S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/05/2017 - 01:10

వంగవీటి సినిమా హీరో శాండి, దళం దర్శకుడు జీవన్‌రెడ్డి, ఇటీవలికాలంలో 100 కోట్లు వసూలు చేసి దేశంలో సంచలనం సృష్టించిన మరాఠి చిత్రం సైరత్ కెమెరామెన్ సుధాకర్ ఎక్కంటి క్రేజీ కాంబినేషన్‌లో ఓ భారీ బయోపిక్ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు జార్జ్‌రెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు.

08/05/2017 - 01:09

గ్లామర్ రోల్స్ పేరిట -బీచుల్లోనో, చెట్లచుట్టూనో నాలుగు చిందులేయడం కూడా గొప్పేనా అన్న భావన చాలామందిలో ఉంటుంది. నిజానికి అదంత సులువేంకాదు. నన్నడిగితే హృదయం ద్రవించే సన్నివేశాల్లో నటించడం కంటే గ్లామర్ రోల్స్‌తో మెప్పించడమే హీరోయిన్లకు టప్ టాస్క్2 అంటోంది ఢిల్లీ పిల్ల తాప్సీ పొన్ను.

08/03/2017 - 21:07

బాలయ్య ఎక్కడా ఆగడం లేదు. వెటరన్ హీరో అయినా, కుర్ర హీరోలతో సమానంగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. నిన్నగాక మొన్ననే గౌతమిపుత్ర శాతకర్ణితో సెంచరీ పూర్తి చేసిన తరువాత మరింత వేగం పెంచినట్టు కనిపిస్తున్నాడు బాలయ్య. తాజాగా బాలయ్య హీరోగా కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందనున్న 102వ చిత్రం కూడా మొదలైపోయింది. హైదరాబాద్ ఆర్‌ఎఫ్‌సిలో 102వ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు.

08/03/2017 - 21:04

సునీల్, మి యాజార్జ్ జంటగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో పరుచూరి కిరీటి యునైటెడ్ కిరీటి మూవీస్ పతాకంపై రూపొందించిన చిత్రం ‘ఉంగరాల రాం బాబు’. అన్ని కమర్షియల్ హంగులతో రూపొందించిన ఈ సినిమా సునీల్ గత చిత్రాలకన్నా హై స్టాండర్డ్‌లో రూపొందిందని, క్రాంతిమాధవ్ తరహా మేకింగ్ వైవిధ్యంగా ఉంటుందని నిర్మాత చెబుతున్నారు.

08/03/2017 - 21:03

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగో రూపొందుతున్న స్పైడర్ సినిమా బిజినెస్ వర్గాల్లో దుమ్ము రేపుతోంది. ఎఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇప్పటికే అనేక కోణాల్లోనే కాదు, రికార్డు స్థాయిలో బిజినెస్ చేసి సంచలనానికి మారుపేరైంది. తాజాగా ఓవర్సీస్‌కు సంబంధించిన బిజినెస్ విషయంలో అనూహ్యమైన రేటు పలికిందని అంటున్నారు. మహేష్ కెరీర్‌లో ఈ సినిమా హక్కులు భారీ రేటుకు అమ్ముడవడం విశేషం.

08/03/2017 - 21:01

సింహ ప్రొడక్షన్స్ పతాకంపై శత్రుఘ్న రాయపాటి, స్ట్ఫోని, జోసెలిన్ ముఖ్యపాత్రల్లో రమ్స్ దర్శకత్వంలో శ్రీనివాసగుప్త, మోహన్, నరసింహ, నాగశ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘గ్రీన్‌కార్డ్’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం నేడు విడుదల అవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రి రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో నిర్వహించారు.

08/03/2017 - 20:57

సధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుమంత్, ఆకాంక్షాసింగ్ జంటగా తిన్ననూరి గౌతమ్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ రూపొందిస్తున్న చిత్రం 3మళ్లీ రావా. ఈ చిత్రానికి సం బంధించిన ఫస్ట్‌లుక్ మరి యు టీజర్‌ను హైదరాబాద్‌లో గురువారం ఉదయం సినిమా యూనిట్ విడుదల చేసింది. చిత్రానికి సం బంధించిన పాటలను రికార్డ్ చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి.

08/03/2017 - 20:56

పూజాకుమార్.. ‘విశ్వరూపం’ హీరోయిన్‌గా కమల్‌హాసన్‌తో కలిసి తన అందాలతో తెలుగు ప్రేక్షకులు కొంచెం పరిచయమైంది. ఇప్పుడు రాజశేఖర్ హీరోగా నటిస్తున్న పిఎస్‌వి గరుడవేగ సినిమాలో వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతోంది. ఇండియాలోనే కాకుండా అమెరికాలోనూ ఈమెకు నటించే అనుభవముంది. బహుశ ఈమె నటిగానే అందరికీ తెలిసి ఉంటుంది. ఆమె అందం విశ్వరూపాన్ని అతి కొద్దిమందే చూసి ఉంటారు.

08/03/2017 - 20:54

ధనమేరా అన్నిటికీ మూలం! ఆ ధనం విలువ తెలుసుకొనుట మానవ ధర్మం అని తెలుగు చిత్రాలలో పాట అందరికీ తెలిసిందే. మనిషిని నడిపించే ఇంధనం, ధనం నాయనా అంటూ రావుగోపాలరావు అభిలాష చిత్రంలో చిరంజీవితో చెబుతాడు. అలాగే ఎవరు ఏ పనిచేసినా ధనం కోసమే. డబ్బులేనివాడు దుబ్బుకు కొరగాడని మనకు సామెతలు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని వంద శాతం జీర్ణించుకున్నది తెలుగు సినీ పరిశ్రమ.

08/02/2017 - 23:49

వరుసగా ఓ వైపు యువ హీరోలతో సినిమాలు చేస్తూ మరోవైపు స్టార్ హీరోల సరసన నటిస్తూ దూసుకుపోతోంది అందాల భామ రకుల్‌ప్రీత్‌సింగ్. కెరీర్ మొదలుపెట్టిన తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేసులో ఉన్న రకుల్‌కు ప్రస్తుతం చేతినిండా సినిమాలు ఉన్నాయి. గ్లామర్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంటూనే మరోవైపు నటిగా కూడా తన సత్తా చాటుకునేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఆమె నటించిన చిత్రం జయ జానకి నాయక.

Pages