S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/14/2017 - 20:49

తెలుగు సినిమా పరిశ్రమలో కొందరు నటీనటులు, సాంకేతిక నిపుణులు డ్రగ్స్ వాడుతున్నారన్న వార్త దావానలంగా టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. కొందరు సినీ ప్రముఖులకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయంటూ ఇటీవల తెలంగాణ ఎక్సయిజ్ శాఖ ఉన్నతాధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం మీడియాలో కొందరు సినీ నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల పేర్లు హల్‌చల్ చేశాయి.

07/13/2017 - 21:12

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న స్పైడర్ షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా వుంది. క్రేజీ డైరెక్టర్ మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దసరాకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిజానికి జూన్ 23న విడుదలవలసిన ఈ చిత్రం సినిమా షూటింగ్ పూర్తికాకపోవడంతో వాయిదా పడింది. గతంలో టీజర్, ఫస్ట్‌లుక్ విషయంలో పలుమార్లు వాయిదాలు పడ్డ విషయం తెలిసిందే.

07/13/2017 - 21:11

చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్రను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఉపేంద్ర అందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారో లేదో మాత్రం ప్రకటించాల్సి వుంది. గతంలో అల్లు అర్జున్‌తో ఉపేంద్ర నటించిన సంగతి తెలిసిందే. సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో ఉపేంద్ర నటించిన పాత్ర సినిమాకు కీలకంగా మారింది.

07/13/2017 - 21:10

వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు నారా రోహిత్. భిన్నమైన కథలను ఎంచుకుంటూ కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తున్నాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం శమంతకమణి. సందీప్ కిషన్, సుధీర్‌బాబు, ఆదిలతో కలిసి నారా రోహిత్ నటించిన ఈ చిత్రం గూర్చి ఆయన చెప్పిన వివరాలు. దర్శకుడు శ్రీరామ్ చెప్పిన కథ బాగా నచ్చడంతో ఒప్పుకున్నాను. తనకు కథపై మంచి క్లారిటీ వుంది. ఇందులో హీరోలుగా కంటే పాత్రల ద్వారానే మేం కన్పిస్తాం.

07/13/2017 - 21:08

రిషి, సోనియామాన్ జంటగా శేఖర్ సూరి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వరా సూపర్ మూవీస్ పతాకంపై ఎ.వెంకటేష్, శేఖర్, బి.రత్నమాలారెడ్డి నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ డా.చక్రవర్తి.

07/13/2017 - 21:06

ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు హీరో నాని. నాచురల్ స్టార్‌గా ఇమేజ్ తెచ్చుకున్న నాని డబుల్ హ్యాట్రిక్‌ను అందుకున్నాడు. తాజాగా ఆయన నటించిన ‘నిన్ను కోరి’ చిత్రం మంచి విజయాన్ని అందుకుని భారీ వసూళ్ల దిశగా అడుగులేస్తోంది. నాని కెరీర్‌లో అతి ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. వరుస విజయాలతో బిజీగా వున్న నానితో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు.

07/13/2017 - 21:05

జగపతిబాబు ప్రధాన పాత్రలో వాసు పరిమి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పటేల్ సర్. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది తాన్యాహోప్. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా తాన్యా చెప్పిన విశేషాలు..
ఫ్యామిలీ డ్రామా

07/13/2017 - 21:03

‘ఈ లోకానికి ఎవరినైనా తొలుత పరిచయం చేసేది అమ్మ. మహిళల వల్లనే జీవితం సాగుతుంది. ఈ ప్రయాణంలో స్ర్తి పాత్ర గొప్పది. అలాంటి స్ర్తిమూర్తికోసం ఓ గీతం ఉండాలని ఆలోచించడం, అలా ఆలోచించి శంకర్ మహదేవన్ లాంటి ఓ అద్భుతమైన గాయకుడితో పాడించడం మెచ్చదగిన ప్రయత్నం’ అని దర్శకుడు వివేక్ తెలిపారు.

07/13/2017 - 21:02

నాగ అనే్వష్, హెబ్బా పటేల్ జంటగా బాహుబలి పళని దర్శకత్వంలో శ్రీ సరస్వతీ ఫిలింస్ పతాకంపై ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఏంజిల్. సింధూరపువ్వు కృష్ణారెడ్డి సమర్పణలో భువనసాగర్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. తాజాగా ఏంజిల్ తమిళ వెర్షన్‌కు సంబంధించిన పాటలను చెన్నైలో విడుదల చేశారు.

07/13/2017 - 21:00

ప్రతీక్ ప్రేమ్‌కరణ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘వానవిల్లు’. రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై శ్రావ్య, శ్రీసరుూ్య కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని లంకా కరుణాకర్‌దాస్ రూపొందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. చిత్రంలోని ఓ యుగళగీతాన్ని దర్శకుడు సురేందర్‌రెడ్డి గురువారం విడుదల చేశారు.

Pages