S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/10/2017 - 22:13

బాలకృష్ణ, పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో తొలిసారిగా రూపొందిస్తున్న చిత్రం ‘పైసా వసూల్’. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన స్టంఫర్‌ను ఇటీవల విడుదల చేయగా మంచి ఆదరణ లభిస్తోంది. షూటింగ్, డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ముగింపు దశలో కొనసాగిస్తున్నారు.

08/10/2017 - 22:12

బాహుబలి తరువాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాహో చిత్రం జోరుగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రస్తుతం యూరప్‌లో షూటింగ్ జరుగుతోంది. ఏడు రోజులపాటు అక్కడ చిత్రీకరణ జరుపుతున్నారట. రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏకంగా 150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనే విషయం తెలియాల్సి వుంది.

08/10/2017 - 22:10

బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్‌ప్రీత్‌సింగ్, ప్రగ్యా జైస్వాల్ ముఖ్యపాత్రల్లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిరియాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న 3జయ జానకి నాయ క2 చిత్రం 11న విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్ మాట్లాడుతూ- ఇందులో జానకి పాత్ర చేయడం అదృష్టంగా భావిస్తున్నాను.

08/10/2017 - 22:09

హీరోనితిన్, మేఘా ఆకాశ్, మధునందన్, నిర్మాత రామ్ ఆచంటా తదితరులతో కూడిన ‘లై’ టీం తిరుమలను సందర్శించారు

08/10/2017 - 20:58

తమిళంలో విజయవంతమైన ఒరుబంతి నాల్న్,్ర ఒరు వికెట్ చిత్రాన్ని తెలుగులో కాదంబరి (ఇంటి నెంబర్ 150) పేరుతో అనువదిస్తున్నారు. ఆర్.డి.ఆర్ట్స్ పతాకంపై జె.రాధా శివరామ్, మన్వర్ బాషా అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. ఈనేలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

08/10/2017 - 20:56

సత్యజ్యోతి ఫిలింస్ పతాకంపై అజిత్ కథానాయకుడిగా శివ దర్శకత్వంలో రూపొందించిన ‘వివేగం’ చిత్రాన్ని తెలుగులో వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ సొంటినేని ‘వివేకం’ పేరుతో అందిస్తున్నారు. తెలుగు సినిమాకు సంబంధించిన టీజర్ ఇప్పటికే విడుదలైంది. కాజల్ కథానాయికగా నటించిన ఈ సినిమా యూత్, మాస్ క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

08/10/2017 - 20:55

పూరణ్, సాక్షి చౌదరి జంటగా ఎస్ టీమ్ పిక్చర్స్ పతాకంపై సూర్య దర్శకత్వంలో ఎం.ఎల్.లక్ష్మి రూపొందించిన చిత్రం ‘సువర్ణసుందరి’ (చరిత్ర ఎప్పుడూ భవిష్యత్తును వెంటాడుతుంది’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన లభిస్తోందని దర్శక నిర్మాతలు తెలియజేస్తున్నారు.

08/10/2017 - 20:53

ఈమధ్య గ్లామర్ భామలు సినిమా అవకాశాల కోసం తన అందాల్ని ఎరగా వేయడం చూస్తున్నదే. ఇప్పటికే చాలామంది బికినీలు, టూపీస్ అంటూ రకరకాల వేషాలతో ప్రేక్షకుల్ని హీటెక్కిస్తున్నారు. మరికొందరు మరో అడుగు ముందుకేసి టాప్‌లెస్ ఫోజులతో సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ భామ ఈషా గుప్తా కూడా తన అందాల్ని ఎరగా వేసి ప్రేక్షకుల మతి పోగొడుతోంది.

08/10/2017 - 20:52

అందాల భామ కాజల్ అగర్వాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆమె కోర్టులో వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఆ వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం తెలుగు, తమిళం భాషల్లో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కాజల్, గతంలో పలు కమర్షియల్ యాడ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఓ కోకోనట్ ఆయిల్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన ఆమె, వారు రూపొందించిన యాడ్ ఫిలింలో నటించింది.

08/10/2017 - 00:05

సౌత్‌లో ఉన్న అవకాశాలను వదులుకుని నార్త్‌లో లేని అవకాశాల కోసం వెంపర్లాడి బాలీవుడ్‌లో బోర్లాపడింది ఇలియానా. ఎప్పుడో అడపాదడపా ఒకటీ అరా అవకాశాలు పలకరించటం తప్ప, బాలీవుడ్‌లో ఇలియానాకు రెడ్ కార్పెట్ పడిన దాఖలాలు లేవు. తాజాగా ఇలియానా నటించిన ‘బాద్‌షాహో’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అజయ్‌దేవ్‌గన్, ఇమ్రాన్ హష్మి, మిలన్‌ల త్రయం చిత్రానికి హీరోలు.

Pages