చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

09/02/2017 - 23:57

మాస్ హీరోగా మంచి ఇమేజ్ తెచ్చుకున్న రవితేజ, మెహరీన్ జంటగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 3రాజా ది గ్రేట్2. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరిదశలో వుంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో రవితేజ అంధుడిగా కనిపించనున్నాడు. వరుస పరాజయాల తరువాత భిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యాడు రవితేజ.

09/02/2017 - 23:57

అల్లరి నరేష్ హీ రోగా నటిస్తున్న మేడమీద అబ్బాయి చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది మలయాళీ భామ నిఖిలా విమల్. ప్రజిత్ దర్శకత్వంలో జాహ్నవి ఫిలింస్ పతాకంపై బొప్పన చంద్రశేఖర్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 8న విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ నిఖిలా విమల్ చెప్పిన విశేషాలు..
అవకాశం..

09/02/2017 - 23:56

ప్రస్తుతం టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోన్న అర్జున్‌రెడ్డి చిత్రం పలు వివాదాలతోపాటు మరోవైపు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసుకుంటోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమా గురించి పొగిడేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా రీమేక్ రైట్స్‌కోసం భారీ పోటీ నెలకొంది.

09/02/2017 - 23:56

ప్రేక్షకుల ట్రెండ్‌ను సెట్ చేసేవి సినిమాలే. ఎప్పటికప్పుడు మారుతున్న సమీకరణాలతోపాటుగా ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా సినిమాలు రూపొందించడంలో టాలీవుడ్ ముందువరుసలోనే వుంటోంది. సహజంగా ఏ చిత్రంలో అయినా హీరో ఇంట్రొడక్షన్ అదిరిపోయే లెవెల్‌లో వుండాలన్న భావన ఇప్పుడు పలుచబడిపోయింది. గత సంవత్సరం వరకూ హీరో కనపడిన వెంటనే ఓ ఫైట్‌తోపాటుగా ఓ పాటను కూడా పెట్టడం ఆనవాయితీగా వచ్చింది.

09/02/2017 - 23:56

బాహుబలి స్ఫూర్తితో ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్.సి భారీ బడ్జెట్‌తో సోషియో ఫాంటసీ చిత్రంగా సంఘమిత్రను మొదలుపెటిటన విషయం తెలిసిందే. శ్రీతేనాండాల్ ఫిలింస్ పతాకంపై ఏకంగా 250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కే చిత్రంలో టైటిల్ రోల్‌కు శృతిహాసన్‌ను ఎంపిక చేశారు. కొన్నాళ్లు ట్రైనింగ్ ఇచ్చి పది రోజులపాటు షూటింగ్ జరిగిన తరువాత శృతిహాసన్ సినిమా నుండి తప్పుకోవడంతో అసలు సమస్య అక్కడే మొదలైంది.

Pages