S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/06/2017 - 20:42

సినిమా పేరే అబద్ధమే కనుక, హిట్టవ్వాలన్న కోరిక నిజమవ్వాలని ‘లై’ ఆడియోలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జోక్ పేల్చాడు. నితిన్, మేఘా ఆకాశ్ జంటగా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై హనురాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లై’ (లవ్ ఇంటిలిజెన్స్ ఎనిమిటి). ఈనెల 11న విడుదలకు సన్నాహాలు చేస్తూ, హైద్రాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆడియో విడుదల చేశారు.

08/06/2017 - 20:41

అల్లరి నరేష్ హీరోగా జాహ్నవి ఫిలింస్ పతాకంపై జి రంజిత్ దర్శకత్వంలో బొప్పన చంద్రశేఖర్ రూపొందిస్తున్న చిత్రం మేడమీద అబ్బాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం, పోస్ట్ ప్రొడక్షన్స్ జరుపుకుంటోంది. సినిమాకు సంబంధించిన టీజర్‌ను అల్లరి నరేష్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా విడుదల చేసారు. తొలి 12 గంటల్లోనే 5 లక్షల వ్యూస్ సాధించిందని ఆనందం వ్యక్తం చేశాడు.

08/06/2017 - 20:41

తెలుగమ్మాయిలు సినిమాలలో నటించేందుకు ముందుకు రావడంలేదు. అందుకు అనేక కారణాలు చెబుతున్నారు. ఏదేమైనా తెలుగు చిత్రాల్లో పరభాషా భామలకు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. అయితే, అప్పుడప్పుడు తెలుగమ్మాయిలు కూడా తమ ప్రతిభను నిరూపించుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈష అనే తెలుగమ్మాయి ‘అంతకుముందు ఆ తరువాత, బందిపోటు, మాయామాల్, అమీతుమీ’ చిత్రాల్లో నటించి గుర్తింపు పొందింది.

08/06/2017 - 20:41

హీరో మంచు మనోజ్ ప్రస్తుతం ‘ఒక్కడు మిగిలాడు’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇందులో మనోజ్ ఎల్‌టిటిఇ చీఫ్ ప్రభాకరన్ పాత్రతోపాటు, స్టూడెంట్ లీడర్ పాత్ర చేస్తుండటం వలన సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. చిత్ర టీమ్ కూడా రియాలిటీకి దగ్గరగా ఉండేలా సన్నివేశాల్ని రూపొందించినట్టు వినికిడి. ఇటీవలే సముద్రం నడిబొడ్డున 10మందితో ఒక రెస్క్యూ సన్నివేశాన్ని చిత్రీకరించారట.

08/05/2017 - 23:07

ఇండస్ట్రీలో హీరోయిన్‌గా నిలదొక్కుకోవడం సాధారణమైన విషయం కాదు. దానికి నటనతోపాటు గ్లామర్ హంగులు జోడించాల్సిందే. ముఖ్యంగా గ్లామర్ లేనిదే ఈరోజుల్లో అవకాశాలు రావడం కష్టం. ప్రస్తుతం రఘువరన్ బిటెక్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తమిళ భామ సురభికి ఆ సినిమా తరువాత మంచి అవకాశాలే వచ్చాయి. కానీ ఆమె చేసిన బీరువా సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు.

08/05/2017 - 23:07

ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న జైలవకుశ సినిమాకు సంబంధించిన రోజుకో వార్త ప్రేక్షకుల్లో హైప్‌ను క్రియేట్ చేస్తోంది. మూడు పాత్రల్లో ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని ప్రదర్శించనున్న ఈ చిత్రానికి బాబి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ప్రేక్షకులతోపాటు ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాల్ని నెలకొల్పిన ఈ చిత్రం తాజాగా సీడెడ్ విడుదల హక్కుల్ని భారీ ధరకు అమ్ముడవ్వడం విశేషం.

08/05/2017 - 23:06

రామ్, కిశోర్ తిరుమల కాంబినేషన్‌లో వచ్చిన ‘నేను శైలజ’ చిత్రం ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రానికి ‘ఉన్నది ఒకటే జిందగీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. పి.ఆర్.సినిమా, స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్లుగా అనుపమా పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు.

08/05/2017 - 23:06

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం విదేశాల్లో జరుగుతోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఘనవిజయం సాధించడంతో ఇప్పుడు ఈ చిత్రంపై అమితమైన క్రేజ్ నెలకొంది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను ఇంకా ప్రకటించలేదు. ఇప్పటికే పలు రకాల టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి.

08/05/2017 - 23:06

కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సప్తగిరి, సప్తగిరి ఎక్స్‌ప్రెస్ చిత్రంతో హీరోగా మంచి మార్కులు తెచ్చుకున్నాడు. తాజాగా ఆయన హీరోగా నటిస్తున్న మరో చిత్రం సప్తగిరి సూపర్‌ఫాస్ట్. ఈ చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు కిరణ్ క్లాప్‌కొట్టగా రచయిత విజయేంద్రప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేశారు.

08/05/2017 - 23:05

వి4 మూవీస్ పతాకంపై ఆది సాయికుమార్ హీరోగా ప్రభాకర్ పి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రానికి నిర్మాత బన్నివాసు ‘నెక్స్‌ట్ నువ్వే’ అన్న టైటిల్ ఖరారు చేశారు. హిలేరియస్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న చిత్రంలో వైభవి, రష్మి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి రానున్న విజయదశమి కానుకగా విడుదల చేయనున్నారు.

Pages