S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/11/2017 - 21:00

తెలుగులో ఉత్తమ చలన చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకిచ్చే నంది పురస్కార విజేతల ఎంపికకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయ నిర్ణేతల బృందాలను నియమించింది. 2014, 2015, 2016 మూడేళ్లకుగాను కమిటీలను ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి- చక్రపాణి, రఘుపతి వెంకయ్య పురస్కారాలకు సంబంధించి మూడేళ్ళ కమిటీలకు నందమూరి బాలకృష్ణ నేతృత్వం వహిస్తారు.

08/11/2017 - 20:59

మున్నాభాయ్‌తో మళ్లీ వస్తా. కథను సిద్ధం చేస్తున్న అభిజిత్‌దే ఆల స్యం అంటున్నాడు సంజయ్‌దత్. ప్రా జెక్టు మొదలు పెట్టడానికి నిర్మాత విధు వినోద్‌చోప్రా, దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ సైతం సిద్ధంగానే ఉన్నారని, మూడేళ్లుగా కథమీద కసరత్తు చేస్తున్న అభిజిత్‌దే ఆలస్యం అంటున్నాడు హీరో సంజయ్.

08/11/2017 - 20:58

చాలారోజుల తరువాత సూపర్‌స్టార్ కృష్ణ తెరపై కనిపించనున్నారు. రవితేజ 3బలాదూర్2, విక్రమ్ మల్లన్న సినిమాల్లో కనిపించిన కృష్ణ, ఆ తరువాత గత ఏడాది శ్రీశ్రీ చిత్రంలో నటించారు. ఇప్పుడు తాజాగా మహేష్ హీరోగా చేస్తున్న 3్భరత్ అను నేను2 చిత్రంలో నటిస్తున్నట్టు సమాచారం. కృష్ణ 3కొడుకు దిద్దిన కాపురం, ముగ్గురు కొడుకులు, గూఢచారి 1172 తదితర చిత్రాల్లో తన కుమారుడు మహేష్‌బాబుతో కలిసి నటించారు.

08/11/2017 - 20:57

ఎన్టీఆర్ హీరోగా నటించిన టెంపర్ సినిమా బాలీవుడ్‌లో రీమేక్‌కు సిద్ధమైంది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన టెంపర్, బాలీవుడ్ వర్షన్‌లో హీరో రణ్‌వీర్‌సింగ్ ఎన్టీఆర్ పాత్ర పోషించనున్నాడు. అప్పట్లో వరుస పరాజయాలతో సతమతమై న ఎన్టీఆర్‌కు టెంపర్ పెద్ద ఊరట ఇచ్చింది. ఎన్టీఆర్ సైతం కసితో చేసిన పాత్రకు క్రిటిక్స్ నుంచి మంచి ప్రశంసలు లభించాయి.

08/11/2017 - 20:55

దర్శకుడు సుందర్.సి అత్యం త భారీ బడ్జెట్‌తో నిర్మించ తలపెట్టిన ‘సంఘమిత్ర’ చిత్రానికి ఊహించని అడ్డంకి వచ్చిపడిన సంగతి తెలిసిందే. ముందునుండి అనుకున్నట్టు సినిమాలో శృతిహాసన్ నటించడం లేదని కొన్ని నెలల క్రితమే తేలిపోయింది. అప్పటినుండి ఆమె స్థానంలో ఎవరెవరో హీరోయిన్లు పేర్లు వినిపించినా హన్సిక పేరు మాత్రం బలంగా వినబడింది. దీంతో అంతా ఆమె కన్‌ఫర్మ్ అనుకున్నారు.

08/11/2017 - 20:54

విజయ్ రాఘవేంద్ర, హరిప్రియ జంటగా ఆదిరామ్ దర్శకత్వంలో కన్నడంలో రూపొందిన రణతంత్ర చిత్రాన్ని తెలుగులో శ్రీ జెవి ప్రొడక్షన్స్ పతాకంపై లత మార్టోరి సమర్పణలో వెంకట్రావు మార్టోరి 3ఇది పెద్ద సైతాన్2 పేరుతో తెలుగులో అందిస్తున్నారు.

08/11/2017 - 20:53

ఫ్యామిలీ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న జగపతిబాబుకు ఆమధ్య వరుసగా పరాజయాలు పలకరిస్తుండటంతో.. కాస్త గ్యాప్ తీసుకుని క్యారెక్టర్ యాక్టర్‌గా సెకెం డ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఈసారి ఆయన నెగెటివ్ పాత్రల్లో నటిస్తూ అటు తమిళంలోనూ మంచి ఇమేజ్ సాధించాడు. ఇక జగపతిబాబు లెజెండ్‌లో బాలయ్యకు దీటుగా నటించి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం జయ జానకి నాయక సినిమాలో నటిస్తున్న జగపతిబాబు..

08/11/2017 - 20:51

బాలీవుడ్‌లో ఖాన్ త్రయం సినిమాలంటేనే పిచ్చి. అందులో షారుక్ సినిమా అంటే అతని ఫ్యాన్స్‌కి -వేలం వెర్రి. ఆ ఇమేజ్ కొంతకాలంగా మసకబారుతోంది. షారుక్ నుంచి వస్తున్న చిత్రాలన్నీ క్రమంతప్పకుండా ఆడియన్స్‌నే కాదు, ఫ్యాన్స్‌నీ నిరుత్సాహపరుస్తున్నాయి. ఇటీవలి కాలంలో వచ్చిన చిత్రాల్లో 3చెన్నై ఎక్స్‌ప్రెస్2వినా, షారుక్ సినిమా అని గొప్పగా చెప్పుకునే చిత్రాలు రావడం లేదంటే అతిశయోక్తి కాదు.

08/11/2017 - 20:47

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న రోబో-2 చిత్రీకరణ చివరిదశలో ఉంది. ఒక పాట మినహా మిగతా చిత్రీకరణ మొత్తం పూర్తయిపోయింది. వచ్చే నెల నుండి మొదలుకానున్న ఈ పాట షూటింగ్ 12 రోజులపాటు నిర్విరామంగా జరుగుతుందట. ఇప్పటివరకు ఏ పాట కూడా ఇన్ని రోజులపాటు షూట్ జరుపుకోలేదట. కాబట్టి అతి పెద్ద పాట చిత్రీకరణ రికార్డ్ కూడా రజనీ సినిమాకే దక్కింది.

08/11/2017 - 20:45

తాప్సి, శ్రీనివాసరెడ్డి, వెనె్నల కిశోర్ ప్రధాన తారాగణంగా 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మహి వి రాఘవ్ దర్శకత్వంలో విజయ్ చిల్ల, శశిదేవిరెడ్డి సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం 3ఆనందోబ్రహ్మ. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. సినిమా గూర్చి తాప్సి మాట్లాడుతూ సినిమాలో తనకు నలుగురు హీరోలు ఉన్నారని, తొలిసారిగా హారర్ కామెడీ చిత్రంలో నటిస్తున్నట్టు చెప్పింది.

Pages