S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశి దర్శకత్వంలో ప్రారంభమైన చిత్రం 3నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా2 చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై శిరీషా శ్రీ్ధర్ రూపొందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 27న విడుదల చేయడమే టార్గెట్‌గా షూటింగ్ శరవేగంగా జరుపుతున్నారు.
నంది క్రియేషన్స్ పతాకంపై కోటేంద్ర దుద్యాల దర్శకత్వంలో కె.ఎం.డి.రఫి నిర్మిస్తున్న చిత్రం బంగారి బాలరాజు2. లవ్ ఈజ్ బ్యాక్ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సీనియర్ దర్శకుడు సాగర్ క్లాప్ కొట్టగా యు వ హీరో నాగ అనే్వష్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత సిం ధూరపువ్వు కృష్ణారెడ్డి స్క్రిప్టును అందజేశారు.
ఓ గ్రామంలో జరిగే కథ ఇది. ఓ గేదె ఓ కుటుంబాన్ని పోషిస్తుంది. అది చనిపోతే ఆ కుటుంబానికి ఎలాంటి సమస్యలు వస్తాయి అనే పాయింట్‌తో మూగ జీవాల కథనం తో మనిషికి, జంతువుకి వున్న అనుబంధం ఎలాంటి? అన్న ఇతివృత్తంతో బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్ న్యూస్ రూపొందించాను అని దర్శకుడు నరసింహ నంది తెలిపారు. లక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై ఆయన దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం ఈనెల 4న విడుదలకు సిద్ధమైంది.
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న రోబో 2.0 చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది. దాని తరువాత ఆయన నటిస్తున్న 3కాల2 సినిమా రెండో షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమా తరువాత ఆయన తదుపరి చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడట.
బాహుబలి తరువాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం సాహో. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం యూరప్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. హైటెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటికే పలువురు హీరోయిన్ల పేర్లు విన్పించాయి. తాజాగా అనుష్క పేరు కూడా వినిపించింది.
మహేష్‌బాబు కథానాయకుడిగా ఎన్.వి.ఆర్. సినిమా, ఎల్‌ఎల్‌పి, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఎన్.వి.ప్రసాద్ రూపొందిస్తున్న స్పైడర్ చిత్రానికి సంబంధించిన తొలిపాట నేడు విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పాట 3బూం బూం2 నేడు విడుదల చేస్తారు. మహేష్‌బాబు పుట్టినరోజున సందర్భంగా ఈనెల 9న టీజర్‌ను విడుదల చేయనున్నారు.
అనీష్ చందర్, పావని, ఆర్యన్, పూర్ణి ప్రధాన తారాగణంగా ప్లాన్ బి ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రేయా ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై ధృవశేఖర్ దర్శకత్వంలో భరత్ అవ్వారి రూపొందించిన చిత్రం 3లవ ర్స్ క్లబ్2. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, ట్రైలర్ విడుదలయ్యాయి. ఈ సినిమాను ఈనెల 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మాగంటి శ్రీనాధ్, సాక్షీకక్కర్, రచనాస్మిత్, రుచి పాండే ప్రధాన తారాగణంగా చిన్మయానంద ఫిలింస్ పతాకంపై వి.రవివర్మ దర్శకత్వంలో ఎస్.సరిత రూపొందిస్తున్న చిత్రం 3ఇదేం దెయ్యం2. ఈ సినిమాకు సంబంధించిన బాలుస్వామి అందించిన పాటల సీడీని హైదరాబాద్‌లో గతంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 4న విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు.
జయతి తొలిసారిగా హీరోయిన్‌గా నటిస్తూ రూపొందిస్తున్న చిత్రం 3లచ్చి2. ఈశ్వర్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ కామెడీ హారర్ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి సెప్టెంబర్ మొదటివారంలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు.
ఫిదా చిత్రంతో లైమ్‌లైట్‌లోకి వచ్చిన సాయిపల్లవి కథానాయికగా దుల్కర్ సల్మాన్ హీరోగా మలయాళంలో రూపొందించిన చిత్రం కలి. ఈ చిత్రాన్ని తెలుగులో డి.వి.కృష్ణస్వామి అనువదిస్తున్నారు. సమీర్ తాహిర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్, మిక్సింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ వారంలోనే సినిమా టైటిల్‌ను, లోగోను విడుదల చేయనున్నాము.