S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/08/2017 - 20:46

క్రీస్తు జీవిత కథ ఆధారంగా నిర్మిస్తోన్న లోకరక్షకుడు చిత్రం రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుని, కర్నాటకలో మూడో షెడ్యూల్ మొదలబెట్టబోతోంది. చంద్రాస్ ఆర్ట్ మూవీస్ పతాకంపై చంద్రశేఖర్ రూపొందిస్తున్న చిత్రమే లోకరక్షకుడు. సిహెచ్ బ్రహ్మం దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం లండన్‌లో షూటింగ్ మొదలవ్వడం తెలిసిందే.

08/08/2017 - 20:45

సూపర్‌స్టార్ అభిమాను లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చిం ది. మహేష్ పుట్టిన రోజు నేడు. దాంతోపాటు ఆయన నటిస్తున్న స్పైడర్ సినిమా టీజర్ కూడా నేడు విడుదల చేస్తున్నారు. ఉదయం9 గంటలకు ముహూర్తం. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పైడర్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా అటు ట్రేడ్ వర్గాల్లోనూ సంచలనం రేపుతోంది.

08/08/2017 - 20:43

చాలాకాలం క్రితం వచ్చిన వెంకటేష్ బొబ్బిలిరాజా సినిమా గుర్తుందిగా. ‘అయ్యో అయ్యో అయ్యయో’ అన్న మేనరిజంతో అప్పట్లో వెంకటేష్ బాగా ఆకట్టుకున్నాడు. ఆ చిత్రంలో ‘కన్యాకుమారీ.. కనబడదా దారి’ అంటూ ఓ హిట్టు సాంగు కూడా ఉంది. ఆ పాట ప్రత్యేకత -అప్పట్లో వేళ్లూనుకుంటున్న గ్రాఫిక్స్. ఇప్పుడు అప్‌డేట్ గ్రాఫిక్స్‌తో పూర్తి సినిమాయే చేయబోతున్నాడు వెంకటేష్.

08/08/2017 - 20:40

క్యూట్ కథలతో కొత్తదనాన్ని రుచి చూపించటంలో నాని బాగా ముదిరిపోయాడు. పట్టిందల్లా హిట్టవుతున్న టైమ్ -నానికి నీడలా నడుస్తోంది. అందుకే -వర్థమాన స్టార్ హీరోల రేసులో నాని కనుచూపుమేర ముందున్నాడు. వరుస విజయాలు అతన్ని వెంటాడుతున్నాయి. తాజాగా నిన్నుకోరి చిత్రంతో వైవిధ్యమైన కథలో భిన్నమైన పాత్ర పోషించి మెప్పించిన నాని -తరువాతి ప్రాజెక్టుగా ఎంసిఏ ప్రాజెక్టులో బిజీ అయిపోయాడు.

08/08/2017 - 20:38

దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మాతగానూ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తమిళ యువ దర్శకుడు డి-16 ఫేమ్ కార్తీక్ నరేన్ దర్శకుడిగా ‘నరగసూరన్’ అనే చిత్రాన్ని గౌతమ్ నిర్మిస్తున్నాడు. ఇందులో యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా నటిస్తున్నారు.

08/06/2017 - 20:45

తెలుగు పరిశ్రమలో అందాల భామ అనుష్కకు స్టార్ క్రేజ్ ఉంది. గ్లామర్ హీరోయిన్‌గా ఓవైపు అందాలు ఆరబోస్తూనే, మరోవైపు లేడీ ఓరియెంటెడ్, నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలతో సత్తా చూపుతోంది. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అనుష్క, ప్రస్తుతం ప్రభాస్ సరసన సాహోలో నటిస్తుందంటూ వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా సాహోలో తాను నటించడం లేదంటూ అనుష్క స్పష్టం చేసింది.

08/06/2017 - 20:43

గత ఏడాది చిన్న చిత్రంగా విడుదలై సంచలనం సృష్టించింది పెళ్లిచూపులు. సినిమాతో హీరో విజయ్ దేవరకొండ యంగ్ స్టార్ హీరోల జాబితాలోకి చేరిపోయాడు. ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్‌కు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. కానీ ఆ సినిమా వచ్చి ఏడాది గడిచినా తరుణ్ తదుపరి చిత్రం ఇంకా సెట్స్‌పైకి రాలేదు.

08/06/2017 - 20:43

శ్రీరస్తు శుభమస్తు సినిమాతో హీరోగా మంచి విజయాన్ని అందుకున్నాడు అల్లువారబ్బాయి శిరీష్. ప్రస్తుతం విఐ ఆనంద్ దర్శకత్వంలో శిరీష్ నటిస్తున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది. దీంతో తదుపరి చిత్రానికీ సన్నాహాలు చేస్తున్నట్టు శిరీష్ తెలిపాడు. ఈ చిత్రం తెలుగు తమిళ భాషల్లో ఉంటుందని, మంచి కథతో తెరకెక్కుతుందని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

08/06/2017 - 20:43

వయసు దాటుతున్నా మల్లెతీగ అందంతో మెరిపిస్తున్న శ్రీయ, ఇప్పుడు హీరోయిక్ రోల్ పోషించబోతోంది. తెలుగు టాప్ హీరోలు అందరితో జతకట్టిన శ్రీయ, కెరీర్‌లో కొద్దికాలం వెనకబడినా మళ్లీ మునపటి స్పీడ్ చూపిస్తోంది. కెరీర్ డౌన్‌ఫాల్ అవుతున్న ప్రతిసారీ అగ్రహీరోల సరసన అవకాశాలు అందుకుంటూ లైమ్‌లైట్‌లో ఉండే ప్రయత్నం చేస్తోంది. ఆమధ్య కొన్ని చిత్రాలు ఆశించిన పేరు తేకపోవడంతో, ఇండ్రస్టీలో శ్రీయ పనైపోయిందని అనుకున్నారంతా.

08/06/2017 - 20:42

సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న స్పైడర్ -ఇటీవల పూర్తి చేసిన పాటతో చిత్రీకరణతో పూరె్తైంది. తరువాత ప్రాజెక్టు ‘్భరత్ అను నేను’ను సెట్స్‌పైకి తెచ్చేసిన మహేష్, తరువాతి షెడ్యూల్‌ను 10నుంచి లక్నోలో మొదలుపెడుతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించిన ఓ భారీ షెడ్యూల్‌ని ఇటీవలే హైదరాబాద్‌లో పూర్తి చేశారు.

Pages