S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/28/2017 - 20:54

ధ్రువ క్రియేషన్స్ పతాకంపై అశోక్‌కుమార్, మానస జంటగా రూపొందించిన చిత్రం నాకు నేనే తోపు తరుము. జి.శివమణి దర్శకత్వంలో ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు హిందూమతాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని, హిం దూ జనశక్తి సంస్థ ప్రకటించడంతో దర్శక నిర్మాతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ- హిందువుల మనోభావాలను తాము గౌరవిస్తామని, ఏ మతాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని అన్నారు.

07/28/2017 - 20:52

సౌత్ క్రేజీ భామ శ్రుతిహాసన్, తన ప్రియుడు మైఖేల్ కోర్సెల్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందని ప్రస్తుతం మీడియా కోడై కూస్తోంది. గతంలో వీరిద్దరూ కలిసి తిరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల మైఖేల్‌ను శ్రుతి పెళ్లి చేసుకుందంటూ వార్తలు వచ్చాయి. అందువల్లే ఆమె సంఘమిత్ర సినిమా నుంచి తప్పుకుందనే వార్తలు కోలీవుడ్‌లో ఆసక్తిని రేకెత్తించాయి.

07/28/2017 - 20:48

ఈమధ్య లిప్‌లాక్ సన్నివేశాలు ప్రతి సినిమాలో సాధారణంగా మారాయి. ఈ విషయంలో బాలీవుడ్ తరువాతే ఎవరైనా. బాలీవుడ్‌లో సీరియల్ కిస్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఇమ్రాన్ హష్మి. ఆ తరువాత అదే రేంజ్‌లో ఇమేజ్ తెచ్చుకున్నాడు రణ్‌వీర్ సింగ్. ఇతగాడి సినిమాల్లో ముద్దుల వరద వుండనే వుంటుంది.

07/27/2017 - 21:00

ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న జై లవకుశ చిత్రం షూటింగ్ జోరుగా జరుగుతోంది. బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాటను పూణెలో చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ పాటలో ఎన్టీఆర్ డాన్స్‌తో అదరగొట్టాడని దాన్ని చూసిన దర్శకుడు షాకయ్యాడట. ఈ విషయాన్ని బాబి సోషల్ మీడియాలో ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఎన్టీఆర్ నా కళ్లముందు డాన్స్ చేయడం నమ్మలేని అనుభవం.

07/27/2017 - 20:59

అక్కినేని మూడోతరం వారసుడు అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నాగార్జున నిర్మిస్తున్నాడు. అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘అఖిల్’ భారీ పరాజయం పాలవ్వడంతో రెండో సినిమా కోసం చాలా టైమ్ తీసుకున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీపై రకరకాల ఊహాగానాలు విన్పిస్తున్నాయి.

07/27/2017 - 20:56

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న స్పైడర్ చిత్రం టాకీ పూర్తిచేసుకున్న విషయం తెలిసిందే. ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయిన ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ప్రస్తుతం చిత్రంలోని రొమాంటిక్ సాంగ్‌ను మహేష్, రకుల్‌లపై చిత్రీకరించనున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని పాటను వచ్చే నెల 2 నుంచి రుమేనియాలో చిత్రీకరించనున్నారు.

07/27/2017 - 20:55

హీరో సాయిధరమ్ తేజ్ బివిఎస్ రవి దర్శకత్వంలో జవాన్ సినిమా చేస్తూనే మరో కొత్త సినిమాపై ఫోకస్ పెట్టాడు. అది కూడా యూత్ పల్స్ తెలిసిన డైరక్టర్ మారుతి దర్శకత్వంలో కావడం విశేషం. ఫిలింనగర్ సమాచారం ప్రకారం ప్రస్తుతం చర్చల దశలో వున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిలో పట్టాలెక్కించే చాన్స్ ఉందట.

07/27/2017 - 20:52

సునీల్, మియాజార్జ్ జంటగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో పరుచూరి కిరీటి యునైటెడ్ కిరీటి మూవీస్ పతాకంపై రూపొందించిన చిత్రం ‘ఉంగరాల రాంబాబు’. అన్ని కమర్షియల్ హంగులతో రూపొందించిన ఈ సినిమా సునీల్ గత చిత్రాలకన్నా హై స్టాండర్డ్‌లో రూపొందిందని, క్రాంతిమాధవ్ తరహా మేకింగ్ వైవిధ్యంగా వుంటుందని నిర్మాత తెలిపారు.

07/27/2017 - 20:50

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న పైసావసూల్ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో కొత్త లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు బాలయ్య. అయితే బాలయ్యతో డేటింగ్ బాగుందని చెబుతోంది అందాల ముద్దుగుమ్మ ఖైదా అద్వానీ. ప్రస్తుతం బాలయ్య సరసన పైసా వసూల్ చిత్రంలో శ్రీయతోపాటు మరో హీరోయిన్‌గా నటిస్తున్న ఈమె, తాజాగా ఆయనతో కలిసి డిన్నర్ డేట్‌కు వెళ్లిందట. ఈ విషయాన్ని ఖైరా ట్విట్టర్ ద్వారా తెలిపారు.

07/27/2017 - 20:48

చరిత్ర నేపథ్యంలో మరో చిత్రం తెరకెక్కుతోంది. కథ, కానె్సప్ట్ ప్రధానంగా చరిత్రను ఆవిష్కరిస్తూ తెరకెక్కుతున్న చిత్రం ‘సువర్ణ సుందరి’. ‘చరిత్ర ఎప్పుడూ భవిష్యత్తును వెంటాడుతుంది’ అనేది టాగ్‌లైన్. ఎస్.టీమ్ పిక్చర్స్ బ్యానర్ సూర్య దర్శకత్వంలో ఎమ్.ఎల్.లక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ దాదాపు పూర్తవడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

Pages