S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/07/2016 - 21:20

బాలీవుడ్‌లో సల్మాన్ హీరోగా వచ్చిన ‘వీర్’ చిత్రంతో హీరోయిన్‌గా ప్రవేశించింది అందాల భామ జరీన్‌ఖాన్. ఆ సినిమా ఫ్లాప్ అవడంతో పాపం ఆమె ఆశలన్నీ నిరాశలయ్యాయి. అయినా కూడా అడపా దడపా వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుంది. అరడజనుపైగా సినిమాలు చేసినా కూడా పెద్దగా కెరీర్‌కు ఉపయోగపడలేదు. దాంతో ట్రాక్ మార్చిన ఈ భామ, అడల్డ్ కంటెంట్‌తో రూపొందిన ‘హేట్‌స్టోరీ-3’ చిత్రంలో నటించి సంచలనం రేపింది.

08/07/2016 - 21:19

సాయిరామ్‌శంకర్, నికిషాపటేల్ జంటగా శేషాద్రి క్రియేషన్స్ పతాకంపై వాసుదేవ్ దర్శకత్వంలో మేక బాలసుబ్రహ్మణ్యం, బి.్భస్కర్, వేగిరాజు ప్రసాదరాజు, రామేశ్వరి నక్కా సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘అరకురోడ్డులో’ ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి, శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు.

08/07/2016 - 21:18

ధనుష్, జెనీలియా, శ్రీయ ప్రధాన తారాగణంగా సూరజ్ ప్రొడక్షన్స్-2, టూ అవర్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జవహర్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రాన్ని తెలుగులో ఉమ, వై.వి.సత్యనారాయణ అందిస్తున్నారు. అనువాద కార్యక్రమాలు పూర్తిచేసుకుని, విడుదలకు సిద్ధమైన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు.

08/06/2016 - 21:03

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా, లారిస్సా బొనెసి, మన్నార చోప్రా హీరోయిన్లుగా సునీల్ రెడ్డి దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వరా మూవీ మేకర్స్ పతాకంపై రోహన్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘తిక్క’. ఈ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది బ్రెజిల్ భామ లారిస్సా బొనెసి. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సిద్ధం అయిన సందర్భంగా హీరోయిన్ లారిస్సా బొనెసితో ఇంట ర్వ్యూ..

08/06/2016 - 21:00

నాగార్జున, రాఘవేంద్రరావు కలయికలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ‘నమో వేంకటేశాయ’ చిత్రానికి సంబంధించి అనుష్క ఫస్ట్ లుక్ విడుదల చేశారు. హథీరామ్‌బాబా చరిత్రతో శ్రీ వేంకటేశ్వర స్వామి లీలను చిత్రిస్తూ సాగే ఈ చిత్రంలో అనుష్క కృష్ణమ్మ పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన తొలి చిత్రం నాగార్జున, అనుష్క అభిమానులను అలరిస్తోంది.

08/06/2016 - 20:58

టాలీవుడ్ దర్శకుల్లో మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ ఎవరంటే ముందుగా గుర్తొచ్చేది ‘పూరీ జగన్నాథ్’. దర్శకత్వమేగాక ఈయనకు రచయితగా కూడా మంచి పేరుంది. సినిమాకి అవసరమైతే డైలాగులు, పాటలు కూడా రాస్తుంటాడు పూరి. తాజాగా ఆయన ‘కల్యాణ్‌రామ్’ హీరోగా ‘ఇజం’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలోని ఓ కీలక సన్నివేశంకోసం పూరి పాట రాస్తున్నారు. అది ఏ సందర్భంకోసం, ఎలాంటి పాట అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

08/06/2016 - 20:56

బిచ్చగాడుగా తెలుగు ప్రేక్షకులను అలరించిన విజయ్ ఆంటోని మరోసారి భేతాళుడుగా రానున్నాడు. తమిళంలో రూపొందించిన సైతాన్ చిత్రాన్ని తెలుగులో భేతాళుడుగా అనువదించారు. మానస్ రుషి ఎంటర్‌ప్రైజెస్, విన్ విన్ విన్ క్రియేషన్స్ పతాకంపై నిర్మాత ఎస్.వేణుగోపాల్ తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

08/06/2016 - 20:55

సుశాంత్ కథానాయకుడిగా అన్నపూర్ణ స్టూడియో సమర్పణలో శ్రీ నాగ్ కార్పొరేషన్, శ్రీ జీ ఫిలింస్ పతాకంపై జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల రూపొందించిన చిత్రం ‘ఆటాడుకుందాం రా’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన అక్కినేని అఖిల్ ఆడియోను, ట్రైలర్‌ను హీరో సుమంత్ విడుదల చేశారు.

08/06/2016 - 20:52

ధీరు మహేష్, సుదర్శన్, సురేష్, ఇషికాసింగ్, ప్రియాంక ప్రధాన తారాగణంగా శ్రీ హరిహరా ఫిలింస్ పతాకంపై మాదాల కోటేశ్వరరావు దర్శకత్వంలో మధు, అనీష్, అభిరామ్ రూపొందిస్తున్న చిత్రం ‘కారులో షికారుకెళితే’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి సెన్సార్‌కు సిద్ధం చేశారు.

08/06/2016 - 20:51

ఈమధ్య బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా బాగా ఎక్కువయింది. ముఖ్యంగా ఇలాంటి.. సినిమాలు బాక్స్‌ఆఫీస్‌వద్ద దుమ్మురేపుతున్నాయి. అందులో లేడీ ఓరియెంటెడ్ సినిమాల మార్కెట్‌తో ఇప్పుడు చాలామంది ఈ తరహా సినిమాలు తీయడానికి సిద్ధంఅయ్యారు. లేటెస్ట్‌గా ఓ సినిమాకోసం హాట్‌భామ విద్యాబాలన్ ఏకంగా 18 కోట్లు అడిగిందట!! ఆ మొత్తం ఇవ్వడానికి నిర్మాతలు కూడా రెడీ అయ్యారు! నిజంగా బాలీవుడ్‌లో ఇది రికార్డ్ అని చెప్పాలి.

Pages