S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/27/2017 - 22:15

బాలీవుడ్‌లో సంచలన హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న హాట్ భామ కంగనా రనౌత్ హీరోయిన్‌గా నటించి ఎన్నో ప్రశంసలు అందుకున్న క్వీన్ చిత్రం బాలీవుడ్‌లో మంచి విజయాన్ని దక్కించుకుంది. ఆ చిత్రాన్ని సౌత్‌లో రీమేక్ చేయడానికి గత కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. తమిళ దర్శకుడు త్యాగరాజన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ కోసం ఇప్పటికే తమన్నా, అమలాపాల్ పేర్లు వినిపించాయి.

08/27/2017 - 22:13

ప్రస్తుతం బాలీవుడ్‌లో ఓ హాట్ హీరోయిన్ ప్రెగ్నెంట్ అంటు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయం గురించి అమ్మడు స్పందిస్తూ నాకు ప్రెగ్నెన్సీ లేదు మొర్రోయ్...అని మొత్తుకున్నా కూడా ఎవరూ వినడంలేదు. పైగా ఈ అమ్మడికి పెళ్లికూడా కాలేదు మరి! ఇంతకీ ఎవరా భామ ఏమా కథ అంటే.. మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టిన నర్గిస్ ఫక్రి బాలీవుడ్‌లో ఎంట్రీఇచ్చింది.

08/27/2017 - 22:11

సాయికిరణ్, ప్రాచీ అధికారి జంటగా తుల్జ భవానీ ఫిలింస్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం వలపు సౌధం. బల్వాన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రానికి కృష్ణ మోహన్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. సునీల్ సాగర్, మజ్జు సోహ్రాబ్ సంయుక్తంగా రొపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు.

08/26/2017 - 22:52

గ్లామర్ హీరోయిన్‌గా సౌత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న మిల్క్భీమ తమన్నాకు ఈమధ్య కెరీర్‌కు బ్రేక్ పడింది. వరసగా పరాజయాలు పలకరిస్తుండడంతో కొత్త అవకాశాలు రావడంలేదు. ముఖ్యంగా ఎన్నో ఆశలు పెట్టుకుని భారీ బడ్జెట్‌తో చేసిన అభినేత్రి సినిమా గట్టి దెబ్బ కొట్టడంతో తమన్నాకు ఈ పరిస్థితి. ప్రస్తుతం తమిళంలో ఒకే ఒక్క సినిమాలో నటిస్తున్న ఈమెకు తెలుగులో మరో అవకాశం వరించింది.

08/26/2017 - 22:51

సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న స్పైడర్ సినిమా ప్రస్తుతం రొమేనియాలో మిగిలివున్న ఒక పాట చిత్రీకరణ జరుపుకుంటోంది. నిన్న చిత్రీకరణ మొదలుపెట్టిన యూనిట్ 31 వరకు జరపనుందట. క్రేజీ దర్శకుడు మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే టాకీ పూర్తి చేసుకుని మరోవైపు పోస్ట్‌ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్న ఈ సినిమాపై అంతటా ఆసక్తి నెలకొంది.

08/26/2017 - 22:51

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న జై లవకుశ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి కావచ్చింది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటిస్తున్నట్టు కన్‌ఫర్మ్ అయింది. వినాయకచవితి సందర్భంగా కుశ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసారు. దీంతో జై, లవకుమార్, కుశగా మూడు భిన్నమైన గెటప్‌లలో ఎన్టీఆర్ అదరగొట్టాడు.

08/26/2017 - 22:51

గురు సినిమాలో విభిన్నమైన గెటప్‌తో నాచురాలిటీకి దగ్గరగా కనిపించి ఆకట్టుకున్నాడు ప్రముఖ నటుడు వెంకటేష్. ప్రస్తుతం ఆయన రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌లో కాకుండా భిన్నమైన పాత్రలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంకటేష్ ఓ పౌరాణిక పాత్రలో నటించేందుకు ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.

08/26/2017 - 22:50

ఆకాష్‌కుమార్, మిస్తీచక్రవర్తి జంటగా జయప్రద ప్రధాన పాత్రలో ఎన్.నరసింహరావు దర్శకత్వంలో అశ్వనీకుమార్ సహదేవ్ నిర్మిస్తున్న చిత్రం శరభ. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ను శనివారం మెగస్టార్ చిరంజీవి విడుదల చేసారు.

08/26/2017 - 22:50

తనిష్క్‌రెడ్డి, అలెక్సియస్, సుబాంతి పంత్ హీరోహీరోయిన్లుగా వి. రామకృష్ణ దర్శకత్వంలో శ్రీ సిద్ది వినాయక ప్రొడక్షన్స్ పతాకంపై బి.ప్రవీణ్‌కుమార్ యాదవ్ నిర్మిస్తున్న దర్పణం చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రచయిత పరచూరి వెంకటేశ్వరరావు క్లాప్ కొట్టగా దర్శకుడు ఎన్.శంకర్ కెమెరా స్విచాన్ చేసారు.

08/26/2017 - 22:50

అల్లు అర్జున్, శరత్‌కుమార్ ప్రధాన తారాగణంగా రామలక్ష్మి సినీ క్రియేషన్స పతాకంపై రూపొందించిన చిత్రం నా పేరు సూర్య..నాఇల్లు ఇండియా. ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను ఆర్‌ఎఫ్‌సిలో చిత్రీకరిస్తున్నారు. వక్కంతం వంశీ తొలిసారిగా దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి శిరీషా శ్రీ్ధర్ నిర్మాత. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి వచ్చే సంవత్సరం ఏప్రిల్ 27న విడుదల చేయడానిక సన్నాహాలు జరుపుతున్నారు.

Pages